Breaking News

సద్గురు పేరెంటింగ్‌ సలహా..! నటి అలియా భట్‌ రియాక్షన్‌..

Published on Sun, 03/29/2026 - 17:03

బాలీవుడ్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీ కపుల్‌ అలియా భట్, రణబీర్ కపూర్‌లు. 'బ్రహ్మాస్త్ర' సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడిన వీరు, ఐదేళ్ల డేటింగ్ అనంతరం ఏప్రిల్ 14, 2022న వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు రాహా అనే కుమార్తె ఉంది. అయితే అలియా ఇటీవల చెన్నైలో JITO చెన్నై ప్లస్ (జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్) నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. 

అక్కడ 'ఇన్ కన్వర్సేషన్ విత్ ది మిస్టిక్' పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో అలియా భట్, సద్గురు ఆధ్యాత్మిక సంభాషణలలో పాల్గొన్నారు. అక్కడ ఆమె సద్గురుని పిల్లల పెంపకంపై సలహా కోరుతూ ఆయనను ఇలా అడిగారు. "తాము మంచి తల్లిదండ్రులుగా ఉంటున్నామో లేదో అని ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు మీరు ఇచ్చే ఒకే ఒక్క సలహా ఏమిటి?" అని సూటిగా ప్రశ్నించారు. ఆయన నవ్వుతూ, "ఆందోళన చెందే తల్లిదండ్రులు మంచి తల్లిదండ్రులు కారు" అని అన్నారు. 

ఆ మాటకు అలియా వెంటనే నవ్వులు చిందించారు. ఆ తర్వాత ఆధ్యాత్మిక గురువు అలియా భట్‌ను తన బిడ్డ గురించి ఎక్కువగా ఆందోళన చెందవద్దని హెచ్చరించారు. అలాగే ఆందోళన చెందడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని సూచించారు కూడా. ఆయన సలహాకు అక్కడ ఉన్న ప్రేక్షకులు కూడా పగలబడి నవ్వారు. కాసేపటి తర్వాత అలియా పిల్లల పెంపకం విషయంలో ఆందోళనను పక్కన పెట్టగలమని అస్సలు అనుకోలేనన్నారు. 

సద్గురు మీరు కూడా దీన్ని అంగీకరిస్తారనే అనుకుంటున్నా అని నవ్వుతూ అన్నారామె. రాహా పుట్టినప్పుడు, అలియా భట్, రణబీర్ కపూర్ దంపతులు ఆమె ఫోటోలు తీయవద్దని పాపరాజీలను కోరారు. నిజానికి, వారు చాలా కాలం పాటు ఆమె ముఖాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. కాగా, ఆలియా కెరీర్‌​ పరంగా  'ఆల్ఫా',  'లవ్‌ అండ్‌ వార్‌' చిత్రాలలో కనిపించనున్నారు.  ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదే విడుదల కానున్నాయి.

 

(చదవండి: కాలులో ఆకస్మికంగా భరించలేని నొప్పి..క్షణాల్లో ప్రాణాంతకంగా మారి..)

 

Videos

భారీ అగ్నిప్రమాదం.. పక్కనే పెట్రోల్ బంకు..

ఇదేమన్నా తొక్కుడు బిళ్ళ అనుకున్నావా.. అమరావతి రైతులతో ఆటలా..

వచ్చేది జగనే.. నువ్వు ఏ మాత్రం భయపడకు.. పవన్ వ్యాఖ్యలకు కేతిరెడ్డి కౌంటర్

ఇజ్రాయెల్ ఆకాశంలో వేల సంఖ్యలో కాకులు.. ఇది వినాశనానికి సంకేతమా?

వారణాసి, స్పిరిట్ కు సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన ధురంధర్

చంద్రబాబు సొంత జిల్లాలో TDP కి అవమానం

ఛత్తీస్ గఢ్ లో అరుదైన దృశ్యం.. సహపంక్తి భోజనాలు చేసిన మాజీ మావోయిస్టులు, పోలీసులు

సూపర్ పవర్ గేమ్ లో భారత్ డైలమా..

యూనివర్సిటీలపై దాడులు.. యూఎస్,ఇజ్రాయెల్ కు ఇరాన్ వార్నింగ్

తమిళనాడులో విజయ్ దూకుడు

Photos

+5

ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో నమ్రత (ఫోటోలు)

+5

ఫ్యాషన్‌ షోలో నగధగలు..అలరించిన మోడల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29- ఏప్రిల్ 05)

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)