Breaking News

లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త కార్లు ఇవే..

Published on Thu, 04/02/2026 - 21:19

2026 మొదలై మూడు నెలలు పూర్తయిపోయింది. ఈ కాలంలో లెక్కకు మించిన కార్లను దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఇంకొన్ని వాహనాలను లాంచ్ కావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ కథనంలో ఏప్రిల్ నెలలో లాంచ్ అయ్యే కొత్త కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్
ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్ ఏప్రిల్ 9న లాంచ్ కానుంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ సరికొత్త స్టైలింగ్‌తో వస్తుంది. ఇందులో అప్డేటెడ్ గ్రిల్, ఆకర్షణీయమైన ఎల్ఈడీ హెడ్‌లైట్లు, మెరుగైన ఇంటీరియర్స్ వంటివి ఉన్నాయి. అప్‌డేటెడ్ క్యాబిన్ చాలా సౌకర్యవంతంగా ఉంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో ఇది బలమైన పోటీ ఇవ్వనుంది.

టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా
500 కిలోమీటర్ల కంటే ఎక్కువ డ్రైవింగ్ రేంజ్ అందించే.. అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ కానుంది. ఇది లేటెస్ట్ డిజైన్ క్లస్టర్, 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ పొందుతుంది. దీనిని కొనుగోలుదారులు బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) కింద కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ కారు సిటీ, హైవే డ్రైవ్‌ కోసం చాలా అద్భుతంగా ఉంటుందని సమాచారం.

ఎంజీ మెజెస్టర్
ఎంజీ మెజెస్టర్ కారు కూడా ఈ నెలలో లాంచ్ అయ్యే పాపులర్ కార్ల జాబితాలో ఒకటి. ఇది ఏడీఏఎస్, మసాజ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి వాటితో పాటు.. కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. ఇది 2.0-లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్‌ పొందనుంది. ఆఫ్-రోడ్ సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది.

2026 మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్
2026 మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ కూడా లాంచ్ కావడానికి సిద్ధమవుతోంది. ఇది కూడా అప్డేటెడ్ స్టైలింగ్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో సరికొత్త డాష్‌బోర్డ్, మెరుగైన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సేఫ్టీ టెక్నాలజీ కూడా ఉన్నాయి. ఇది సాధారణ బ్రేజ్జా కంటే కూడా మంచి పనితీరును అందిస్తుందని సమాచారం.

మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్
మహీంద్రా స్కార్పియో ఎన్ ఫేస్‌లిఫ్ట్.. లేటెస్ట్ టెక్నాలజీ, అప్‌గ్రేడ్ ఇంటీరియర్‌లను పొందుతుంది. ఇంజన్ ఆప్షన్లు దాదాపుగా ఒకేలా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ఈ ఎస్‌యూవీ ప్రీమియం సౌకర్యం, మెరుగైన ఇన్ఫోటైన్‌మెంట్ ఉండనున్నాయి. కాబట్టి ఇది విలాసవంతమైన హంగులతో కూడిన.. గొప్ప పనితీరును ఇష్టపడే కొనుగోలుదారులకు ఇది ఒక మంచి ఎంపికగా నిలుస్తుంది.

ఇదీ చదవండి: ఒరాకిల్ భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు ప్రయోజనాలు!

#

Tags : 1

Videos

థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు

కోల్ కతా నైట్ రైడర్స్ పై హైదరాబాద్ విజయం

ఒకేసారి 30 వేల మంది అవుట్.. ఒరాకిల్ మాజీ ఉద్యోగి సంచలన విషయాలు

జగన్ మావిగన్.. టీడీపీ ఉక్కిరిబిక్కిరి

గులాబీ రంగులో చంద్రుడు.. ఏదో జరగబోతోంది!

జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర, అనుచరులపై కేసు నమోదు

వీరులు పుట్టకముందే.. రాముడు ఉన్నాడు.. రామాయణం టీజర్ చూస్తే గూస్ బంప్స్ పక్కా

సాఫ్ట్ వేర్ సామ్రాజ్యం కుప్పకూలుతోందా?

చిక్కుల్లో TVK అధినేత హీరో విజయ్..

దళితుడిపై చేయి చేసుకున్న అయ్యన్నపాత్రుడు

Photos

+5

నేపాల్ ట్రిప్‌లో యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ (ఫొటోలు)

+5

డైరెక్టర్ పోస్టు.. స్పెషల్ ఎట్రాక్షన్‌గా హీరోయిన్ (ఫొటోలు)

+5

'ఇడియట్' రక్షిత బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

క్రీస్తు త్యాగం.. సమస్త మానవాళికీ స్ఫూర్తిదాయకం (ఫొటోలు)

+5

నల్లమల అడవి : తెలంగాణలో జరిగే ఈ సాహస యాత్ర గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఏపీలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ఈ గుహ గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ఒంటిమిట్ట : వైభవంగా శ్రీ కోదండ రామస్వామి వారి రథోత్సవం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర (ఫోటోలు)

+5

మార్చి జ్ఞాపకాల్లో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టి జంట (ఫోటోలు)

+5

రూటు మార్చిన శృతి హాసన్‌.. ఈ సారి వయ్యారంగా.. (ఫోటోలు)