Breaking News

తండ్రి ఆజ్ఞలో దాగిన నాయకత్వ రహస్యం

Published on Thu, 03/26/2026 - 10:42

శ్రీరాముని పట్టాభిషేకానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయోధ్యలో ఆనందోత్సాహాలు ఉప్పొంగుతున్న శుభవేళ. ప్రజల హృదయాల్లో ఒకే పేరు – రాముడు. న్యాయం, వినయం, ధర్మనిష్ఠల ప్రతిరూపంగా ఉన్న శ్రీరాముడు కాసేపట్లో రాజ్యభారాన్ని స్వీకరించబోయే సమయంలో, ఎవ్వరూ ఊహించనిదిగా ఆ దృశ్యం కాస్తా మారిపోయింది. ఆనందోత్సాహాల స్థానంలో నిరాశా నిస్పృహలు... రాజసభలో నిశ్శబ్ద వాతావరణం. కారణం – దశరథుడు, భార్య కైకేయికి ఇచ్చిన మాటతో అంతా తారుమారు కావడం.

రాజ్యాన్ని వదిలి పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయమనే ఆజ్ఞను రామునికి తెలియజేయటానికి కూడా ఆయనకి ధైర్యం ఉండదు. ఈ పరిస్థితిలో, కైకేయి రామునికి ఈ విషయం చెప్పినప్పుడు రాముడు స్పందించిన తీరుని వాల్మీకి మహర్షి ‘న హమర్థ పరో దేవి’... అమ్మా! సంపదల కోసం నేను జీవించను. ‘మాం ఋషిభిస్తుల్యం, కేవలం ధర్మమాస్థితం’... ఋషుల వలె ధర్మాన్ని ఆచరించడం మాత్రమే నా తత్త్వం అని నీకు తెలిసిందే కదమ్మా...’’ అంటాడు. ఇది అంధ విధేయత కాదు. ఆయన చైతన్య పూర్వక నిర్ణయం. రాముడు తండ్రి పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. తన హక్కును వినియోగించుకోవచ్చు కానీ తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టటమే రాజధర్మమని గ్రహించాడు.

అయితే ఆయన ఆజ్ఞను పాటించటం కేవలం కుమార ధర్మం మాత్రమేనా? లేక దానిలో మరింత లోతైన ధర్మబోధ, నాయకత్వ దృష్టి, విలువల పట్ల నిబద్ధత దాగి ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం వాల్మీకి రామాయణం వైపు తిరగాలి. 

’పితుర్వచన నిర్దేశాత్, పితుర్వచన గౌరవాత్‌’.... తండ్రి మాట గౌరవం కోసం, ఆయన ఆజ్ఞను పాటించాలనుకుంటున్నాను అంటాడు. శ్రీరాముడు దశరథుడు ఇచ్చిన వాగ్దానం విఫలమైతే, రాజ్యంపై, రాజుపై ప్రజల విశ్వాసం దెబ్బతింటుంది. అందుకే రాముడు తండ్రికి చెప్పి, ఓదార్పును ఇచ్చాడు.

కౌసల్యాదేవి రాముని వనవాస వార్త విని దుఃఖించినప్పుడు ఆమెను కూడా ధైర్యపరుస్తూ, ఓదార్చిన తీరు అమోఘం. తండ్రిగారు మనకి రాజు; మనల్ని పోషించే దశరథుడు మనకి గురుస్థానంలో ఉన్నారు – మనకంటే పెద్దవారు. అందరితో పాటు మనిద్దరమూ కూడా ఆయన ఆజ్ఞని పాటించి తీరాలి. స్త్రీకి స్వర్గ్రపాప్తికి భర్త శుశ్రూష ఒక్కటే మార్గమమ్మా అని వివరించాడు. ‘దశరథస్తు ధర్మాత్మా’ అంటారు మహర్షి. అంటే పితృవాక్యం ధర్మవాక్యం అని ఒక సందేశాన్నిస్తున్నారు. ఈ సందేశం ఎప్పటికీ సత్యమే. ఇదంతా విని కౌసల్య రాముని ధర్మనిష్ఠకి పోంగిపోయింది.

శ్రీరాముడు వనవాసం చేయాలన్న వార్త తెలియగానే, లక్ష్మణుడు కోపంతో ఊగిపోతూ ముసలివాడైన తండ్రిని అంతం చేస్తానన్నాడు. అతణ్ణి వారిస్తూ, తండ్రిగారి ఆజ్ఞని తప్పకుండా ఆచరించాల్సిందేనని తమ్ముడికి కర్తవ్య బోధ చేస్తాడు. ఈ విధంగా ఏకకాలంలో కుటుంబానికి బలం ఇచ్చినవాడు శ్రీరాముడు – తండ్రి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టటానికి, రాజ్య ప్రతిష్టను కాపాడటానికి, తన హక్కుని త్యాగం చేశాడు.

అరణ్యవాసం – నాయకత్వ శిక్షణ
ఇంకొక కోణంలో చూస్తే అరణ్యవాసం రాముని నాయకత్వానికి ఒక శిక్షణా శిబిరం అయింది. రాజ్రపాసాదంలో అన్ని హంగులతో పెరిగిన శ్రీరాముడు, అరణ్యంలో ఋషుల కష్టాల్ని ప్రత్యక్షంగా అర్థం చేసుకున్నాడు. ప్రజల బాధలను ప్రత్యక్షంగా అనుభవించాడు. అటు రాక్షసులతోనూ, ఇటు ఋషులతోనూ, సాధారణ జీవితాన్ని గడుపుతూ, ఉపశమనం, సహనం, విధేయత, ధర్మనిష్ఠని పాటిస్తూ, సమగ్ర నాయకుడిగా తీర్చిదిద్దబడ్డాడు. గిరిజనుల జీవన విధానాన్ని తెలుసుకున్నాడు. పాలనలో ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా తెలుసుకోవడం వారితో సహజీవనం ఎంత అవసరమో రాముడి జీవితం చెబుతోంది. అధికారంలోకి రాకముందే అనుభవం సంపాదించిన నాయకుడిగా ఎదగగలిగాడు. కనుక అరణ్యవాసం రాజ్యభారానికి శిక్షణ శిబిరంగా చెప్పొచ్చు.

