అవమానించారు.. జోకర్ లా చూశారు! మీరు డాక్టర్ కాదు.. కనిపించే దేవుడు
Breaking News
లంగా ఓణితో పార్టీకి వెళ్లలేం కదా.. డ్రెస్సింగ్‌పై నిహారిక కామెంట్స్
Published on Sun, 03/22/2026 - 15:07
మహిళల వస్త్రధారణ పై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎలాంది దుస్తులు ధరించాలనేది వారిష్టం కానీ, సమాజాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మెలగాలని ఆమె అన్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మహిళల వస్త్రధారణ గురించి మాట్లాడుతూ.. ‘నా వరకు అయితే నాలుగు గోడల మధ్య ఉన్నప్పుడు ఇష్టం వచ్చిన దుస్తులు ధరించొచ్చు. కానీ బయటకు వచ్చిన తర్వాత మనం సొసైటీతో ఎన్నో రిలేషన్స్ పెట్టుకొని ఉంటాం, వాటికి అనుగుణంగానే వస్త్రధారణ ఉండాలి.
నేను ఏదైనా ఒక పెళ్లికి వెళితే కచ్చితంగా చీర కట్టుకొనే వెళ్తాను. అలాగే నా ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి వెళితే లంగా ఓణి వేసుకొని వెళ్లలేను కదా? అలా వెళ్తే.. అందరూ కింది నుంచి పైవరకు అలా చూస్తారు(నవ్వుతూ..). మనం వెళ్లే సందర్భాన్ని బట్టి దుస్తులు ఉండాలి.
టీనేజ్ లో ఉన్నప్పుడు మన పేరెంట్స్ ఇలాంటి డ్రెస్ వేసుకొద్దు.. అలా రెడీ కావాలని చెబుతుంటారు. అది మనకు కండీషన్లు పెట్టినట్లు కాదు..బయట సమాజం గురించి తెలియదు కాబట్టే వాళ్లు ప్రొటెక్ట్ చేస్తున్నారనీ అర్థం. నాక్కుడా నాన్న అలాంటి సలహా ఇచ్చేవారు. అమ్మ కూడా ‘ఇది నీకు సెట్ అవ్వలేదు..అది వేసుకో బాగుంటుంది’ అని చెప్పేది. అందులో తప్పేం లేదు. టీనేజ్ దాటిన తర్వాత కూడా అలాంటి కండీషన్లు పెట్టడం కరెక్ట్ కాదు. వాళ్లకు తెలుసు. ఏ డ్రెస్ వేసుకుంటే.. ఎలాంటి కామెంట్స్ చేస్తారో. మనం సమాజంలో తిరుగుతున్నాం కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని దుస్తులు ధరించాలి’ అని నిహారిక చెప్పుకొచ్చింది.
నిహారిక కెరీర్ విషయానికొస్తే.. నటనకు కాస్త బ్రేక్ ఇచ్చి.. నిర్మాణ సంస్థపై ఫోకస్ చేసింది. తన బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై వరుస సినిమాలు నిర్మించేందుకు రెడీ అవుతోంది. తాజాగా రాకాస అనే హర్రర్ కామెడీ చిత్రాన్ని నిర్మించింది. సంగీత్ శోభన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కాబోతుంది.
Tags : 1