30 రోజుల రీఛార్జ్ తప్పనిసరి!

Published on Wed, 03/25/2026 - 13:48

మొబైల్ వినియోగదారుల ప్రయోజనాలే పరమావధిగా టెలికాం రంగంలో మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో రాజ్యమేలుతున్న 28 రోజుల రీఛార్జ్ ప్లాన్ల స్థానంలో పూర్తి 30 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్లను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టెలికాం ఆపరేటర్లపై కేంద్రం ఒత్తిడి పెంచుతోంది. ఇటీవల రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా లేవనెత్తిన అంశాలపై కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సానుకూలంగా స్పందించారు.

పార్లమెంటులో చర్చ

సాధారణంగా నెల అంటే 30 లేదా 31 రోజులు ఉంటుంది. కానీ, టెలికాం కంపెనీలు నెలవారీ ప్లాన్ పేరిట 28 రోజుల వ్యాలిడిటీనే ఇస్తున్నాయి. దీనివల్ల వినియోగదారుడు ఏడాదికి 12 సార్లు కాకుండా 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తోందని రాఘవ్ చద్దా పార్లమెంటులో గళమెత్తారు. ఆయన లేవనెత్తిన అంశాలు కింది విధంగా ఉన్నాయి.

  • ఒకరోజుకు 2 జీబీ డేటా ఇస్తే వినియోగదారుడు 1.5 జీబీ మాత్రమే వాడితే మిగిలిన 0.5 జీబీ అర్ధరాత్రికి మాయమైపోతోంది.

  • ఇది వినియోగదారుడిని వంచించడమే. ఉపయోగించని డేటాను మరుసటి రోజుకు క్యారీ ఫార్వర్డ్ చేయాలి.

  • రీఛార్జ్ గడువు ముగిసిన వెంటనే ఇన్‌కమింగ్ కాల్స్ నిలిపివేయడం సరికాదు. కనీసం ఏడాది పాటు ఇన్‌కమింగ్ సదుపాయం ఉండాలి.

  • మూడేళ్ల గ్రేస్ పీరియడ్ తర్వాతే నంబర్లను రద్దు చేయాలి. (ప్రస్తుతం 90 రోజుల నిబంధన అమలులో ఉంది).

మంత్రి స్పందన

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) నిబంధనల ప్రకారం.. ప్రతి ఆపరేటర్ తమ ప్లాన్ల జాబితాలో కచ్చితంగా 30 రోజుల ప్లాన్‌ను చేర్చాలని మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ‘కంపెనీలు అందించే ప్లాన్‌ ఆప్షన్లలో కచ్చితంగా 30 రోజుల ప్లాన్ ఉండాలి. ఈ నిబంధనను కంపెనీలు పాటిస్తున్నప్పటికీ వాటిని వినియోగదారులకు తెలిసేలా మరింతగా మార్కెటింగ్ చేయాలని కోరుతున్నాం’ అని జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు.

ట్రాయ్ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

2022లోనే ట్రాయ్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ప్రతి టెలికాం సంస్థ ప్లాన్ వోచర్లు, ప్రత్యేక టారిఫ్ వోచర్లు, కాంబో వోచర్ల రూపంలో కనీసం ఒక 30 రోజుల ప్లాన్‌ను అందుబాటులో ఉంచాలి. ప్రస్తుతం ‘టారిఫ్ ఫోర్బేరెన్స్’ విధానం అమలులో ఉండటంతో ధరలు, సర్వీసు నిబంధనలు నిర్ణయించుకునే స్వేచ్ఛ ఆపరేటర్లకు ఉంది. అయినప్పటికీ, వినియోగదారులను ఇబ్బంది పెట్టకుండా ట్రాయ్ నిరంతరం పర్యవేక్షిస్తోంది.

త్వరలో కీలక నిర్ణయం?

పార్లమెంటులో ఎంపీలు లేవనెత్తిన అభ్యంతరాలు, ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో.. రీఛార్జ్ వ్యాలిడిటీ పీరియడ్,  ఇన్‌కమింగ్ కాల్స్ నిలిపివేత అంశాలను ట్రాయ్ ప్రస్తుతం పునసమీక్షిస్తోంది. ఒకవేళ రెగ్యులేటర్ కఠిన నిర్ణయం తీసుకుంటే ఇకపై మొబైల్ బిల్లుల భారం తగ్గడమే కాకుండా డేటా వినియోగంలోనూ పారదర్శకత వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: సరిపడా నిల్వలున్నా ఎందుకీ యాతన?

Videos

ఐదేళ్లలో లక్షను కోటి చేసిన ఐటీ స్టాక్.. ఏకంగా 10 వేల శాతం జంప్ ...

KCR మంచి దోస్త్ నాకు..

తొందర పడకు.. ప్రతి రోజు సినిమా చూపిస్తా..

BJP MLA రాకేష్ రెడ్డి క్షమాపణ చెప్పాలి..

పూరీలా ఒక్క రోజు బతికితే చాలు..

పరిస్థితుల్ని అదుపుచేయ్యాలి అంటే లాక్ డౌన్ తప్పదా..?

ఆ బిల్లుకు పూర్తి మద్దతు మోదీకి జగన్ ట్వీట్

కూటమి వేధింపులు.. IAS, IPSలను కూడా వదలరా!

యుద్ధం పేరుతో గ్యాస్ మాటలు... కిరోసిన్ ఇస్తావు సరే... స్టవ్ లు సంగతేంటి

ఇబ్బందులు ఉంటాయి తెలిసినా అశోక్ బాబు మాత్రం...

Photos

+5

నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)

+5

డిఫరెంట్ లుక్స్‌తో షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

వావ్ అనేలా మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఫొటోలు

+5

IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)

+5

హనీమూన్ కాదు బడ్డీమూన్.. రష్మిక-విజయ్ ఇలా (ఫొటోలు)

+5

ఇదేం బిల్డప్‌ చంద్రబాబూ.. క్రెడిట్ చోరీ ఆగదా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

యువ నటుడు కెన్ కరుణాస్ 'యూత్' సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : పెట్రోల్‌ బంక్‌ల వద్ద భారీ క్యూ.. వదంతులతో జనం పరుగులు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో జోరు వాన (ఫోటోలు)

+5

నటిని పెళ్లాడిన ప్రముఖ ర్యాపర్‌ బాద్‌షా (ఫోటోలు)