హీరో విజయ్‌కి వేల కోట్ల ఆస్తులు.. అప్పులు ఎంతంటే?

Published on Tue, 03/31/2026 - 14:28

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ ఇప్పుడు రాజకీయాలలో ఫుల్‌ బిజీ అయిపోయాడు. సొంతంగా టీవీకే పార్టీని స్థాపించి.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నాడు. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాల్లో టీవీకే పోటీ చేస్తోంది. ఇందులో విజయ్‌ చెన్నైలోని పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నాడు. ఆదివారం అభ్యర్థులను ప్రకటించిన విజయ్‌.. సోమవారం ఆయన నామినేషన్‌ దాఖలు చేశాడు.

రూ.600 కోట్లు..
ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను అఫిడవిట్ లో పొందుపరిచిన విషయం తెలిసిందే . అయితే ఇక్కడ తన భార్య సంగీత ఆస్తులను కూడా ఆయన జమ చేయడం గమనార్హం. విజయ్‌ తన స్థిర, చరాస్తుల విలువలను దాదాపు రూ.600 కోట్లుగా అఫిడవిట్‌లో వెల్లడించాడు.  అందులో నగదు రూపంలో తన వద్ద రూ.2 లక్షలు, తన భార్య సంగీత వద్ద లక్ష రూపాయలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నాడు. విధ బ్యాంకుల్లో సేవింగ్స్‌, ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రూపంలో రూ.388 కోట్లు ఉన్నట్లు తెలిపారు. ఆయన పేరుమీద రూపాయి అప్పు కూడా లేదని అఫిడవిట్‌లో వెల్లడించాడు.

లగ్జరీ కార్లు.. ఫ్యామిలీకి అప్పు
ఇక తన వాహనాల వివరాలను కూడా అఫిడవిట్‌లో పొందుపరిచాడు. తన వద్ద బిఎండబ్ల్యూ 530, బీఎండబ్ల్యూ ఐ7, టయోటా లెక్సస్ 350, టయోటా వెల్ఫేర్ వంటి ఖరీదైన కార్లతో పాటు మారుతి సుజుకి స్విఫ్ట్, టీవీఎస్ ఎక్సెల్ సూపర్ వంటి వాహనాలు కూడా ఉన్నట్లు తెలిపారు. ఇక వాహనాల మొత్తం విలువ రూ.14.35 కోట్లు అని వెల్లడించారు. అలాగే తన వద్ద 883 గ్రాముల బంగారం, 15 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నాయని అఫిడవిట్ లో పేర్కొన్నారు.  అంతేకాదు తన కుటుంబ సభ్యులకు కొంత డబ్బును అప్పుగా ఇచ్చాడట. తన సతీమణి సంగీతకు రూ. 12.60 కోట్లు, తండ్రి చంద్రశేఖర్‌కి రూ.3.02 కోట్లు, తల్లికి రూ. 87.12 లక్షలు, కొడుకుకి రూ. 8.78 లక్షలు, కూతురు దివ్యకి రూ. 4.6 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు తెలిపాడు.దీంతో పాటు తన టీవీకే పార్టీలో కీలక నేత అయిన ఎన్‌ ఆనంద్‌కి రూ. 3 కోట్లు ఇచ్చినట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నాడు. 


సంగీత పేరుపై కూడా భారీ ఆస్తులు
విజయ్‌ అఫిడవిట్‌లో తన భార్య సంగీత ఆస్తుల వివరాలను కూడా వెల్లడించాడు. తన భార్య వద్ద రూ. 4.07 కోట్ల విలువైన బంగారం, రెండు కేజీల వెండితో పాటు కోటి రూపాయల విలువైన వజ్రాలు ఉన్నాయి. సంగీత మొత్తం చరాస్తుల విలువ రూ.15.51 కోట్లు , స్థిరాస్తుల విలువ 25 లక్షలుగా వెల్లడించారు . తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. 

Videos

కొంచమైనా సిగ్గు ఉందా? ఈనాడు పిచ్చి రాతలపై దాడిశెట్టి రాజా ఆగ్రహం

పశ్చిమాసియాలో హైఅలర్ట్.. కువైట్ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ ను పేల్చేసిన ఇరాన్

వైఎస్ జగన్‌ను కలిసిన గురజాల నియోజకవర్గ స్థానిక నేతలు

బీజేపీలో చేరిన టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్

అమెరికాపై యుద్ధం ఎఫెక్ట్ భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

అమరావతి చట్టబద్దత పేరుతో బాబు డైవర్షన్ పాలిటిక్స్

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై, YSRCP రౌండ్ టేబుల్ సమావేశం

సినీ ఇండస్ట్రీ పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఈవారం ఇన్వెస్టర్లకు పండగే.. బోనస్, స్టాక్ స్ప్రిట్, డివిడెండ్లు కుమ్మరించనున్న స్టాక్స్ ఇవే..!

అంబులెన్సును తోస్తున్న పోలీసులు

Photos

+5

ఘనంగా భగవాన్‌ మహావీర్‌ జయంతి వేడుకలు (ఫొటోలు)

+5

పైలట్‌ని పెళ్లి చేసుకున్న హీరోయిన్ జనని (ఫొటోలు)

+5

భార్యతో కలిసి హీరో నితిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మార్చి నెల జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ (ఫొటోలు)

+5

రాకాస ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మెరిసిన నీహారిక.. (ఫొటోలు)

+5

బెంగళూరు : కనువిందుగా హారతి దీపాల వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్: మధ్యాహ్నం భానుడి భగభగలు.. సాయంత్రం వరుణుడి పలకరింపు (ఫొటోలు)

+5

‘రాకాస’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కిరణ్‌ అబ్బవరం ‘చెన్నై లవ్‌ స్టోరీ’ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన గుహ గురించి మీకు తెలుసా? (ఫొటోలు)