Breaking News

14 ఏళ్లకే స్కూల్‌ డ్రాపౌట్‌..కానీ ఆ ఆవిష్కరణ..!

Published on Fri, 04/03/2026 - 10:31

అవసరం, ఆకలి  బాధ ఆ యువకుడని ఆవిష్కరణ బాట పట్టేలా చేసింది. అతడిలోని టాలెంట్‌ని వెలికితెచ్చేలా చేసి..జీవితానికి మార్గం చూపింది. అంతేగాదు ఎప్పుడో వదిలేసిన చదువు వైపుకి వెళ్లేలా చేసి..ఆకాశమంత ఎత్తుకు ఎదిగేలే అభ్యున్నతిని సాధించేందుకు దారితీసింది. తన జీవితంలోకి వచ్చిన ఆ వెలుగుని పదిమందికి పంచి తనలాంటి వాళ్ల అభ్యున్నతికి పాటుపడుతూ ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు.

అతడే కమ్‌క్వాంబా. దక్షిణాఫ్రికా మలావిలోని మసితాలా అనే గ్రామీణ గ్రామంలో పెరిగాడు క్వాంబా. అతని కుటుంబాని మొక్కజొన్న పంటే ఆధారం. 2001లో కరువు, భారీ వర్షాలు దీనికి తోడు ప్రభుత్వం ధాన్యం నిల్వలు అమ్మేయడంతో ఏర్పడిన తీవ్రమైన ఆహార సంక్షోభం కారణంగా కరువు సంభవించింది. దాంతో అతడి కుటుంబం స్కూల్‌ ఫీజులు భరించలేక అతడిని పాఠశాలకు పంపించడం మానుకుంది. 

అయితే ఒకరోజు తన గ్రామ గ్రంథాలయంలో 'యూజింగ్ ఎనర్జీ' అనే పుస్తకాన్ని అరువుతెచ్చుకుని మరి తన చదవుని కొనసాగించే ప్రయత్నం చేశాడు.  అందులోని గాలిమర అతడిని తెగ ఆకర్షిస్తుంది. అయితే ఆ పుస్తకం పూర్తిగా ఆంగ్లంలో ఉంది. అతనికి ఇంగ్లీష్‌ అంత బాగా రాదు. అయితే అందులోని బొమ్మలు అతడికి మార్గాన్ని చూపాయి. దాంతో అతడు పనికిరాని లోహపు ముక్కలు, ట్రాక్టర్‌ భాగాలు, సైకిల్‌ ముక్కలు, ప్లాస్టిక్‌ వస్తువులు, చెట్లకొమ్మలతో 16 అడుగుల గాలిమరను రూపొందించాడు. అయితే పనిచేస్తుందా లేదా అనే సందేహంతో భయపడతాడు. కానీ అనుహ్యంగా ఆ యంత్రం పనిచేస్తుంది. 

పైగా అది అతడి ఆకలి జీవితాన్ని మార్చేసింది. ఆ గాలిమర అతన కుటుంబంలో నాలుగు లైట్లు, రెండు రేడియోలకు విద్యుత్‌ అందించింది. త్వరలోనే పొరుగువారు ఫోన్‌లను ఛార్జ్‌ చేసుకునేందుకు వచ్చేవారు.  అలా ఆ ఒక్క ఆవిష్కరణ కామ్‌క్వాంబాను స్థానికంగా, జాతీయంగా వేలాదిమందికి సుపరిచితమైన వ్యక్తిగా మార్చింది. అతడి కథ వార్తపత్రికల నుంచి ఆన్‌లైన్‌లో వ్యాపించి..చివరికి టెడ్‌ దృష్టిని ఆకర్షించింది. ఆ విధంగా అతనికి TEDGlobalకు ఫెలోషిప్‌ ఆహ్వానం అందింది. అక్కడ క్వాంబ్‌ తన ఆవిష్కరణ గురించి, నీటి పారుదల కోసం గాలిమరను నిర్మించాలనే తన ఆకాంక్ష తిరిగి చదువుకోవాలనే చిరుఆశ గురించి మాట్లాడాడు.

