Breaking News

నాగార్జున 100వ సినిమాలో హీరోయిన్‌ ఎవరంటే..!

Published on Sat, 03/28/2026 - 12:10

టాలీవుడ్‌ మన్మధుడు నాగార్జున వందో చిత్రం షూటింగ్‌ పనులు మొదలయ్యాయి. తమిళ దర్శకుడు రా.కార్తీక్‌ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు ‘కింగ్‌ 100’ అనే వర్కింగ్‌ టైటిల్‌ పెట్టారు. త్వరలో సినిమా టైటిల్‌ను ప్రకటిస్తారు. అయితే, ఈ మూవీలో నాగార్జున సరసన నటించబోయే హీరోయిన్‌ ఛాన్స్‌ ఎవరికి దక్కుతుందోనని అభిమానులు ఎదురుచూస్తుండగా ఒక నటి పేరు వైరల్‌ అవుతుంది.

నాగార్జున 100వ సినిమాలో నటి ఐశ్వర్య రాజేష్‌ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపినట్లు సమాచారం. త్వరలో మూవీ సెట్స్‌లో కూడా ఆమె పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇందులో సీనియర్‌ నటి టబు కూడా నటిస్తున్నట్టు సమాచారం.  ఎంతో ప్రతిష్ఠాత్మకమైన తన వందో చిత్రాన్నీ తనదైన శైలిలో రా.కార్తీక్‌ ప్లాన్‌ చేసినట్లు టాక్‌.  యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, భావోద్వేగ అంశాలతో ఈ మూవీ ఉండనుందట. అన్నపూర్ణ స్టూడియోస్‌ ఈ మూవీని నిర్మిస్తుంది.

తెలుగు మూలాలు ఉన్న నటి ఐశ్వర్య రాజేష్‌..  తమిళం, తెలుగు చిత్రాల్లో మెప్పిస్తూ.. తన అద్భుతమైన నటనతో  గుర్తింపు తెచ్చుకున్నారు. చెన్నైలో జన్మించిన ఈమె, యాంకర్‌గా కెరీర్ ప్రారంభించి, రియాలిటీ షో విజేతగా నిలిచి, ఆపై సినిమాల్లోకి ప్రవేశించారు. గ్లామర్ పాత్రల కంటే అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. గతేడాది వెంకటేష్‌ సరసన సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో అలరించారు.

Videos

అమరావతి పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నావ్ .. KK రాజు సంచలన రియాక్షన్

మ్యాచ్ మధ్యలో కుక్క ఎంట్రీ.. ఢిల్లీ ప్లేయర్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు

రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో రగడ..CI బాజీలాల్ పై మార్గాని భరత్ ఫైర్

గ్యాస్ కోసం ఆటోవాలాల కష్టాలు కిలోమీటర్ల మేర వాహనాలు

2029లో జగన్ వస్తాడనే భయంతోనే అమరావతిపై చట్టబద్ధత బిల్లు..

తెలంగాణలో రానున్న 5 రోజులు భారీ వర్షాలు

తృణమూల్ కాంగ్రెస్ పాలనపై పుస్తకాన్ని విడుదల చేసిన అమిత్ షా

రూపం మార్చుకొని మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్..

అమెరికా సంచలన ప్రకటన ఇరాన్ పని ఖతం!

అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్ దాడులు

Photos

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌ (ఫొటోలు)

+5

మార్కాపురం బస్సు ప్రమాదం.. హృదయ విదారక దృశ్యాలు

+5

అనంతపురంలో దేవరకొండ, రష్మిక సందడి (ఫొటోలు)