Breaking News

అమ్మమ్మ చేతి ఎంబ్రాయిడరీ..! 1947 నాటి..

Published on Fri, 03/27/2026 - 11:45

ఎంబ్రాయిడరీలో ఉండే కళా నైపుణ్యం వేరేలెవెల్‌. అందులోనూ మన అమ్మమ్మలు ఆ వయసులో వారి చేత్తో పొద్దిగా కుడితే..అది మనకు ఎంతో అపురూపమైన జ్ఞాపకం.అలాంటి ఆకర్షణీయమైన ఎంబ్రాయిడరీని పరిచయం చేసింది ఈ బామ్మ. సుమారు 90 ఏళ్లు పైనే ఉండే ఈ బామ్మ తన కళను శ్రద్ధగా దాచుకున్న విధం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అందుకు సంబంధించిన వీడియోని మనవడు నెట్టింట షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. 

ఆ వీడియోలో మనవడు తన అమ్మమ్మ సూదీదారం పట్టుకుని కుట్టిన ఎంబ్రాయిడరీని తన మనవడికి చూపించడం స్పష్టంగా కనిపిస్తుంది. ఆమె స్వయంగా రూపొందించిన కళాఖండాన్ని మనవడు చూస్తున్నప్పడు ఆ బామ్మ కళ్లు ఆనందంతో మెరుస్తుండటం చూడొచ్చు వీడియోలో. దశాబ్దాల క్రితం ఆమె చేసిన అందమైన కళాఖండం అది. అవి ఆమెకు కళ పట్ల ఉన్న అంకితభావం, ఓర్పుకు నిదర్శనం. యంత్రాలతో నేటితరం చిటికెలో చేస్తే..అవి అమ్మమ్మ తన స్వహస్తాలతో కేవలం సూది, దారంతో చాలా శ్రద్ధతో చేసిన అద్భుత సృష్టి. 

అవి ఆ అమ్మమ్మ గతం తాలుకా అమూల్యమైన జ్ఞాపకం కూడా. ఆ కళాఖండం సుమారు 1947 నాటి చారిత్రక ఘట్టం. వాటిని చూస్తే..ఇన్ని దశాబ్దాలు గడిచినా.. చెక్కుచెదరకుండా ఉన్న వాటిని చూస్తే ఆ కళ ఎంత విలువైనవనేది అనేది తెలుస్తోంది. ఇది తమ కుటుంబ చరిత్రలో భాగం, భావోద్వేగమైనది కూడా అని చెబుతున్నాడు ఆమె మనవడు. 

ఈ వీడియో నెటిజన్లను ఆకర్షించడమే కాకుండా కుటుంబ వారసత్వ సంపద కళ మాత్రమే అనే విషయం నొక్కి చెప్పిందని అన్నారు. అంతేగాదు కళ ద్వారా నాటి జ్ఞాపకాలు సజీవంగా ఉంటాయన్నారు. వేగవంతమైన ప్రపంచంలో కుటుంబం, సంప్రదాయం, వారసత్వం, జ్ఞాపకాల ప్రాముఖ్యతలను ఈ దృశ్యం హైలెట్‌ చేసిందంటూ కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు.

 

 

(చదవండి: పంజాబీ వంటకాలకు ఫుడ్‌లవర్స్‌ ఫిదా..!)

Videos

ఛత్రపతి హిందీలో చేయకుండా ఉండాల్సింది

టీడీపీ నేతల వ్యాఖ్యలు సిగ్గుచేటు

కరీంనగర్ RBL బ్యాంక్ లో భారీ కుంభకోణం

అమెరికా సంచలన నిర్ణయం కరెన్సీ నోట్లపై ట్రంప్ సంతకం

2 నెలల దాకా నో టెన్షన్.. దేశంలో 8 లక్షల టన్నుల LPG నిల్వలు

కడపలో ఆధిపత్య పోరు టీడీపీ ఇంఛార్జ్ ఆవుల వెంకటేష్ పై దాడి

ప్రజలకు చుక్కలు చూపిస్తున్న గ్యాస్ ధరలు

రణరంగంగా జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఖమేనీ హత్యను ఖండిస్తూ విపక్షాల నిరసన

తాడిపత్రి బాలుడి హత్య కేసు.. నిందితుడిపై పోలీసుల కాల్పులు

ట్రంప్ భారీ స్కెచ్.. ఒకవైపు చర్చలు.. మరో వైపు యుద్ధ సన్నోహాలు

Photos

+5

రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌ (ఫొటోలు)

+5

మార్కాపురం బస్సు ప్రమాదం.. హృదయ విదారక దృశ్యాలు

+5

అనంతపురంలో దేవరకొండ, రష్మిక సందడి (ఫొటోలు)

+5

భద్రాచలంలో కనుల పండువగా శ్రీసీతారాముల ఎదుర్కోలు ఉత్సాహం (ఫొటోలు)

+5

రష్మిక- విజయ్ పెళ్లికి నెల.. జ్ఞాపకాల్లో విరోష్ జంట.. (ఫోటోలు)

+5

కూతురితో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో బైకర్ మూవీ టీమ్ (ఫోటోలు)

+5

జూ.ఎన్టీఆర్‌ సతీమణి ప్ర‌ణ‌తి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : ఒక చేయి.. ఆపన్నహస్తాలెన్నో! ఈ ఫోటోలు చూడండి

+5

నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)