పేద బాలికలే అతడి టార్గెట్ చదివిస్తానని నమ్మించి..
Breaking News
హైదరాబాద్‌లో పడిపోయిన ఇళ్ల అమ్మకాలు
Published on Thu, 04/02/2026 - 10:50
న్యూఢిల్లీ: హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా టాప్–9 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (జనవరి–మార్చి) క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 13 శాతం తగ్గి 98,761 యూనిట్లకు పరిమితమయ్యాయి. లక్ష యూనిట్లలోపు విక్రయాలు పడిపోవడం 18 త్రైమాసికాల తర్వాత ఇదే ప్రథమం.
2025 జనవరి–మార్చి కాలంలో టాప్–9 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు 1,13,602 యూనిట్లు కాగా, 2025 చివరి త్రైమాసికంలో 1,05,527 యూనిట్లుగా ఉన్నాయి. పశ్చిమాసియా సంక్షోభం కొనుగోలు సెంటిమెంట్‌పై ప్రభావం చూపించినట్టు, తాజా సరఫరా తగ్గడం కూడా కారణమని ప్రాప్‌ఈక్విటీ సంస్థ పేర్కొంది. ముఖ్యంగా టాప్–9లో ఢిల్లీ ఎన్‌సీఆర్, బెంగళూరు మినహా మిగిలిన అన్ని నగరాల్లో ఇళ్ల విక్రయాలు పడిపోయాయి.
హైదరాబాద్‌లో ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 11,546 యూనిట్ల ఇళ్లు అమ్ముడయ్యాయి. 2025 జనవరి–మార్చి కాలంలో విక్రయాలు 13,725 యూనిట్లతో పోల్చితే 16 శాతం తగ్గాయి.
బెంగళూరులో ఇళ్ల అమ్మకాలు ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 17,991 యూనిట్లుగా ఉన్నాయి. 2025 మొదటి త్రైమాసికంలో అమ్మకాలు 17,508 యూనిట్లతో పోల్చితే 3 శాతం పెరిగాయి.
ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో 12,141 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2025 మొదటి త్రైమాసికంలో విక్రయాలు 10,723 యూనిట్లతో పోల్చితే 13 శాతం పెరిగాయి.
చెన్నైలో 4 శాతం తక్కువగా 4,765 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.
ముంబైలో ఇళ్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 20 శాతం పడిపోయి 9,186 యూనిట్లకు పరిమితమయ్యాయి.
నవీ ముంబైలో ఇళ్ల విక్రయాలు 7,157 యూనిట్లుగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చితే 14 శాతం తగ్గాయి.
థానేలోనూ 24 శాతం తక్కువగా 15,959 యూనిట్ల విక్రయాలు జరిగాయి.
పుణెలో 16,144 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది ఇదే కాలంలో విక్రయాలు 21,640 యూనిట్ల కంటే 25 శాతం తగ్గాయి.
కోల్‌కతాలో 8 శాతం తక్కువగా 3,872 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి.
కొత్త ప్రాజెక్టుల సరఫరా జనవరి మార్చి మధ్య 92,411 యూనిట్లుగా ఉంది. 2025 మొదటి క్వార్టర్‌లో సరఫరా 1,14,718 యూనిట్ల కంటే 19 శాతం తగ్గింది.
Tags : 1