Breaking News

‘బైకర్‌’ శర్వానంద్‌ 23 కిలోలు తగ్గాడు: అభిలాష్‌ రెడ్డి

Published on Sun, 03/29/2026 - 10:57

శర్వానంద్‌ హీరోగా అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బైకర్‌’. ఈ మూవీలో మాళవికా నాయర్‌ హీరోయిన్‌గా నటించగా, రాజశేఖర్, అతుల్‌ కులకర్ణి ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. విక్రమ్‌ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌పై వంశీ, ప్రమోద్‌ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 3న విడుదల కానుంది. 

ఈ సందర్భంగా శనివారం విలేకరుల సమావేశంలో అభిలాష్‌ రెడ్డి కంకర మాట్లాడుతూ– ‘‘బైకర్‌’లో రేసింగ్‌తో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఉన్నాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన కల్పిత కథ ఇది. తండ్రీ–కొడుకుల మధ్య ఉండే ఎమోషన్‌ ప్రేక్షకులకు కనెక్ట్‌ అవుతుంది. శర్వానంద్‌గారి నటన అద్భుతంగా ఉంటుంది. ఈ చిత్రం కోసం ఆయన ఆరు నెలలు ఫిజికల్‌గా, మెంటల్‌గా ప్రిపేర్‌ అయ్యారు. 23 కేజీల బరువు తగ్గారు.

 ‘బైకర్‌’ను శర్వాగారు తన కెరీర్‌లోనే బెస్ట్‌ ఫిల్మ్‌గా చెప్పారు. ఇందులో శర్వాగారి తండ్రి, కోచ్‌ పాత్రలో రాజశేఖర్‌గారు నటించారు. ఆయన చుట్టూ ఈ కథ తిరుగుతుంది. శర్వానంద్, రాజశేఖర్‌గార్లు, మాళవిక ... ఇలా అందరూ ‘బైకర్‌’ సినిమా ఫస్ట్‌ నరేషన్‌లోనే ఓకే చెప్పారు. ఈ కథకు అంతలా కనెక్ట్‌ అయ్యారు. 

కథ 1990, 2000.. ఇలా రెండు డిఫరెంట్‌ టైమ్‌లైన్స్‌లో జరుగుతుంది. యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించడానికే దాదాపు 60 రోజులు పట్టింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల నుంచి రేసర్స్‌ను తీసుకువచ్చి చిత్రీకరించాం. అలాగే 90స్‌లోని రెండు స్పోర్ట్స్‌ బైక్స్‌ ఉండేవి, అవి ఇప్పుడు లేవు. వాటిని డిజైన్‌ చేయడానికి చాలా టైమ్‌ పట్టింది. ఇండియాలో శ్యామ్‌ కొఠారి అనే రేసర్‌ ఉన్నారు. క్రికెటర్‌గా కపిల్‌ దేవ్‌కి వచ్చినంత గుర్తింపు, రేసింగ్‌లో శ్యామ్‌ కొఠారీకి రాలేదు. 

మా సినిమా మోటివ్‌ కూడా ఇలాంటి గుర్తింపులు దక్కాలనే. మా నిర్మాతలు ఫస్ట్‌ కాపీ చూసి, హ్యాపీగా ఉన్నారు. త్రీడీలో చేద్దామని నిర్మాతలు అడిగితే నేనే వద్దన్నాను. సౌండ్, ఆర్‌ఆర్‌ విషయంలో జిబ్రాన్‌ సరికొత్త మ్యూజిక్‌ అందించారు. ఈ సినిమా చూసిన ఆడియన్స్‌ ఓ మంచి ఫీలింగ్‌తో బయటకు వస్తారు. నా తర్వాతి సినిమా ‘దిల్‌’ రాజుగారితో ఉంటుంది’’ అన్నారు. 

Videos

ఛత్తీస్ గఢ్ లో అరుదైన దృశ్యం.. సహపంక్తి భోజనాలు చేసిన మాజీ మావోయిస్టులు, పోలీసులు

సూపర్ పవర్ గేమ్ లో భారత్ డైలమా..

యూనివర్సిటీలపై దాడులు.. యూఎస్,ఇజ్రాయెల్ కు ఇరాన్ వార్నింగ్

తమిళనాడులో విజయ్ దూకుడు

రుక్మిణిని Unfollow చేసిన రిషబ్.. అసలేమైనట్టు..!

బంగారం అమ్మే సరైన సమయం ఇదే.. లాభం డబుల్ చేసే ట్రిక్!

వైరల్ అవుతోన్న రామ్ చరణ్ హోమం

తడబడుతున్న చంద్రబాబు.. థిస్ ఇస్ వెరీ బ్యాడ్

భర్తను చంపి పక్కనే పాతిపెట్టిన భార్య.. ట్విస్ట్ ఏంటంటే..?

సుబ్బారెడ్డి VS అఖిలప్రియ.. ఆళ్లగడ్డలో కేబుల్ వార్

Photos

+5

ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో నమ్రత (ఫోటోలు)

+5

ఫ్యాషన్‌ షోలో నగధగలు..అలరించిన మోడల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29- ఏప్రిల్ 05)

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)