Breaking News

పంజాబీ వంటకాలకు ఫుడ్‌లవర్స్‌ ఫిదా..!

Published on Thu, 03/26/2026 - 17:40

కొత్త రుచులను నగరవాసులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు.. పంజాబ్‌ నుంచి వచ్చి హైదరాబాద్‌ నగరంలో నివాసం ఉండేవారి కోసం వెలిసిన దాబాలు క్రమంగా చేరువయ్యాయి. దశాబ్దాలుగా భాగ్యనగర సిటీవాసులు పంజాబీ రుచులను భల్లే భల్లే అంటూ ఆస్వాదిస్తున్నారు. ఒకప్పుడు హైవేలపై ప్రత్యక్షమయ్యే దాబాలు ప్రస్తుతం నగరంలోని అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో సకుటుంబ సపరివార సమేతంగా వెళ్లి నచ్చిన రెసిపీలను లాగించేస్తున్నారు ఫుడ్‌ లవర్స్‌.. ఆయా ఫ్లేవర్లలో లభించే లస్సీని ఈ సమ్మర్‌లో తప్పనిసరిగా ప్రయత్నించాల్సిందే అంటున్నారు.   

శామీర్‌పేట్‌ వద్ద(హైదరాబాద్‌ నుంచి 40 కి.మీ) ఉన్న పంజాబీ దాబా, లాంగ్‌ డ్రైవ్‌కు 
వెళ్లినప్పుడు సేద తీరడానికి పలువురు పంజాబీ హవేలీ దాబాను ఎంచుకుంటారు. ఇది సంప్రదాయ పంజాబీ హైవే ఆహారాన్ని, విలక్షణమైన, రంగురంగుల హవేలీ డిజైన్లతో మిళితం చేస్తుంది. ఇక్కడ ప్రత్యేకమైన భారీ బాహుబలి లస్సీ సహా వెన్న పూసిన పరాటాలు, అమృత్‌సరి కుల్చాలు ఉంటాయి. విశేషం ఏమిటంటే.. ప్రాంగణంలో ఒక సెల్ఫీ మ్యూజియంలో ఎంజాయ్‌ చేయవచ్చు.  

హైటెక్‌ థ్రిల్‌.. హైవే ఫీల్‌.. 
కొండాపూర్‌లో ఉన్న చార్పాయ్‌ దాబా విలక్షణమైన అలంకరణ మంచాల మీద కూర్చునే ఏర్పాటుతో పాటు ఫైన్‌ డైనింగ్‌ సీటింగ్‌తో ఆధునిక దాబా భావనను అందిస్తుంది. ఇక్కడి మెనూలో సంప్రదాయ ఉత్తర భారతీయ థాలీలు, శాఖాహారం, మాంసాహారం రెండూ సృజనాత్మక మార్పులతో అందుబాటులో ఉంటాయి. ఇక్కడ చైనీస్‌/ధాబా ఫ్యూజన్‌ స్టార్టర్స్, మెయిన్‌ కోర్సులను కూడా ఆస్వాదించవచ్చు. 

సింపుల్‌.. హిస్టారికల్‌.. 
సుదీర్ఘ కాలంగా బోయిన్‌పల్లిలో భోజన ప్రియుల్ని ఆకట్టుకుంటోంది లవ్లీ పంజాబీ దాబా. ఇది పూర్తి శాఖాహార పంజాబీ దాబా, ఇది చాలా సింపుల్‌గా ఆడంబరాలు లేకున్నా ఎంతో కాలంగా తనకు ఉన్న పేరు ప్రతిష్టలతో ఆకట్టుకుంటోంది. పరాటాలు, రోటీలు, పప్పు, కూరగాయలు కొన్ని ఇండోచైనీస్‌ వంటకాలతో నిండిన క్లాసిక్‌ పంజాబీ వంటకాలు మెనూలో ఎక్కువగా ఉంటాయి. అందుబాటు ధరల్లో ఐటవ్స్‌ు లభ్యమవుతాయని అంటుంటారు.

