ఇష్టపడి కొన్న బైక్‌ని జీవిత అమ్మేసింది : రాజశేఖర్‌

Published on Tue, 03/31/2026 - 19:33

శర్వానంద్‌ హీరోగా నటింటిన తాజా చిత్రం ‘బైకర్‌’. అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సీనియర్‌ హీరో రాజశేఖర్‌ కీలక పాత్ర పోషించారు. ఏప్రిల్‌ 3న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా రాజశేఖర్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

చాలా రోజుల తర్వాత నేను చేసిన సినిమా రిలీజ్ అవుతోంది. నేను బాగా ఇష్టపడి చేసిన సినిమా బైకర్. ఎప్పుడు ఏప్రిల్ 3 వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది చాలా ఆనందంగా ఉంది. నేను నటించిన సినిమా ఇది. నా సినిమాలానే ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఆడియన్స్  ఎంతలా మెచ్చుకుంటారు? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

నేను ఏ క్యారెక్టర్ చేసిన అది బాగుండాలి, నాకు నచ్చాలి. అప్పుడే నేను చేయగలుగుతాను. అలాగే క్యారెక్టర్ బాగుంటే సరిపోదు. సినిమా కూడా అద్భుతంగా ఆడాలి. కథ బాగుండాలి. నేను బైకర్ కథ విన్నప్పుడు నా క్యారెక్టర్, కథ రెండు నచ్చే ఈ సినిమా చేశాను. బైకర్ కథ పరంగా సూపర్ గా హిట్ అవుతుంది. అలాగే నా క్యారెక్టర్ కూడా అద్భుతంగా వచ్చింది. సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.

నాకు చిన్నప్పటినుంచి బైక్స్ అంటే చాలా ఇష్టం. మా అమ్మమ్మగారింట్లో ఒక బుల్లెట్ బండి ఉండేది. నేను సెలవుల్లో అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఆ ఊరు మొత్తం బుల్లెట్లో తిరిగేవాడిని. ఆ తర్వాత  బైక్స్ మీద ఆసక్తి పెరుగుతూ వచ్చింది. శేషు సినిమా సమయంలో స్వయంగా నేనే యమహా సిక్స్ ఫిఫ్టీ సిసి బండి కొనుక్కొని ఆ షూటింగ్ కి వాడడం జరిగింది. ఆ తర్వాత అదే బైక్ ని  రోజు నడుపుకునేవాడిని. నేను నడిపే విధానం చూసి 'మీరు చాలా రిస్క్ తో నడుపుతున్నారని నాకు తెలియకుండానే జీవిత ఆ బైక్  అమ్మేశారు (నవ్వుతూ).

అభిలాష్ గారు చాలా మంచి డైరెక్టర్. ఒక యాక్టర్ నుంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ కావాలో ఆయనకి చాలా క్లారిటీ ఉంటుంది. ఆయన కథ మీద క్యారెక్టర్ మీద చాలా గ్రిప్ ఉన్నా దర్శకుడు . ఆయన అనుకునది వచ్చేంతవరకు ఎక్కడ కూడా రాజీపడరు. చాలా ఇన్వాల్వ్మెంట్ ఉన్న డైరెక్టర్.

ఇందులో బైక్ రేసింగ్ సీన్స్ అద్భుతంగా ఉంటాయి. ఒక హాలీవుడ్ రేంజ్ సినిమాలా ఉంటుంది. అలాగే ఫాదర్ సన్ ఎమోషన్ కూడా అద్భుతంగా ఉంటుంది. చాలా సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయి.

నా కుటుంబమే నా బలం.  ఈ సినిమా,  నా క్యారెక్టర్  ఇంత అద్భుతంగా రావడానికి  ఒక కారణం జీవిత, మా పిల్లలు. వాళ్ల సపోర్టు చాలా గొప్పది. ఈ సినిమా నేను చేసినప్పుడు నన్ను స్కూల్ కి డ్రాప్ చేసి మళ్లీ అక్కడి నుంచి తీసుకొచ్చే ఒక మదర్ లాగా చూసుకున్నారు.

కొత్త సినిమాల విషయాలకొస్తే..పవన్ సాదినేనితో 'మగాడు' అనే సినిమా చేస్తున్నాను. అది ఇంకా 20% మిగిలింది. నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్ అనుకుంటున్నారు. అలాగే నేను రమ్య విశ్వదేవ్ శివాని కలిసి ఒక సినిమా చేస్తున్నాం. అది షూటింగ్ జరుగుతుంది త్వరలోనే టైటిల్ రిలీజ్ చేస్తాం.  బైకర్ తో పాటు ఈ రెండు సినిమాలు కూడా కచ్చితంగా నా కెరీర్లో చాలా మంచి సినిమాలు అవుతాయని నమ్మకం ఉంది.

Videos

కొంచమైనా సిగ్గు ఉందా? ఈనాడు పిచ్చి రాతలపై దాడిశెట్టి రాజా ఆగ్రహం

పశ్చిమాసియాలో హైఅలర్ట్.. కువైట్ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ ను పేల్చేసిన ఇరాన్

వైఎస్ జగన్‌ను కలిసిన గురజాల నియోజకవర్గ స్థానిక నేతలు

బీజేపీలో చేరిన టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్

అమెరికాపై యుద్ధం ఎఫెక్ట్ భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

అమరావతి చట్టబద్దత పేరుతో బాబు డైవర్షన్ పాలిటిక్స్

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై, YSRCP రౌండ్ టేబుల్ సమావేశం

సినీ ఇండస్ట్రీ పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఈవారం ఇన్వెస్టర్లకు పండగే.. బోనస్, స్టాక్ స్ప్రిట్, డివిడెండ్లు కుమ్మరించనున్న స్టాక్స్ ఇవే..!

అంబులెన్సును తోస్తున్న పోలీసులు

Photos

+5

ఘనంగా భగవాన్‌ మహావీర్‌ జయంతి వేడుకలు (ఫొటోలు)

+5

పైలట్‌ని పెళ్లి చేసుకున్న హీరోయిన్ జనని (ఫొటోలు)

+5

భార్యతో కలిసి హీరో నితిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మార్చి నెల జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ (ఫొటోలు)

+5

రాకాస ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మెరిసిన నీహారిక.. (ఫొటోలు)

+5

బెంగళూరు : కనువిందుగా హారతి దీపాల వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్: మధ్యాహ్నం భానుడి భగభగలు.. సాయంత్రం వరుణుడి పలకరింపు (ఫొటోలు)

+5

‘రాకాస’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కిరణ్‌ అబ్బవరం ‘చెన్నై లవ్‌ స్టోరీ’ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన గుహ గురించి మీకు తెలుసా? (ఫొటోలు)