బిర్యానీ వండిన స్టార్‌ హీరో.. వీడియో వైరల్

Published on Tue, 03/31/2026 - 11:24

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌ ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. కాస్తా గ్యాప్‌ దొరికితే కార్ రేసింగ్‌లో దిగిపోతుంటారు. తాజాగా అజిత్‌ కుమార్ చెన్నైలోని ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. తన భార్య షాలినితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చెన్నైకి చెందిన ఫుట్‌బాల్ క్లబ్‌ ఎఫ్‌సీ మద్రాస్ నిర్వహించిన ఈవెంట్‌లో అజిత్, షాలిని సందడి చేశారు. ఈ సందర్భంగా అజిత్ బిర్యానీ వండుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో షాలిని.. తన భర్తను ఆటపట్టించారు. నేను చెప్పినట్లుగా చేసావా? అంటూ అజిత్‌ను సరదాగా అడిగింది. ఆ తర్వాత అజిత్ దంపతులకు తాము అతిథ్యమివ్వడం అదృష్టంగా భావిస్తున్నామని ఎఫ్‌సీ మద్రాస్‌ పేర్కొంది. మనదేశానికి మోటార్‌స్పోర్ట్స్‌.. అలాగే దేశాన్ని ప్రపంచ రేసింగ్ పటంలో నిలపాలన్న అజిత్ కుమార్ దార్శనికత నిజంగా స్ఫూర్తిదాయకమని కొనియాడారు. క్రీడలకు ప్రథమ ప్రాధాన్యతనిస్తూ ఛాంపియన్‌లను తయారు చేయడంలో.. భారతదేశంలో క్రీడాకారులను తీర్చిదిద్దడంలో అజిత్‌తో కలిసి పనిచేస్తామని ఎఫ్‌సీ మద్రాస్ ప్రకటించింది.

ఇక అజిత్ సినిమాల విషయానికొస్తే దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తో  మరోసారి జత కట్టనున్నారు. ఇంకా ఈ మూవీ పనులు ప్రారంభించలేదు. ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రారంభం కావాల్సి ఉండగా.. ‍అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఈ గ్యాప్‌లోనే అజిత్ కుమార్ మోటార్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో పాల్గొంటున్నారు.
 

 

Videos

కొంచమైనా సిగ్గు ఉందా? ఈనాడు పిచ్చి రాతలపై దాడిశెట్టి రాజా ఆగ్రహం

పశ్చిమాసియాలో హైఅలర్ట్.. కువైట్ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ ను పేల్చేసిన ఇరాన్

వైఎస్ జగన్‌ను కలిసిన గురజాల నియోజకవర్గ స్థానిక నేతలు

బీజేపీలో చేరిన టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్

అమెరికాపై యుద్ధం ఎఫెక్ట్ భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

అమరావతి చట్టబద్దత పేరుతో బాబు డైవర్షన్ పాలిటిక్స్

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై, YSRCP రౌండ్ టేబుల్ సమావేశం

సినీ ఇండస్ట్రీ పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఈవారం ఇన్వెస్టర్లకు పండగే.. బోనస్, స్టాక్ స్ప్రిట్, డివిడెండ్లు కుమ్మరించనున్న స్టాక్స్ ఇవే..!

అంబులెన్సును తోస్తున్న పోలీసులు

Photos

+5

ఘనంగా భగవాన్‌ మహావీర్‌ జయంతి వేడుకలు (ఫొటోలు)

+5

పైలట్‌ని పెళ్లి చేసుకున్న హీరోయిన్ జనని (ఫొటోలు)

+5

భార్యతో కలిసి హీరో నితిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మార్చి నెల జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ (ఫొటోలు)

+5

రాకాస ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మెరిసిన నీహారిక.. (ఫొటోలు)

+5

బెంగళూరు : కనువిందుగా హారతి దీపాల వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్: మధ్యాహ్నం భానుడి భగభగలు.. సాయంత్రం వరుణుడి పలకరింపు (ఫొటోలు)

+5

‘రాకాస’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కిరణ్‌ అబ్బవరం ‘చెన్నై లవ్‌ స్టోరీ’ సాంగ్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన గుహ గురించి మీకు తెలుసా? (ఫొటోలు)