పిల్లలను అలా పెంచాలి..! న్యూరో సెంటిస్ట్‌ పేరెంటింగ్‌ టిప్స్‌

Published on Wed, 04/01/2026 - 10:20

పిల్లల పెంపకంపై చాలామంది నిపుణులు, ప్రముఖులు అమూల్యమైన సలహాలు అందించడం తెలిసిందే. కానీ తాజాగా దీనిపై న్యూరో సైంటిస్ట్‌ ఆసక్తికరమైన సలహాలు సూచనలందించారు. పిల్లను అలా పెంచితేనే ప్రయోజకులవుతారని నమ్మకంగా చెప్పారు. సిస్టమేటిక్‌వేలో పెంచడం కాదు..ఛాలెంజ్‌లను ఎదుర్కొనే ధీరుల్లా పెంచడం ఎలాగో సవివరంగా వివరించారు. మరి అవేంటో తెలుసుకుందామా..!.

అమెరికాకు చెందిన న్యూరోసైంటిస్ట్‌, వ్యవస్థాపకురాలు వివియెన్‌ మింగ్‌ నేటి విద్యావ్యవస్థ ఆర్టిఫిషియెల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) రూపుదిద్దుకునే భవిష్యత్తుకు అనుగుణంగా పెంచడం లేదని అన్నారు. చాలా పాఠశాలలు ఇప్పటికీ బట్టిపట్టడం, పరీక్ష స్కోర్‌లపైనే దృష్టిసారిస్తున్నాయని అన్నారు. అయితే వీటన్నింటిని ఐఏ ఇప్పటికే వేగవంతంగా సమర్థవంతంగా చేయగలదని అన్నారు. తమ పిల్లలు భవిష్యత్తులో మంచి ప్రయోజకులుగా మారాలనకునే తల్లిదండ్రులు ఈ మూడు చిట్కాలను ఫాలో అవ్వాలని అన్నారు. 

అలాగే వారిని రోబోట్‌ ప్రూఫ్‌గా ఎలా పెంచాలో కూడా తెలిపారు. ఆమె దీనిని వేలాదిమంది పరిశోధన చేసి మరి చెబుతున్నారు. లోతైన పరిశోధనలకు మూలం తప్పిదాలే అని అన్నారు. వైఫల్యాలను అంగీకరించే విద్యార్థులు స్ట్రాంగ్‌గా తయావుతారని, పైగా బలమైన నైపుణ్యాలను అందిపుచ్చుకోగలరని అన్నారు.

హార్వర్డ్ ఎఫెక్ట్..
అంటే ఊహకందని ఆవిష్కరణలను ప్రోత్సహించే వాతావరణాన్ని ఉద్దేశపూర్వకంగా సృష్టిచడం అని చెప్పారు. పిల్లల్లో దాగున్న విభిన్న ఆసక్తులను అన్వేషించాలి, ప్రశ్నలు అడగాలి, ముగింపు లేని సమస్యలపై పనిచేసేలా చేయాలి. అది వాళ్లను జ్ఞానాన్ని సముపార్జించేలా చేసి సామర్థ్యాలను పెంపొందించేలా చేస్తుందని అన్నారు.

ఏఐ కంటే జీనియస్‌గా..
ఇక పిల్లలు ఏఐని సాధనంగా ఉపయోగించాలి కానీ, ఆలోచనలకు ‍ప్రత్యామ్నాయంగా కాదని అన్నారు. ఫీడ్‌బ్యాక్‌ కోసం ఉపయోగించొచ్చు కానీ, ముందుగా మాత్రం వారి స్వంత ఆలోచనలను పెంపొదించుకోవాలని అన్నారు. తాను 30 ఏళ్లుగా మెషిన్‌ లెర్నింగ్‌తో ఆడుకుంటున్నాను అయితే లార్జ్ లెర్నింగ్ మోడల్స్ (LLMలు) నిరంతర సహచరుడిగా ఉండే ప్రపంచంలోకి ఇప్పుడిప్పుడే అడుగుపెడుతున్న ఈతరానికి కష్టమైనది దానికే వదిలేయాలన్న బలహీనతగా ఎక్కువగా ఉంటుందనేది గుర్తెరగాలని అన్నారు. అందుకే పిల్లలను ఐఏకి మించిన నైఫుణ్యలను అందిపుచ్చుకునేలా పెంచాలి. అంటే వారిలో..

సృజనాత్మకత: పిల్లలకు సృజనాత్మక ఆలోచనలను ప్రోత్సహించడం, వారు కొత్త ఆలోచనలు, పరిష్కారాలను కనుగొనేలా చేయడం

భావోద్వేగ నైపుణ్యాలు: ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, సహాయం చేయడం, సానుభూతి చూపించడం వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేయడం.

సామాజిక నైపుణ్యాలు: పిల్లలు ఇతరులతో ఎలా మాట్లాడాలో, సంబంధాలు ఎలా నిర్మించాలో నేర్చుకోవడం.

సమస్యలు పరిష్కరించే సామర్థ్యం: సాంకేతికతను ఉపయోగించి సమస్యలను ఎలా పరిష్కరించాలో నేర్చుకోవడం.

ఈ విధంగా, పిల్లలు రోబోట్స్ చేయలేని పనులను చేసేలా పెంచితే..భవిష్యత్తులో మరింత విలువైన వ్యక్తులుగా, గొప్ప ప్రయోజకులుగా మారతారని చెబుతున్నారు న్యూరో సైంటిస్ట్‌ మింగ్‌.

(చదవండి: గాయనికి 'స్టిఫ్ పర్సన్ సిండ్రోమ్'..! ఎందువల్ల వస్తుందంటే..)

Videos

ఎవరిది గోల్డ్.. ఎవరిది రోల్ గోల్డ్..?

క్యారెక్టర్ లేని వారికే ఆలయాల చైర్మన్ పదవులు

గోల్డ్ లవర్స్ కు షాక్..భారీగా పెరిగిన బంగారం ధరలు

రఘురామరాజుకు కారుమూరి నాగేశ్వరరావు కౌంటర్

నీ నక్క తెలివితేటలు... జగన్ దెబ్బకు ఢిల్లీలో దాక్కున్నావ్...

ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ దిమ్మతిరిగే కౌంటర్

చర్చలు కాదు.. యుద్ధానికి రెడీ.. UAE సంచలన ప్రకటన

విజయ్ ఆస్తులు, అప్పులు ఎంత? తెలిస్తే షాక్ అవుతారు

Breaking News : పెట్రోల్ ధరలు పెరగలేదు

జగన్ కట్టిన ఇళ్లపై బాబు వీడియో చూపించి మరి ఇచ్చిపడేసిన నాగమల్లేశ్వరి

Photos

+5

వామ్మో ఎండలు.. (ఫొటోలు)

+5

డిజైన్లకే రూ.401కోట్లు ఖర్చు..ఏంది సామీ ఇదంతా!: వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో అల్లు అర్జున్ కుటుంబం (ఫొటోలు)

+5

దేవతలా మిస్ ఇండియా నికితా పోర్వాల్‌..! (ఫొటోలు)

+5

'పల్లి చట్టంబి' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

‘బ్యాండ్‌ మేళం’ మూవీ థ్యాంక్ యూ మీట్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఘనంగా భగవాన్‌ మహావీర్‌ జయంతి వేడుకలు (ఫొటోలు)

+5

పైలట్‌ని పెళ్లి చేసుకున్న హీరోయిన్ జనని (ఫొటోలు)

+5

భార్యతో కలిసి హీరో నితిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మార్చి నెల జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ (ఫొటోలు)