హిల్స్‌లో కపూర్స్‌.. 
నగరంలో అత్యంత ఖరీదైన, ప్రముఖ ప్రాంతమైన బంజారాహిల్స్‌లో ఉన్న కపూర్స్‌ కేఫ్‌ అచ్చం పంజాబీ థీమ్‌తో రూపొందింది. కృత్రిమ గడ్డిపై మంచాల సీటింగ్, రంగురంగుల అలంకరణతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. చాలా ప్రశాంతమైన, ఆహ్లాదకర వాతావరణంతో ఇది పంజాబీ దాబా స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. పూర్తిగా శాఖాహార వంటకాలు మాత్రమే అందించే ఈ కేఫ్‌ ఆలూ పరాటా, బేడ్మి పూరి, చిక్కటి అమృత్‌సరి లస్సీ తదితర వంటకాలకు ప్రసిద్ధి.

నార్త్‌ టూ సౌత్‌ 
నగరంలోని పురాతన పంజాబీ దాబాలలో సాగర్‌ పాపాజీ కా దాబా కూడా ఒకటి.. అబిడ్స్‌లోని సాగర్‌ పాపాజీ కా దాబా, ఒక ఇంటి వంట ప్రాంగణంగా పేరొందింది. దీనిలో ఎటువంటి హంగామాలు, ఆధునిక అలంకరణలు ఉండవు. ఇది పూర్తిగా ఉత్తర భారత రుచులకు ప్రసిద్ధి చెందింది. దువా కుటుంబం 1985 నుంచి దీనిని నిర్వహిస్తోంది. దాల్‌ మఖానీ, ఆలూ పరాఠాల నుంచి ఖీమా ఫ్రై, తందూరీ రోటీల వరకు ఇంట్లో తయారు చేసిన రుచిని కలిగి ఉంటాయి. ఇక్కడ క్లాసిక్‌ చిక్కటి లస్సీ తప్పనిసరిగా ప్రయత్నించాల్సిన ఐటమ్‌ అంటారు ఫుడ్‌ లవర్స్‌.  

#

Tags : 1

Videos

కడప స్టీల్ పై బాబు నాటకం

సుప్రియ ఒంటిపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేసి... పేర్ని నాని ఫైర్

ఓటమిని ఒప్పుకోండి.. మాతో మీరు గెలవడం కల్లా..

బ్లడీ బాస్టర్డ్.. సామాన్యుడిపై TDP ఎమ్మెల్యే బూతు పురాణం

అడ్డంగా నరికేస్తా.. యూజ్ లెస్ ఫెలో ఆదిరెడ్డికి ధమ్కీ ఇచ్చిన వ్యాపారి

మార్కాపురం ఘోర రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందంటే?

శవాన్ని తీసుకెళ్తుంటే 100 మంది దాడి చేశారు.. డిప్యూటీ సీఎంకి ఒకటే ప్రశ్న.

ఇన్వెస్టర్లకు జాక్పాట్ 1100% డివిడెండ్ ఇచ్చిన మైనింగ్ కంపెనీ

ఇన్వెస్టర్లకు పండగే లక్ష పెడితే 12 లక్షలు...ఒకటి కొంటే ఒకటి ఫ్రీ

YS జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు

Photos

+5

రష్మిక- విజయ్ పెళ్లికి నెల.. జ్ఞాపకాల్లో విరోష్ జంట.. (ఫోటోలు)

+5

కూతురితో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో బైకర్ మూవీ టీమ్ (ఫోటోలు)

+5

జూ.ఎన్టీఆర్‌ సతీమణి ప్ర‌ణ‌తి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : ఒక చేయి.. ఆపన్నహస్తాలెన్నో! ఈ ఫోటోలు చూడండి

+5

నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)

+5

డిఫరెంట్ లుక్స్‌తో షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

వావ్ అనేలా మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఫొటోలు

+5

IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)

+5

హనీమూన్ కాదు బడ్డీమూన్.. రష్మిక-విజయ్ ఇలా (ఫొటోలు)