థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు
Breaking News
టాలీవుడ్‌లోకి జాక్వెలిన్ ఫెర్నాండెజ్..దర్శకుడు ఎవరంటే?
Published on Fri, 04/03/2026 - 15:46
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు టాలీవుడ్ వెండితెరపై మెరవడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు హిందీ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ భామ, ఇప్పుడు ఒక భారీ బడ్జెట్ తెలుగు సినిమాతో సౌత్ ఇండియాలోకి అడుగుపెడుతున్నారు. ‘పేపర్ బాయ్’, ‘అరి’ వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ జయశంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కమర్షియల్ హంగులతో పాటు వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమాను ఆయన తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. చిత్రంలోని అత్యంత కీలకమైన సన్నివేశాలను డార్జిలింగ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో సినిమాను రూపొందిస్తున్నారు.
ఈ క్రేజీ ప్రాజెక్టులో జాక్వెలిన్ సరసన నటించే హీరో ఎవరు? సినిమా టైటిల్ ఏమిటి? అనే విషయాలను చిత్ర యూనిట్ ప్రస్తుతానికి గోప్యంగా ఉంచింది. అయితే, టాలీవుడ్‌కు చెందిన ఒక స్టార్ హీరో ఇందులో నటిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. త్వరలోనే ఈ చిత్ర టైటిట్‌తో పాటు ఇతర నటీనటుల వివరాలను అధికారికంగా ప్రకటించేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది.
Tags : 1