Breaking News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా?

Published on Thu, 04/02/2026 - 13:19

వీకెండ్‌ వచ్చిందంటే చాలు కుటుంబంతోనో, స్నేహితులతోనో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లడం ఇప్పుడు సర్వసాధారణం. భోజనం ముగించి బిల్లు చేతికి రాగానే అన్నీ సరి చూసుకుంటాం. కానీ అందులో ‘సర్వీస్ ఛార్జీ’ పేరుతో అదనంగా 5 నుంచి 10 శాతం వరకు బిల్లులో వసూలు చేస్తుండడం గమనించే ఉంటారు. ఇది తప్పనిసరి అని హోటల్‌ సిబ్బంది వాదించవచ్చు, లేదా మీ అనుమతి అడగకుండానే బిల్లులో వేసేయవచ్చు. అసలు ఈ సర్వీస్ ఛార్జీని కస్టమర్లు కచ్చితంగా చెల్లించాలా? చట్టం ఏం చెబుతోంది? వంటి అంశాలను చూద్దాం.

సర్వీస్ ఛార్జీ ‘ట్యాక్స్‌’ కాదు!

చాలామంది వినియోగదారులు సర్వీస్ టాక్స్ (సేవా పన్ను)కు, ‘సర్వీస్ ఛార్జీ’కి మధ్య ఉన్న తేడా తెలియక అయోమయానికి గురవుతుంటారు. జీఎస్టీ అనేది ప్రభుత్వం విధించే చట్టబద్ధమైన పన్ను. ఇది ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా చెల్లించాలి. సర్వీస్ ఛార్జీ అనేది రెస్టారెంట్ యాజమాన్యం తమ సిబ్బంది సేవలకు గుర్తింపుగా (టిప్‌కు బదులుగా) విధించే రుసుము. ఇది ప్రభుత్వానికి వెళ్లే పన్ను కాదు. కేంద్ర వినియోగదారుల పరిరక్షణ ప్రాధికార సంస్థ (సీసీపీఏ) మార్గదర్శకాల ప్రకారం, సర్వీస్ ఛార్జీ అనేది పూర్తిగా ఆప్షనల్‌. కస్టమర్ అనుమతి లేకుండా దీన్ని బిల్లులో చేర్చడం వినియోగదారుల హక్కుల ఉల్లంఘనే అవుతుంది.

రెస్టారెంట్లు ఏం చేయవచ్చు.. ఏం చేయకూడదు?

కొన్ని రెస్టారెంట్లు తమ మెనూ కార్డులో ‘మేము సర్వీస్ ఛార్జీ విధిస్తాం’ అని రాసి ఉండవచ్చు. అయితే, కేవలం మెనూ కార్డులో రాసి ఉన్నంత మాత్రాన దాన్ని తప్పనిసరిగా చెల్లించాల్సిన అవసరం లేదు. సర్వీస్ ఛార్జీ చెల్లించలేదని కస్టమర్‌ను వేధించడం, సర్వీస్ నిరాకరించడం లేదా రెస్టారెంట్‌లోకి రాకుండా అడ్డుకోవడం చట్టవిరుద్ధం. వారి సర్వీసు నచ్చకపోతే లేదా మీకు ఇష్టం లేకపోతే సదరు ఛార్జీని తొలగించమని అడిగే పూర్తి హక్కు కస్టమర్లకు ఉంది.

సాధారణంగా వినియోగదారులు ఏం చేస్తారు?

రద్దీగా ఉన్న సమయంలో గొడవ ఎందుకని చాలామంది మౌనంగా చెల్లిస్తుంటారు. కొందరు ఇది ప్రభుత్వ పన్నుగా భావిస్తారు. ఛార్జీని తొలగించమని అడిగితే తక్కువగా చూస్తారేమోనన్న ఇంకొందరు సంకోచిస్తారు. బిల్లులో చివరలో దీన్ని కలపడం వల్ల అది మొత్తంలో భాగమని చెల్లిస్తుంటారు.

అసలు ఏం చేయాలి?

బిల్లు జనరేట్ కాకముందే సర్వీస్ ఛార్జీని మినహాయించి బిల్లు ఇవ్వమని కోరండి. సిబ్బందితో వాదించకుండా ఇది చెల్లించడం ఆప్షనల్‌ అని ప్రశాంతంగా హోటల్‌ యాజమాన్యానికి వివరించండి. ఒకవేళ హోటల్ యాజమాన్యం మొండిగా వ్యవహరించి బలవంతంగా వసూలు చేస్తే ఆ బిల్లును సాక్ష్యంగా ఉంచుకుని నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్(1915)కు ఫిర్యాదు చేయవచ్చు.

ఎలాంటి సమయాల్లో చెల్లించవచ్చు?

మీకు అందించిన సర్వీసులు అద్భుతంగా ఉందని మీరు భావిస్తే ఆ సిబ్బందిని ప్రోత్సహించడానికి సర్వీస్ ఛార్జీ రూపంలో లేదా నేరుగా టిప్ రూపంలో నగదును స్వచ్ఛందంగా ఇవ్వవచ్చు. ఇది పూర్తిగా మీ విచక్షణపై ఆధారపడి ఉంటుంది.

ఇదీ చదవండి: పాకిస్థాన్‌కు వీసా నిలిపివేసిన ఖతార్

Videos

పేద బాలికలే అతడి టార్గెట్ చదివిస్తానని నమ్మించి..

రికార్డు స్థాయిలో ఏపీలో మద్యం వినియోగం

తిరుమలలో భారీ అగ్ని ప్రమాదం మంటల్లో కాలిపోయిన టాటా సుమో

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..

చమురు, గ్యాస్ కాదు.. ఈసారి కండోమ్ వంతు!

మచిలీపట్నంలో హైటెన్షన్.. జనసేన నేత ఇంటిని కూల్చేసిన టీడీపీ నేతలు

అమరావతి వృద్ధ మహిళా రైతు శేషగిరమ్మకు YS జగన్ భరోసా

నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు..అవసరమైతే KCR కాళ్ళు పట్టుకు నైనా సరే..

అమరావతి పేరుతో చంద్రబాబు ఆంధ్రప్రజలను మోసం చేస్తున్నారు

వైఎస్ జగన్‌ని ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు

Photos

+5

హైదరాబాద్‌లో ఘనంగా హనుమాన్‌ శోభాయాత్ర (ఫోటోలు)

+5

మార్చి జ్ఞాపకాల్లో నిక్కీ గల్రానీ-ఆది పినిశెట్టి జంట (ఫోటోలు)

+5

రూటు మార్చిన శృతి హాసన్‌.. ఈ సారి వయ్యారంగా.. (ఫోటోలు)

+5

సినీ కెరీర్‌.. సంతృప్తిగా లేనంటున్న హీరోయిన్‌ (ఫోటోలు)

+5

తెలంగాణ అమర్‌నాథ్‌ యాత్ర సలేశ్వరం జాతర ప్రారంభం (ఫొటోలు)

+5

దారులన్నీ కొండగట్టుకే.. భారీగా తరలివస్తున్న భక్తులు (ఫొటోలు)

+5

వామ్మో ఎండలు.. (ఫొటోలు)

+5

డిజైన్లకే రూ.401కోట్లు ఖర్చు..ఏంది సామీ ఇదంతా!: వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో అల్లు అర్జున్ కుటుంబం (ఫొటోలు)

+5

దేవతలా మిస్ ఇండియా నికితా పోర్వాల్‌..! (ఫొటోలు)