Breaking News

ఎదురు చూపుల్లో కృతిశెట్టి..!

Published on Sun, 03/29/2026 - 06:29

అవకాశాలను అందిపుచ్చుకుని నటిస్తున్నప్పటికీ నటి కృతిశెట్టిని విజయాలు మాత్రం వరించడం లేదు. అసలు ఈ మంగుళూరు భామ తెలుగులో నటించిన ఉప్పెన చిత్రం సంచలన విజయం సాధిస్తుందని, ఎవరు ఊహించలేదు. తొలి చిత్రమే మంచి పేరు తెచ్చిపెట్టడంతో తన  కెరీర్‌  వెలిగిపోతుందని కృతిశెట్టి(Krithi Shetty) తెగ సంబరపడింది. అనుకున్నట్లుగానే  వరుసగా అవకాశాలు వచ్చి పడ్డాయి. వాటిలో ఒకటి రెండు హిట్లు కూడా ఉన్నాయి. దీనికి తోడు మలయాళం, తమిళం భాషల్లోనూ అవకాశాలు వచ్చాయి. ఇంకేముంది దక్షిణాదిలో టాప్‌ రేంజ్‌లో దూసుకుపోవచ్చని కలలు కని ఉండవచ్చు.

తమిళంలోనూ  కార్తీ, రవి మోహన్, ప్రదీప్‌ రంగనాథన్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించే అవకాశాలు వరించాయి. అయితే రవి మోహన్‌ సరసన నటించిన జీనీ చిత్రం ఏళ్ల తరబడి నిర్మాణంలోనే ఉంది. ఇక కార్తీతో జత కట్టిన వా వాథ్దియార్‌ చిత్రం ఈ మధ్యనే విడుదలై  పూర్తిగా నిరాశ పరిచింది. ఇక మిగిలింది ప్రదీప్‌ రంగనాథన్‌కు జంటగా నటించిన ఎల్‌ఐకే (లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ) వరుసగా విజయాలను అందుకుంటున్న ప్రదీప్‌ రంగనాథన్‌ హిరోగా నటించిన చిత్రం కాబట్టి సక్సెస్‌ గ్యారెంటీ అని అందరూ అనుకుంటున్నారు. 

అయితే నటి నయనతార రౌడీ పిక్చర్స్‌ సంస్థ, సెవెన్‌ స్క్రీన్‌ స్టూడియో సంస్థ కలిసి నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది అక్టోబర్‌లోనే విడుదల కావలసింది. అదే సమయంలో ప్రదీప్‌ రంగనాథన్‌ కథానాయకుడిగా నటించిన డ్యూడ్‌ చిత్రం విడుదల కావడంతో ఎల్‌ఐకే చిత్రం విడుదలను వాయిదా వేయాల్సిన పరిస్థితి. ఆ తరువాత పలుమార్లు ఈ చిత్రం విడుదల వాయిదా పడుతూనే వస్తోంది. ఎట్టకేలకు ఏప్రిల్‌ 3వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రం మరోసారి వాయిదా పడుతున్నట్లు తాజా సమాచారం. 

ఎల్‌ఐకే చిత్రాన్ని ఏప్రిల్‌ 2వ వారంలో తెరపైకి తీసుకు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా కృతిశెట్టి చేతిలో ఉన్న ఒకే ఒక్క చిత్రం వాయిదా మీద వాయిదా పాడటం ఆమెకు నిరాశ పరిచే విషయమేమీ అవుతుంది. ఇలా ఎదురు చూపులతో ఉన్న కతి శెట్టికి గుడ్డిలో మెల్ల అన్నట్లుగా త్వరలో తెలుగులో ఒక క్రేజీ చిత్రంలో నటించే అవకాశం వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.  

Videos

రుక్మిణిని Unfollow చేసిన రిషబ్.. అసలేమైనట్టు..!

బంగారం అమ్మే సరైన సమయం ఇదే.. లాభం డబుల్ చేసే ట్రిక్!

వైరల్ అవుతోన్న రామ్ చరణ్ హోమం

తడబడుతున్న చంద్రబాబు.. థిస్ ఇస్ వెరీ బ్యాడ్

భర్తను చంపి పక్కనే పాతిపెట్టిన భార్య.. ట్విస్ట్ ఏంటంటే..?

సుబ్బారెడ్డి VS అఖిలప్రియ.. ఆళ్లగడ్డలో కేబుల్ వార్

నంద్యాలలో దారుణం.. అత్తను చంపిన అల్లుడు

US స్థావరాలపై ఇరాన్ దాడి? భారీగా ప్రాణనష్టం

11 నుండి 170కు.. ఎలా వస్తామో చూద్దురు కానీ

అమరావతిపై పెట్టింది తీర్మానం మాత్రమే.. బిల్లు కాదు.. ముందుది ముసళ్ల పండగ

Photos

+5

ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో నమ్రత (ఫోటోలు)

+5

ఫ్యాషన్‌ షోలో నగధగలు..అలరించిన మోడల్స్‌ (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 29- ఏప్రిల్ 05)

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)