క్రూర మృగాల్లా వెంట పడుతున్న వీధి కుక్కలు
Breaking News
హనీ రోజ్‌కు చేదు అనుభవం.. అసభ్యంగా తాకుతూ..!
Published on Mon, 03/30/2026 - 12:38
మలయాళ బ్యూటీ హనీ రోజ్‌కు చేదు అనుభవం ఎదురైంది. కేరళలోని ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వెళ్లిన ఆమెతో కొందరు అసభ్యంగా ప్రవర్తించారు. షాపింగ్ మాల్ దగ్గర హీరోయిన్‌తో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. వారితో సెల్ఫీ దిగే సమయంలో ఒకరు ఆమె నడుముపై చేతులు వేస్తూ కనిపించారు. దీంతో అసౌర్యానికి గురైన హనీ రోజ్ వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారి తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. సెలబ్రిటీలను అలా వేధించడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హనీ రోజ్ సినిమా కెరీర్..
ఈ మలయాళ బ్యూటీ 2008లో ఆలయం సినిమాతో తెలుగువారికి పరిచయమైంది. ఆ తర్వాత ఈ వర్షం సాక్షిగా (2014) చిత్రంలో నటించింది. దాదాపు దశాబ్దకాలం గ్యాప్ ఇచ్చాక వీరసింహారెడ్డితో మెరిసింది. ఈ చిత్రంతోనే హనీరోజ్ టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకుంది.
నటి హాని రోజ్ కు చేదు అనుభవం..నడుమును తాకుతూ..
కేరళంలో నిన్న జరిగిన ఓ షాపింగ్‌మాల్ ఓపెనింగ్ వేడుకలో నటి హనీరోజ్‌కు చేదు అనుభవం ఎదురైంది.
ఆమెతో సెల్ఫీ దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. కొందరు అత్యుత్సాహంతో సెల్ఫీ తీసుకుంటుండగా ఆమె నడుమును తాకుతూ ఇబ్బంది పెట్టారు.
దీంతో హనీరోజ్… pic.twitter.com/MlL4PriZHo— Sakshi (@SakshiNews) March 30, 2026
Tags : 1