అవమానించారు.. జోకర్ లా చూశారు! మీరు డాక్టర్ కాదు.. కనిపించే దేవుడు
Breaking News
'మత్తు'కు మందు ఇలా..!
Published on Sun, 03/22/2026 - 14:23
ఇటీవల డ్రగ్స్ అనే మహమ్మారి సెలిబ్రిటీల వేడుకల్లో కనిపించడం పరిపాటిగా మారింది. ఇక చిన్నపిల్లలూ, టీనేజ్ బాలల్లో ఈ అలవాటు పెరుగుతుండటం చాలా ఆందోళన కలిగించే అంశంగా మారింది. గతంలో టీనేజ్ పిల్లలు కొంత పెద్దయ్యాక మద్యం అలవాటుకు దగ్గరవుతుంటేనే ఎంతో ఆందోళనగా ఉండేది. అలాంటిది ఇప్పుడు పెద్ద నగరాల్లోని కొన్ని పబ్స్‌లో, పార్టీలలో, న్యూ ఇయర్ వేడుకల్లాంటి సోషల్ ఈవెంట్స్‌లో డ్రగ్స్ కనిపించడం కలకలం రేపుతోంది. అంతేకాదు... పెద్ద పెద్ద హోదాల్లో, పదవుల్లో ఉన్నవాళ్ల పార్టీల్లోనూ డ్రగ్స్ కనిపించడం బెంబేలెత్తిస్తోంది. డ్రగ్స్ మహమ్మారి పొంచి ఉన్న ప్రస్తుత నేపథ్యంలో... తమ టీనేజ్ పిల్లలూ, కుటుంబ సభ్యుల్లోని యువత ఇలా డ్రగ్స్‌కు అలవాటు పడటాన్ని తల్లిదండ్రులు గుర్తించడం ఎంతో అవసరం. డ్రగ్స్ అలవాటు, దాని దుష్పరిణామాలు ఎలా ఉంటాయో తెలపడం, దానికి కావాల్సిన చికిత్స ప్రక్రియలను సూచించడం కోసమే ఈ కథనం...
ఈమధ్య కాలంలో కొన్ని స్కూల్ ప్రాంగణాలలో హైస్కూల్ స్థాయికి వచ్చిన పిల్లలు సైతం డ్రగ్స్ తీసుకుంటున్నారన్న వార్తలు చాలా ఆందోళనకు గురిచేస్తున్నాయి. విశ్లేషకుల పరిశీలనల్లో డ్రగ్స్‌కు అలవాటు పడటం 14 నుంచి 18 ఏళ్ల పిల్లల్లో ఎక్కువని తెలుస్తోంది. అనేక అంశాలు ఇందుకు కారణమవుతున్నా ఈ కింది వాటిని ప్రధానమైనవిగా పరిగణించవచ్చు. అవి...
పాశ్చాత్య ధోరణుల్లోని పెడపోకడలను మన పిల్లలూ అనుసరించడం / అనుకరించడం
సెలిబ్రిటీలు కుటుంబాల్లో లేదా బాగా ధనవంతుల ఫ్యామిలీలలో పిల్లలపై పేరెంట్స్ పర్యవేక్షణ తక్కువగా ఉండటం
స్నేహితులూ, తోటివారు చేస్తున్న పనులు చూసి... వాటిలో ఏదైనా ఆనందాన్ని తాము మిస్ అవుతున్నామన్న భావనతో వాళ్లను అనుకరించడం (పియర్ ప్రెషర్స్)
ఆర్థికంగా మితిమీరిన స్వాతంత్య్రం ఉండటం తోపాటు కొత్తగా టీన్స్‌లో ఉండే సహజ ఉత్సాహంతో జీవితాన్ని ఎడ్వెంచరస్‌గా, ఎక్సయిటింగ్‌గా ఉండేలా చేసుకోవాలనే తాపత్రయంతో ఈ పెడదారులు తొక్కడం
మానసిక ఒత్తిడులనుంచి చాలా త్వరితంగా బయటపడాలన్న ఆకాంక్ష.
డ్రగ్స్ విషయంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలు...
ఈలోకంలోని చాలామందిలో ఒక అ΄ోహ ఉంటుంది. తమపై తమకు నియంత్రణ ఎక్కువ అనీ, తాము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఓ అలవాటు మానుకోగలమనే అపోహ ఉండటం చాలా సహజం. కానీ డ్రగ్స్ విషయంలో అలా కాదు. అవి మనిషిని బానిసగా మార్చేస్తాయి. అందుకే డ్రగ్స్‌ను మొదలుపెట్టి వదిలించుకోడానికి ప్రయత్నించడం కంటే ముందునుంచే దూరంగా ఉండటం మేలు
డ్రగ్స్ తాలూకు దుష్పరిణామాలు చాలా దీర్ఘకాలం ఉపయోగించాక కనిపిస్తాయని అనుకోవడం సాధారణం. కానీ చాలా సందర్భాల్లో ఆరోగ్యంపై చూపే ఆ దుష్ప్రభావాలు తొలిసారే కనిపించవచ్చు.
