కొంచమైనా సిగ్గు ఉందా? ఈనాడు పిచ్చి రాతలపై దాడిశెట్టి రాజా ఆగ్రహం
భారత్లో ఒరాకిల్ 12,000 మందికి ఉద్వాసన
Published on Wed, 04/01/2026 - 03:14
న్యూఢిల్లీ: యూఎస్ ఐటీ దిగ్గజం ఒరాకిల్ తాజాగా దేశీయంగా విధులు నిర్వహిస్తున్న 12,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు తెలుస్తోంది. ఈ బాటలో ప్రపంచవ్యాప్తంగా 30,000 ఉద్యోగాలకు కోత పెట్టినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. వచ్చే నెలలో మరింత మందిని ఉద్యోగాల నుంచి తప్పించనున్నట్లు సమాచారం. దేశీయంగా కంపెనీలో సుమారు 30,000 మంది పనిచేస్తున్నారు.
అయితే ఈ అంశాలపై స్పందించేందుకు ఒరాకిల్ నిరాకరించడం గమనార్హం! సిబ్బందికి ఈమెయిల్ ద్వారా ఉద్యోగ కోత వివరాలను ఒరాకిల్ వెల్లడించినట్లు తెలుస్తోంది. కనీసం ఏడాదిపాటు సేవలందించిన ఉద్యోగులకు 15 రోజుల వేతనంసహా.. లీవ్ ఎన్క్యా‹Ùమెంట్, అర్హతగలవారికి గ్రాట్యుటీ తదితర ప్రయోజనాలు ఆఫర్ చేస్తోంది.
#
Tags : 1