హాలీవుడ్‌ మూవీ ప్రమోషన్స్‌లో హృతిక్‌!

Published on Wed, 03/25/2026 - 15:27

బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌కి ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫాలోయింగ్‌ ఉన్న సంగతి తెలిసిందే.  ఇప్పుడా స్టార్‌డమ్‌ని ఓ హాలీవుడ్‌ సినిమా ప్రచారానికి వాడుకుంటుంది. హాలీవుడ్‌ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘ప్రాజెక్ట్‌ హెయిల్‌ మేరీ’ టీమ్‌.. ఇండియాలో తమ సినిమా ప్రమోషన్స్‌ కోసం హృతిక్‌ని సంప్రదించింది. ప్రమోసన్స్‌లో భాగంగా హాలీవుడ్ స్టార్ ర్యాన్ గాస్లింగ్‌, హృతిక్‌తో ఒక ఎక్స్‌క్లూజివ్ వర్చువల్ ఇంటర్వ్యూని నిర్వహించారు.స్పేస్, సైన్స్, సినిమాలపై తమకున్న ఆసక్తిని పంచుకుంటూ ఈ ఇద్దరు గ్లోబల్ ఐకాన్స్ చేసిన ఈ ముఖాముఖి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఈ సంభాషణ ప్రధానంగా రాబోయే సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ చుట్టూ తిరిగింది. హృతిక్ రోషన్ నటించిన సూపర్ హిట్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘కోయి... మిల్ గయా’తో ఈ కొత్త చిత్రానికి ఉన్న పోలీకలను ఇద్దరూ గుర్తు చేసుకున్నారు. ఒకరి ప్రతిభను మరొకరు ప్రశంసించుకోవడంతోపాటు, భవిష్యత్తులో కలిసి పని చేసే అవకాశాలపై కూడా చర్చించారు.

ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వం వహించిన 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' చిత్రంలో ర్యాన్ గాస్లింగ్ మెమరీ లాస్ కి గురైన రైలాండ్ గ్రేస్ పాత్రను పోషించారు. శాండ్రా హుల్లెర్, లియోనెల్ బాయిస్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. అమెజాన్  ఎంజీఎం(MGM) స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ పంపిణీ చేస్తోంది. ఈ సినిమా మార్చి 26న ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రిలీజ్‌ కానుంది.

Videos

ఐదేళ్లలో లక్షను కోటి చేసిన ఐటీ స్టాక్.. ఏకంగా 10 వేల శాతం జంప్ ...

KCR మంచి దోస్త్ నాకు..

తొందర పడకు.. ప్రతి రోజు సినిమా చూపిస్తా..

BJP MLA రాకేష్ రెడ్డి క్షమాపణ చెప్పాలి..

పూరీలా ఒక్క రోజు బతికితే చాలు..

పరిస్థితుల్ని అదుపుచేయ్యాలి అంటే లాక్ డౌన్ తప్పదా..?

ఆ బిల్లుకు పూర్తి మద్దతు మోదీకి జగన్ ట్వీట్

కూటమి వేధింపులు.. IAS, IPSలను కూడా వదలరా!

యుద్ధం పేరుతో గ్యాస్ మాటలు... కిరోసిన్ ఇస్తావు సరే... స్టవ్ లు సంగతేంటి

ఇబ్బందులు ఉంటాయి తెలిసినా అశోక్ బాబు మాత్రం...

Photos

+5

నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)

+5

డిఫరెంట్ లుక్స్‌తో షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

వావ్ అనేలా మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఫొటోలు

+5

IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)

+5

హనీమూన్ కాదు బడ్డీమూన్.. రష్మిక-విజయ్ ఇలా (ఫొటోలు)

+5

ఇదేం బిల్డప్‌ చంద్రబాబూ.. క్రెడిట్ చోరీ ఆగదా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

యువ నటుడు కెన్ కరుణాస్ 'యూత్' సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : పెట్రోల్‌ బంక్‌ల వద్ద భారీ క్యూ.. వదంతులతో జనం పరుగులు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో జోరు వాన (ఫోటోలు)

+5

నటిని పెళ్లాడిన ప్రముఖ ర్యాపర్‌ బాద్‌షా (ఫోటోలు)