అలా అతడు నిర్మించిన యంత్రం అతడి చదువుకి వారధిగా మారి..దక్షిణాఫ్రికాలోని ఆఫ్రికన్ లీడర్‌షిప్ అకాడమీలో చేరి చదువుకునే అవకాశం దక్కేలా చేసింది. ఆ తర్వాత  2014లో డార్ట్‌మౌత్ కాలేజీ నుంచి పర్యావరణ అధ్యయనాల డిగ్రీ పట్టాను పొందాడు. క్వాంబా ఆవిష్కరణలు అక్కడితో ఆగలేదు..తన గ్రామంలో విద్యుత్తుని ఉత్పత్తి చేయడానికి, నీటిని తోడటానికి ఇతర గాలిమరలను కూడా నిర్మించాడు. 2008లో, అతను 'మూవింగ్ విండ్‌మిల్స్ ప్రాజెక్ట్'ను సహ-స్థాపించాడు. ఈ ప్రాజెక్ట్ మసిటాలా ప్రాంత నివాసితులతో కలిసి స్వచ్ఛమైన నీటి బావులు, పాఠశాలలు, కమ్యూనిటీ సెంటర్ల కోసం సౌర ఫలకాలు,  రోజువారీ వ్యవసాయ సమస్యలకు సరళమైన పరిష్కారాలపై పనిచేస్తుంది. 

ఆ ఒక్క ఆవిష్కరణ మౌలిక సదుపాయల దిశగా నడిపించింది క్వాంబాని. తన ఇంటికే కాదు మొత్తం సమాజానికే ఉపయోగపడేలా సామాజిక సేవలో భాగమవుతున్నాడు. ఓ పేద బాలుడు..అతడి ఆకలి, అవసరాలు ఆవిష్కరణ దిశగా అడుగులు వేసి..ఎన్నో గొప్ప పనులు చేసేలా శ్రీకారం చుట్టింది. చిన్న చిన్న అవరోధాలు, సమస్యలకు బాధపడిపోయే యువత..క్వాంబా కథ గొప్ప ప్రేరణ.  ఏం రాదు, నావల్ల కాదు అనుకుంటూ కాలక్షేపం చేయకూడదు..అందుబాటులో ఉన్నవే గొప్పవిగా..అవే మనకు గమ్యాన్ని చూపే ఆయుధాలుగా మార్చుకోవాలని క్వాంబా కథ చెబుతోంది కదూ..!.

(చదవండి: రైజింగ్‌ కాన్షియస్‌ డాటర్స్‌’ ..! ప్లీజ్‌ కూతుళ్లను ఇలా పెంచుదాం..)

 

#

Tags : 1

Videos

థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు

కోల్ కతా నైట్ రైడర్స్ పై హైదరాబాద్ విజయం

ఒకేసారి 30 వేల మంది అవుట్.. ఒరాకిల్ మాజీ ఉద్యోగి సంచలన విషయాలు

జగన్ మావిగన్.. టీడీపీ ఉక్కిరిబిక్కిరి

గులాబీ రంగులో చంద్రుడు.. ఏదో జరగబోతోంది!

జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర, అనుచరులపై కేసు నమోదు

వీరులు పుట్టకముందే.. రాముడు ఉన్నాడు.. రామాయణం టీజర్ చూస్తే గూస్ బంప్స్ పక్కా

సాఫ్ట్ వేర్ సామ్రాజ్యం కుప్పకూలుతోందా?

చిక్కుల్లో TVK అధినేత హీరో విజయ్..

దళితుడిపై చేయి చేసుకున్న అయ్యన్నపాత్రుడు

Photos

+5

'ఇడియట్' రక్షిత బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

క్రీస్తు త్యాగం.. సమస్త మానవాళికీ స్ఫూర్తిదాయకం (ఫొటోలు)

+5

నల్లమల అడవి : తెలంగాణలో జరిగే ఈ సాహస యాత్ర గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఏపీలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ఈ గుహ గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఒంటిమిట్ట : వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వారి రథోత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర (ఫోటోలు)

+5

మార్చి జ్ఞాపకాల్లో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టి జంట (ఫోటోలు)

+5

రూటు మార్చిన శృతి హాసన్‌.. ఈ సారి వయ్యారంగా.. (ఫోటోలు)

+5

సినీ కెరీర్‌.. సంతృప్తిగా లేనంటున్న హీరోయిన్‌ (ఫోటోలు)

+5

తెలంగాణ అమర్‌నాథ్‌ యాత్ర సలేశ్వరం జాతర ప్రారంభం (ఫొటోలు)