పార్టీ స్పైకింగ్ అంటే... : కొత్త అమ్మాయిలకూ లేదా అప్పటివరకూ ఎప్పుడూ మత్తుమందుల జోలికి వెళ్లని అబ్బాయిలకు డ్రగ్స్ అలవాటు చేయడం కోసం... వాళ్లకు తెలియకుండానే మత్తు ఇవ్వడాన్ని ‘పార్టీ స్పైకింగ్’గా చెబుతారు.
సహజంగా అలవాటుగా మారే డ్రగ్స్ ఇవి...
యాంఫిటమైన్స్, మెటా యాంఫిటమైన్స్ కొకైన్
బార్బిట్యురేట్స్,
మిథాజోలిన్, క్వినాజోలిన్ వంటి నిద్ర మాత్రలు (క్రాష్). కెన్నాబిస్ (గంజాయి)
నల్లమందు వంటి మాదకద్రవ్యాలు,
పొగాకులో ఉండే నికోటిన్
ఆల్కహాల్ (కాకపోతే నికోటిన్, ఆల్కహాల్‌ను పూర్తిగా డ్రగ్స్ కేటగిరీలో చెప్పలేకపోయినప్పటికీ... తమను బానిసగా మార్చుకునే సామర్థ్యం వీటికీ ఉంది).
మళ్లీ మళ్లీ తీసుకోవాలని ఎందుకు అనిపిస్తుందంటే...
సాధారణంగా మళ్లీ మళ్లీ తీసుకోవాలనే కోరికతో డ్రగ్స్‌కు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడటం అన్నది రెండు రకాలుగా జరుగుతుంది.
1) శారీరక లక్షణాలతో : తొలుత అంతులేని ఉత్సహం, ఎక్సైట్‌మెంట్, ధైర్యం వంటి ఎన్నో రకాల భావోద్వేగాలనూ, హాయి భావనను కలగజేసే ఈ డ్రగ్స్... వాటిని తీసుకోనప్పుడు దేహంలో శారీరకంగా కొన్ని తీవ్రమైన మార్పులు జరుగుతున్న అనుభూతిని కలగజేస్తాయి. అవేమిటంటే... డ్రగ్స్‌కు అలవాటు పడ్డ శరీరం వాటిని తీసుకోనప్పుడు దేహమంతా వణుకు, విపరీతంగా చెమటలు పట్టడం, స్థిరంగా స్థిమితంగా ఉండలేక΄ోవడం, గుండె దడ, కడుపులో నొప్పి, నీళ్ల విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
2) మానసికమైన భ్రాంతులతో : డ్రగ్స్ తీసుకోవడం అలవాటయ్యాక ఎప్పుడైనా తీసుకోనప్పుడు... కొందరిలో కొన్ని రకాల భ్రాంతులు కనిపించవచ్చు. అంటే లేని శబ్దాలు వినిపించడం, వాస్తవం కాని దృశ్యాలు కనిపించడం వంటివి. ఒక్కోసారి డ్రగ్స్‌కు అలవాటు పడ్డవారు తమనెవరో బాధపెడుతున్నట్లు భ్రాంతి చెందడమూ జరగవచ్చు. దాంతో మానసికంగా డ్రగ్‌కోసం పరితపించడం జరుగుతుంది.
సామాజికంగా జరిగే నష్టాలు డ్రగ్స్ తీసుకున్న వారు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వేగంగా వాహనాలు నడపటం, సెక్స్‌లో వికృతంగా ప్రవర్తించడం వంటి పనులకు పాల్పడవచ్చు. కొందరు దొంగతనాలూ, హత్యల వంటి నేరాలకూ పాల్పడవచ్చు. చదువు దెబ్బతినవచ్చు.
గుర్తించడం ఎలా...
పిల్లలు నలుగురితోనూ, కుటుంబసభ్యులతో కలవకుండా... తాము ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడటం
గతంలో ఎన్నడూ చూడని విధంగా తీవ్రంగా ప్రవర్తించడం
మాటలలో, చేతలలో నిర్లక్ష్యం, ఎవరినీ లెక్కచేయక΄ోవడం
వ్యక్తిగత పరిశుభ్రత అంతగా పాటించక΄ోవడం ∙
డ్రగ్స్‌కు అలవాటైన వారి చెమటనుంచి ఒక రకం వాసన వస్తుండటం
స్కూల్లో, కాలేజీలో స్కోర్ తగ్గడం... వంటి మార్పులు కనిపిస్తుంటే తప్పనిసరిగా తల్లిదండ్రులు గుర్తించి పిల్లలను డాక్టర్‌కు లేదా సైకియాట్రిస్ట్‌కు చూపించాలి.
డాక్టర్ శివ అనూప్ యెల్లా, సీనియర్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్
(చదవండి: కొండచిలువ రక్తంతో ఊబకాయానికి చెక్..!)
Tags : 1