విలువలపై నిలిచిన వ్యక్తిత్వం
రాముని వనవాస నిర్ణయం తక్షణ ఫలితాల కోసం కాదు, దీర్ఘకాలిక విలువల కోసం. తన వ్యక్తిగత ఆనందం, తల్లిదండ్రుల ప్రేమ, రాజ్యాభిషేక గౌరవం మొదలైనవన్నీ పక్కన పెట్టి, ధర్మాన్ని ఎంచుకుని ‘రామో విగ్రహవాన్‌ ధర్మః’ అనిపించుకున్నాడు.
ప్రస్తుత సంక్షుభిత సమయంలో రాముడి జీవితం ఒక స్ఫూర్తి. మాట నిలబెట్టుకోవడం, బాధ్యతని నిస్వార్థంగా స్వీకరించటం, క్లిష్టకాలంలో ధైర్యంగా నిలబడటం, హక్కుల కంటే కర్తవ్యాన్ని ముందుంచటం, తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడటం మొదలైనవి ఏ కాలానికైనా వర్తిస్తాయి.

శ్రీరాముని జీవితం మనకిచ్చే సందేశం ఒక్కటే –‘అధికారం గొప్పది కాదు; ఆ అధికారాన్ని నిలబెట్టే విలువలే గొప్పవి’. శ్రీరాముని విధేయతను చాలామంది త్యాగంగా చూస్తారు కానీ, అది స్వచ్ఛంద ధర్మం. అందుకే రామకథ యుగ యుగాలపాటు మన హృదయాల్లో వెలుగుతుంది. అది భక్తి కథ మాత్రమే కాదు, ఆత్మవిమర్శకు ఆహ్వానం కూడా!
 

  • నవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు పూజ చేయాలి. పూజకు రెండు దీపారాధనలు, ఐదు వత్తులు ఉపయోగించాలి. పూజ చేసేటప్పుడు రాముడికి తులసి మాలను ధరింపజేయాలి. పూర్తయిన తర్వాత అన్నదానం చేసి, శ్రీ రామరక్షా స్తోత్రం, శ్రీరామ నిత్యపూజ వంటి పుస్తకాలను తాంబూలంతో కలిపి ఆహూతులకు బహుమతిగా ఇవ్వడం ద్వారా శుభఫలితాలు చేకూరతాయి.

  • రామననమిరోజు రామాలయాన్ని దర్శించుకోవడం మంచిది. అలాగే దేవాలయాల్లో పంచామృతంతో అభిషేకం, శ్రీరామ ధ్యానశ్లోకాలు, శ్రీరామ అష్టోత్తర పూజ, సీతారామకళ్యాణం వంటి పూజాకార్యక్రమాలను జరిపిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తికావడంతో పాటు సకలసంపదలు చేకూరుతాయని ప్రతీతి.

  • శ్రీ రామనవమి రోజున పానకం–వడపప్పు తయారు చేసి మహాప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ్రపాకృతిక పరమార్థం ఏమిటంటే ఇది వేసవికాలం కాబట్టి, వీటిని ప్రసాదరూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్షు అభివృద్ధి చెందుతాయని పండితుల అభిప్రాయం. 

– దావులూరి రామకృష్ణ శర్మ విశ్రాంత అధ్యాపకులు

Videos

బ్లడీ బాస్టర్డ్.. సామాన్యుడిపై TDP ఎమ్మెల్యే బూతు పురాణం

అడ్డంగా నరికేస్తా.. యూజ్ లెస్ ఫెలో ఆదిరెడ్డికి ధమ్కీ ఇచ్చిన వ్యాపారి

మార్కాపురం ఘోర రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందంటే?

శవాన్ని తీసుకెళ్తుంటే 100 మంది దాడి చేశారు.. డిప్యూటీ సీఎంకి ఒకటే ప్రశ్న.

ఇన్వెస్టర్లకు జాక్పాట్ 1100% డివిడెండ్ ఇచ్చిన మైనింగ్ కంపెనీ

ఇన్వెస్టర్లకు పండగే లక్ష పెడితే 12 లక్షలు...ఒకటి కొంటే ఒకటి ఫ్రీ

YS జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు

అమరావతిలో బాబు అవినీతి యజ్ఞం

4 గంటల్లోనే బంగారం ధరలు భారీగా పెరిగాయి..

దొరకాలి నా కొడుకు.. పెట్రోల్ పోసి తగలబెడతా

Photos

+5

కూతురితో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో బైకర్ మూవీ టీమ్ (ఫోటోలు)

+5

జూ.ఎన్టీఆర్‌ సతీమణి ప్ర‌ణ‌తి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : ఒక చేయి.. ఆపన్నహస్తాలెన్నో! ఈ ఫోటోలు చూడండి

+5

నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)

+5

డిఫరెంట్ లుక్స్‌తో షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

వావ్ అనేలా మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఫొటోలు

+5

IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)

+5

హనీమూన్ కాదు బడ్డీమూన్.. రష్మిక-విజయ్ ఇలా (ఫొటోలు)

+5

ఇదేం బిల్డప్‌ చంద్రబాబూ.. క్రెడిట్ చోరీ ఆగదా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)