Breaking News

నోకియా 14,000 మందికి లేఆఫ్‌

Published on Sat, 03/28/2026 - 11:34

ఒకప్పుడు మొబైల్ ప్రపంచాన్ని శాసించిన నోకియా ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో మారుతున్న పరిస్థితులు, తగ్గుతున్న ఆదాయ వనరుల నేపథ్యంలో ఖర్చులను నియంత్రించడమే లక్ష్యంగా కంపెనీ ప్రణాళికలు ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 14,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించగా ఆ ప్రభావం ఇప్పుడు భారత విభాగంపై కూడా పడనుంది.

కొన్ని మీడియా సంస్థల నివేదికల ప్రకారం, నోకియా తన భారత కార్యకలాపాల్లో కీలక మార్పులు చేపట్టింది. కంపెనీ తన భారత నాయకత్వ బాధ్యతలను కొత్త వ్యక్తులకు అప్పగించింది. సమర్ మిట్టల్ కంపెనీ ఇండియా కంట్రీ బిజినెస్ లీడర్‌గా నియమితులయ్యారు. ఈయనకు మునుపటి కంటే ఎక్కువ కార్యాచరణ నియంత్రణ ఇచ్చారు. విభా మెహ్రా, ఇండియా కంట్రీ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. వీరిద్దరూ 2026 ఏప్రిల్ 1 నుంచి బాధ్యతలు చేపట్టనుండగా ప్రస్తుతం ఇండియాలో కంపెనీ చీఫ్‌గా ఉన్న తరుణ్ ఛబ్రా పదవి నుంచి తప్పుకున్నారు.

ఆదాయంలో భారీ క్షీణత

భారత మార్కెట్‌లో నోకియా పనితీరు గణనీయంగా పడిపోయింది. తాజా ఆర్థిక గణాంకాల ప్రకారం.. 2025 నాలుగో త్రైమాసికంలో నికర అమ్మకాలు 15 శాతం తగ్గి 393 మిలియన్ యూరోలకు (సుమారు రూ.4,290 కోట్లు) పరిమితమయ్యాయి. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో నికర అమ్మకాలు 463 మిలియన్ యూరోలుగా (సుమారు రూ.5,000 కోట్లు) నమోదయ్యాయి. అమ్మకాల్లో ఈ క్షీణత వల్ల లాభదాయకతను పెంచుకోవడానికి ఉద్యోగుల తగ్గింపు ఒక్కటే మార్గమని కంపెనీ భావిస్తోంది. ముఖ్యంగా 2023లో జరిగిన మొబైల్ నెట్‌వర్క్‌లు, క్లౌడ్ సేవల విలీనం వల్ల ఏర్పడిన ‘డూప్లికేషన్’ ఉద్యోగాలను తొలగించడంపై దృష్టి సారించింది.

టెలికాం రంగంలో సంక్షోభం?

నోకియా మాత్రమే కాదు దాని ప్రధాన ప్రత్యర్థి ఎరిక్సన్ కూడా గత ఏడాది దాదాపు 5,000 మందిని తొలగించింది. టెక్ దిగ్గజాలైన అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను ఇంటికి పంపగా మెటా కూడా 15,000 మంది తొలగింపునకు సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి.

ఇదీ చదవండి: సముద్రగర్భ కేబుళ్లపై ఇరాన్‌ నజర్‌!

#

Tags : 1

Videos

అమరావతి పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నావ్ .. KK రాజు సంచలన రియాక్షన్

మ్యాచ్ మధ్యలో కుక్క ఎంట్రీ.. ఢిల్లీ ప్లేయర్ ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు

రాజమండ్రి పోలీస్ స్టేషన్ లో రగడ..CI బాజీలాల్ పై మార్గాని భరత్ ఫైర్

గ్యాస్ కోసం ఆటోవాలాల కష్టాలు కిలోమీటర్ల మేర వాహనాలు

2029లో జగన్ వస్తాడనే భయంతోనే అమరావతిపై చట్టబద్ధత బిల్లు..

తెలంగాణలో రానున్న 5 రోజులు భారీ వర్షాలు

తృణమూల్ కాంగ్రెస్ పాలనపై పుస్తకాన్ని విడుదల చేసిన అమిత్ షా

రూపం మార్చుకొని మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్..

అమెరికా సంచలన ప్రకటన ఇరాన్ పని ఖతం!

అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్ దాడులు

Photos

+5

'కొన్ని క్షణాలు హృదయానికి హత్తుకుంటాయి'.. కూతురితో మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

90ల నాటి కలల రాణి.. మేకప్‌ లేకుండా నెరిసిన జుట్టుతో (ఫొటోలు)

+5

వేములవాడ : రాజన్నతో హిజ్రాల పెళ్లిమహోత్సవం...ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ‘టీచ్‌ ఫర్‌ చేంజ్‌’...అలరించిన సినీ ప్రముఖుల ర్యాంప్‌ వాక్‌ (ఫొటోలు)

+5

వారణాసిలో యాంకర్ రష్మీ గౌతమ్ పూజలు (ఫొటోలు)

+5

శ్రీరామనవమి వేడుకల్లో మంచు మనోజ్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

చిరంజీవి ఆధ్వర్యంలో రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌ (ఫొటోలు)

+5

మార్కాపురం బస్సు ప్రమాదం.. హృదయ విదారక దృశ్యాలు

+5

అనంతపురంలో దేవరకొండ, రష్మిక సందడి (ఫొటోలు)