బిడ్డను కోల్పోయిన గర్భిణి.. కంపెనీకి రూ.210 కోట్ల ఫైన్‌!

Published on Sun, 03/22/2026 - 14:46

మహిళలకు ప్రెగ్నెన్సీ సమయంలో.. దాదాపు చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పిస్తుంటాయి. కానీ అమెరికాలోని టోటల్ క్వాలిటీ లాజిస్టిక్స్ (TQL) అనే సంస్థ.. తమ ఉద్యోగి గర్భంతో ఉన్నప్పుడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించలేదు. ఆ తరువాత ఏకంగా రూ.210 కోట్ల జరిమానా చెల్లించాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

అమెరికాలోని హామిల్టన్ కౌంటీలో జరిగిన విషాదకర సంఘటనకు సంబంధించి కోర్టు తీర్పు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ కేసులో టోటల్ క్వాలిటీ లాజిస్టిక్స్ (TQL) అనే సంస్థపై భారీ నష్టపరిహారం విధించారు.

చెల్సియా వాల్ష్ అనే మహిళ.. గర్భధారణ సమయంలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉండేది. 2021 ఫిబ్రవరిలో, ముందస్తుగా ప్రసవం జరగకుండా ఉండేందుకు ఆమె ఒక వైద్య చికిత్స చేయించుకుంది. డాక్టర్లు ఆమెకు ఎక్కువగా కదలకుండా ఉండాలని, బెడ్ రెస్ట్‌ తీసుకోవాలని.. ఉద్యోగం చేస్తున్నట్లయితే.. ఇంటి నుంచే పని చేయాలని సూచించారు.

డాక్టర్ల సలహాను అనుసరించి.. చెల్సియా తన కంపెనీని సంప్రదించి వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతి కోరింది. కానీ కంపెనీ ఆమె అభ్యర్థనను తిరస్కరించింది. అంతేకాకుండా.. ఆఫీసుకు రావాలని లేదా జీతం లేకుండా సెలవు తీసుకోవాలని చెప్పింది. ఇది ఆమెకు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కష్టమైన పరిస్థితిని సృష్టించింది.

కంపెనీ తన అభ్యర్థనను తిరస్కరించడంతో.. చెల్సియా తన ఆరోగ్యానికి విరుద్ధంగా మూడు రోజుల పాటు ఆఫీసుకు వెళ్లాల్సి వచ్చింది. చివరికి ఫిబ్రవరి 24న కంపెనీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతిచ్చింది. అయితే అదే రోజు ఆమెకు ముందస్తు ప్రసవం జరిగింది.

ఆమె కుమార్తె 'మాగ్నోలియా' కేవలం 21 వారాల గర్భధారణలోనే జన్మించింది. పుట్టినప్పుడు ఆ శిశువు శ్వాస తీసుకుంటూ, గుండె కొట్టుకుంటూ ఉండింది. కానీ ఎంతో బాధాకరంగా, కేవలం ఒక గంటా ముప్పై నిమిషాల్లోనే ఆమె తల్లి ఒడిలో ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

ఇదీ చదవండి: రూ.47 లక్షల జాబ్‌ రిజెక్ట్ చేసిన టెకీ.. కారణం ఏమిటంటే!

ఈ ఘటనపై కోర్టులో కేసు పెట్టగా, జ్యూరీ సభ్యులు కంపెనీ తీసుకున్న నిర్ణయం ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని తేల్చారు. మొదట 25 మిలియన్ డాలర్ల నష్టపరిహారం విధించినా, 90% బాధ్యత కంపెనీదిగా నిర్ణయించి చివరికి 22.5 మిలియన్ మిలియన్ డాలర్లు (సుమారు రూ.210 కోట్లు) చెల్లించాలని తీర్పు ఇచ్చారు.

Videos

అవమానించారు.. జోకర్ లా చూశారు! మీరు డాక్టర్ కాదు.. కనిపించే దేవుడు

హెచ్-1బీ వీసా కష్టాలు.. కరిగిపోతున్న అమెరికా కలలు

ఖతార్ లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి

రాసలీలలు చేసిన వ్యక్తితో దేవునికి పట్టు వస్త్రాలా?

వెనుక ఉండి నక్కి నక్కి చూస్తున్నాడు.. ఇప్పుడు అర్థమైందా నీ స్థాయి BR నాయుడు..

పెట్రోల్ రేటు పెంపు? చమురు కొరతపై మోదీ రివ్యూ మీటింగ్..

రెచ్చిపోయిన సీఎం రమేష్.. బంజారా హిల్స్ లో భూకబ్జాకు యత్నం

అమెరికా మాపై దాడి చేస్తే మేము భారత్ పై దాడి చేస్తాం: పాక్ మాజీ హై కమీషనర్

సిద్ధమైన న్యూక్లియర్ సబ్ మెరైన్ ఏక్షణమైనా దాడి చేసే ఛాన్స్..

యూట్యూబర్ వైష్ణవి భర్తకు తీవ్ర అస్వస్థత

Photos

+5

పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి (ఫోటోలు)

+5

మోడర్న్‌ లెహంగాలో ముద్దమందారంలా మిల్కీబ్యూటీ.. (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 22-29)

+5

ప్రియుడిని పెళ్లాడిన బిగ్‌బాస్‌ బ్యూటీ పునర్నవి (ఫోటోలు)

+5

సంగీత సంబరం.. ట్రాఫిక్‌ సంకటం (ఫోటోలు)

+5

Ramzan celebrations : హైదరాబాద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు (ఫొటోలు)

+5

బుజ్జి అభిమానితో భోజనం చేసిన 'విరోష్‌' జోడీ (ఫోటోలు)

+5

డైరెక్టర్‌గా ‘జబర్దస్త్’ కమెడియన్‌..‘కామాఖ్య’ టీజర్‌ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

వేలాది భక్తుల మధ్య కైరుప్పల పిడకల సంబరం (ఫొటోలు)

+5

వాళ్లు అప్పుడు నాకు సూపర్‌స్టార్స్‌.. ఇప్పుడు నేను (ఫొటోలు)