అవమానించారు.. జోకర్ లా చూశారు! మీరు డాక్టర్ కాదు.. కనిపించే దేవుడు
Breaking News
షకీరా భారత్ పర్యటన బ్రేక్
Published on Sun, 03/22/2026 - 15:15
పశ్చిమ ఆసియాలో తీవ్రమవుతున్న ఘర్షణల కారణంగా షకీరా భారత సంగీత కచేరీ వాయిదా పడిందని నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్‌లో ముంబై, ఢిల్లీలలో జరగాల్సిన ఈ ప్రదర్శనలను "భౌగోళిక రాజకీయ పరిస్థితి, ప్రాంతీయ ఉద్రిక్తతల" కారణంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. టిక్కెట్టు కొనుగోలు చేసిన అభిమానులకు పూర్తిగా డబ్బు వాపసు ఇవ్వబడుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమం గురించి నిర్వహాకులు ఇలా ప్రకటించారు. "ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా.. షకీరా పాల్గొనవలసిన 'ఫీడింగ్ ఇండియా కాన్సర్ట్' మరో తేదీకి వాయిదా వేయబడింది. అభిమానుల రక్షణే మా యూనిట్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. టిక్కెట్టు కొనుగోలు చేసిన వారందరికీ పూర్తి వాపసు ఇవ్వబడుతుంది," అని డిస్ట్రిక్ట్ అప్‌డేట్స్ ఇన్‌స్టాగ్రామ్ తమ హ్యాండిల్‌లో ఒక పోస్ట్ పేర్కొంది.
కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చారు. కొలంబియన్ సింగర్ షకీరా మత్తెక్కించే గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. భారత్‌లో తొలిసారి ముంబైలో(2007) ఒక అద్భుతమైన కచేరీ చేసింది. ఇక్కడ అదే ఆమెకు తొలి ప్రదర్శన కావడం విశేషం. ప్రస్తుతం తన కొత్త ఆల్బమ్, "లాస్ ముజెరెస్ యా నో లోరన్ వరల్డ్ టూర్" (Las Mujeres Ya No Lloran World Tour) తో సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఆమె ప్రదర్శనలు ఇస్తోంది.
Tags : 1