క్రూర మృగాల్లా వెంట పడుతున్న వీధి కుక్కలు
Breaking News
4 లక్షల చాక్లెట్లు ట్రక్కుతో సహా మాయం
Published on Mon, 03/30/2026 - 14:15
"హ్యావ్ ఏ బ్రేక్.. హ్యావ్ ఏ కిట్‌కాట్" అనేది ఆ బ్రాండ్ ఐకానిక్ నినాదం. అయితే, కొంతమంది దొంగలు ఈ స్లోగన్‌ను మరీ సీరియస్‌గా తీసుకున్నట్లున్నారు. ఏకంగా 12 టన్నుల కిట్‌కాట్ చాక్లెట్లతో నిండిన ట్రక్కునే మాయం చేసి, తీపి దొంగతనానికి తెరలేపారు. ఈస్టర్ పండుగ వేళ ఐరోపాలో జరిగిన ఈ భారీ దోపిడీ ఇప్పుడు సంచలనంగా మారింది.
ఏం జరిగింది?
మార్చి 26న మధ్య ఇటలీలోని ఒక ఫ్యాక్టరీ నుండి పోలాండ్‌లోని పంపిణీదారులకు బయలుదేరిన ఈ ట్రక్కు మార్గమధ్యలో అదృశ్యమైంది. ఇందులో సుమారు 4,13,793 కిట్‌కాట్ యూనిట్లు ఉన్నాయి. దీనిపై మాతృ సంస్థ నెస్లే ప్రతినిధులు స్పందిస్తూ.. "వాహనం, లోడ్ జాడ ఇంకా దొరకలేదు" అని ధ్రువీకరించారు.
ఫార్ములా వన్ చాక్లెట్లు
దొంగిలించిన ఈ స్టాక్‌లో కిట్‌కాట్ కొత్తగా ప్రవేశపెట్టిన 'ఫార్ములా వన్ (F1)'థీమ్ చాక్లెట్లు ఉండటం గమనార్హం. గత ఏడాది F1 అధికారిక భాగస్వామిగా మారిన తర్వాత, రేసు కార్ల ఆకారంలో ఈ ప్రత్యేక వేఫర్ చాక్లెట్లను నెస్లే రూపొందించింది. ఇప్పుడు ఈ ఖరీదైన, పరిమిత ఎడిషన్ చాక్లెట్లన్నీ దొంగల పాలయ్యాయి.
"మా బ్రాండ్ నినాదాన్ని దొంగలు అక్షరాలా పాటించి, 12 టన్నుల చాక్లెట్లతో విరామం తీసుకున్నట్లు కనిపిస్తోంది. నేరస్థుల రుచిని మేము అభినందిస్తున్నప్పటికీ, ఇది వ్యాపారాలకు పెద్ద సవాలుగా మారింది" నెస్లే పేర్కొంది.
నిఘా నీడలో చాక్లెట్లు
ఈ దోపిడీపై నెస్లే సంస్థ వినియోగదారులను, రిటైలర్లను అప్రమత్తం చేసింది. ప్రతి ప్యాకేజీపై ఉండే బ్యాచ్ కోడ్ ద్వారా ఉత్పత్తిని ట్రాక్ చేయవచ్చని చెప్పింది. ఎవరైనా అనధికారిక మార్గాల ద్వారా ఈ చాక్లెట్లను విక్రయిస్తుంటే, స్కాన్ చేసి అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఈ దోపిడీ వల్ల మార్కెట్‌లో కిట్‌కాట్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగదని, వినియోగదారుల భద్రతకు సంబంధించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సంస్థ స్పష్టం చేసింది. ప్రస్తుతం స్థానిక పోలీసులు, సప్లయి చైన్ భాగస్వాములతో కలిసి ఈ 'తీపి' దొంగల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Regarding recent press coverage pic.twitter.com/Huh4EnFV2J
— KITKAT (@KITKAT) March 29, 2026
Tags : 1