కొంచమైనా సిగ్గు ఉందా? ఈనాడు పిచ్చి రాతలపై దాడిశెట్టి రాజా ఆగ్రహం
Breaking News
మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి: సోనమ్‌కపూర్
Published on Tue, 03/31/2026 - 03:06
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఇంట సంతోషాలు రెట్టింపు అయ్యాయి. ఈ నెల 29న సోనమ్ కపూర్ పండంటి మగ శిశువుకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించి, తన ఆనందాన్ని వ్యక్తం చేశారు సోనమ్. ‘‘ప్రేమతో నిండిన మా హృదయాలతో మా బాబు రాకను మేం ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నాం. మరో బిడ్డ రాకతో మా ఇంట ఆనందం వెల్లివిరిసింది. మా హృదయాలు మరింత సంతోషంతో నిండిపోయాయి.
వాయు(పెద్ద కుమారుడు) తన తమ్ముడిని స్వాగతించడానికి ఆసక్తిగా ఉన్నాడు. నలుగురు ఉన్న కుటుంబంగా మా జీవితాల్లో మేం ఓ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాం. అందరికీ కృతజ్ఞతలు.. ప్రేమతో సోనమ్, ఆనంద్, వాయు’’ అన్న నోట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు సోనమ్ కపూర్. సోనమ్‌కపూర్ (నటుడు– నిర్మాత అనిల్ కపూర్ కుమార్తె) వివాహం వ్యాపారవేత్త ఆనంద్ ఆహుజ తో 2018లో జరిగింది. ఈ దంపతులకు 2022లో కుమారుడు ‘వాయు’ జన్మించిన సంగతి తెలిసిందే.
Tags : 1