ఆరోగ్యం భేష్.. ఆర్థిక ప్రణాళికలే వీక్!

Published on Wed, 04/01/2026 - 12:30

దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఆరోగ్య సంరక్షణపై అవగాహన మెరుగుపడినప్పటికీ పదవీ విరమణ అనంతర ఆర్థిక భద్రత విషయంలో మాత్రం ఇంకాస్త అప్రమత్తత అవసరమని తాజా గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్, కాంతార్‌తో కలిసి నిర్వహించిన ఐదో ‘ఇండియా రిటైర్మెంట్ ఇండెక్స్ స్టడీ (ఐరిస్‌ 5.0)’ నివేదికలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. దక్షిణాదిలో రిటైర్మెంట్ ఇండెక్స్ 2022లో 43 పాయింట్లు ఉండగా 2025 నాటికి అది స్వల్పంగా మారి 45కు చేరింది. అయితే జాతీయ సగటు (44 నుంచి 48కి)తో పోలిస్తే ఈ వృద్ధి నెమ్మదిగానే ఉంది.

నివేదికలోని అంశాలు..

  • దక్షిణాది ప్రజలు తమ ఫిట్‌నెస్‌పై మునుపటి కంటే ఎక్కువ దృష్టి సారిస్తున్నట్లు నివేదిక స్పష్టం చేస్తోంది.

  • ప్రతిరోజూ వ్యాయామం చేసే వారి సంఖ్య 37% నుంచి 44%కి పెరిగింది. ఇది జాతీయ వృద్ధి రేటు కంటే ఎక్కువ.

  • ఆరోగ్య ధీమా: సుమారు 80 శాతం మంది తాము పదవీ విరమణ తర్వాత కూడా ఆరోగ్యంగా ఉంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

  • డిజిటల్ హెల్త్: వెల్నెస్ యాప్‌లను ఉపయోగించడంలో దక్షిణాది వాసులు (18%) జాతీయ సగటు (15%) కంటే ముందున్నారు.

  • బీమా: హెల్త్ చెకప్‌ల పట్ల ఆసక్తి పెరిగినప్పటికీ ఆరోగ్య బీమా వినియోగం మాత్రం 44% వద్దే నిలిచిపోయింది. ఇది జాతీయ సగటు (50%) కంటే తక్కువగా ఉండటం గమనార్హం.

10 ఏళ్లకే నిధులు ఖాళీ?

  • పదవీ విరమణ ప్రణాళిక అనేది అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని 54% మంది భావిస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం వెనుకబడి ఉన్నారు.

  • దేశవ్యాప్తంగా 67% మంది రిటైర్మెంట్ కోసం పెట్టుబడి పెడుతుంటే దక్షిణాదిలో అది కేవలం 61% మాత్రమే ఉంది.

  • రిస్క్ ఉన్నా అధిక లాభాలనిచ్చే ఇన్వెస్ట్‌మెంట్లలో పెట్టుబడులు కేవలం 33% మాత్రమే ఉండగా, ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి సాంప్రదాయ పద్ధతులపైనే (58%) ఎక్కువగా ఆధారపడుతున్నారు.

  • తమ పొదుపు మొత్తాలు రిటైర్మెంట్ తర్వాత పదేళ్లకు మించి రావని 27% మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ ఆస్తులు (39%), ఇతర తక్షణ ఖర్చుల (33%) కారణంగా పదవీ విరమణ పొదుపుపై దృష్టి పెట్టలేకపోతున్నామని సర్వేలో తేలింది.

ఒంటరితనం దూరం

ఆర్థికంగా వెనుకబడటం మినహాయిస్తే కుటుంబ మద్దతు విషయంలో దక్షిణాది వాసులు ధైర్యంగా ఉన్నారు. రిటైర్మెంట్ తర్వాత కుటుంబ సభ్యులు అండగా ఉంటారనే నమ్మకం 57 శాతానికి పెరిగింది. గతంలో 75 శాతంగా ఉన్న ఒంటరితనపు భయంతో ఉండేవారు. ప్రస్తుతం ఇది 68 శాతానికి తగ్గడం సానుకూల పరిణామం.

‘ఆరోగ్యం, వెల్నెస్ పట్ల అవగాహన పెరగడం శుభపరిణామం. అయితే ఆలోచనలకు ఆచరణ తోడైనప్పుడే పూర్తిస్థాయి పదవీ విరమణ భద్రత లభిస్తుంది. ఆర్థిక ప్రణాళికల్లో ఉన్న ఈ అంతరాన్ని పూడ్చాల్సిన అవసరం ఉంది’ అని యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ డైరెక్టర్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ రాహుల్ తల్వార్ అన్నారు. దక్షిణాదిలో ప్రజలు ఆరోగ్యంగా, మానసికంగా బలంగా మారుతున్నప్పటికీ ఆర్థికంగా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవడంలో ఇంకా వెనుకంజలోనే ఉన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాల వైపు మదుపు చేయడం ద్వారానే సురక్షితమైన భవిష్యత్తు సాధ్యమని ఈ నివేదిక హెచ్చరిస్తోంది.

ఇదీ చదవండి: చమురు, గ్యాస్‌ కాదు.. ఈసారి కండోమ్‌ల వంతు!

Videos

ఎవరిది గోల్డ్.. ఎవరిది రోల్ గోల్డ్..?

క్యారెక్టర్ లేని వారికే ఆలయాల చైర్మన్ పదవులు

గోల్డ్ లవర్స్ కు షాక్..భారీగా పెరిగిన బంగారం ధరలు

రఘురామరాజుకు కారుమూరి నాగేశ్వరరావు కౌంటర్

నీ నక్క తెలివితేటలు... జగన్ దెబ్బకు ఢిల్లీలో దాక్కున్నావ్...

ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ దిమ్మతిరిగే కౌంటర్

చర్చలు కాదు.. యుద్ధానికి రెడీ.. UAE సంచలన ప్రకటన

విజయ్ ఆస్తులు, అప్పులు ఎంత? తెలిస్తే షాక్ అవుతారు

Breaking News : పెట్రోల్ ధరలు పెరగలేదు

జగన్ కట్టిన ఇళ్లపై బాబు వీడియో చూపించి మరి ఇచ్చిపడేసిన నాగమల్లేశ్వరి

Photos

+5

వామ్మో ఎండలు.. (ఫొటోలు)

+5

డిజైన్లకే రూ.401కోట్లు ఖర్చు..ఏంది సామీ ఇదంతా!: వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో అల్లు అర్జున్ కుటుంబం (ఫొటోలు)

+5

దేవతలా మిస్ ఇండియా నికితా పోర్వాల్‌..! (ఫొటోలు)

+5

'పల్లి చట్టంబి' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

‘బ్యాండ్‌ మేళం’ మూవీ థ్యాంక్ యూ మీట్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఘనంగా భగవాన్‌ మహావీర్‌ జయంతి వేడుకలు (ఫొటోలు)

+5

పైలట్‌ని పెళ్లి చేసుకున్న హీరోయిన్ జనని (ఫొటోలు)

+5

భార్యతో కలిసి హీరో నితిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మార్చి నెల జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ (ఫొటోలు)