'ఐటమ్‌ సాంగ్‌లో ఛాన్స్‌.. అలా అడుగుతారని భయపెట్టారు'

Published on Sun, 03/22/2026 - 07:03

దక్షిణాదిలోనే కాదు, ఇండియన్‌ సినిమాలోనే నటి నయనతార ప్రత్యేక జీవితం అని చెప్పక తప్పదు. కేరళ రాష్ట్రంలోని మారు మూల గ్రామానికి చెందిన ఈ మలయాళీ కుట్టి తనను నటిగా మలచుకోవడానికి చాలానే శ్రమించారు. పలు అవమానాలను, అవరాధాలను ఎదుర్కొని అగ్ర కథానాయకి స్థాయికి చేరుకున్నారు. కోలీవుడ్‌లో హరి దర్శకత్వంలో శరత్‌కుమార్‌ హీరోగా నటించిన అయ్యారు. ఈ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యి తొలి చిత్రంతోనే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత రజనీకాంత్‌ హీరోగా నటించిన చంద్రముఖ చిత్రంలో నటించి దక్షణాది వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. అలా వరుసగా విజయాలను అందుకుంటూ అందాల ప్రదర్శనలతోనూ, అభినయంతోనూ అందరినీ మెప్పిస్తూ, ఉమెన్స్‌ సెంట్రిక్‌ కథాపాత్రల్లో నటిస్తూ లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందారు.

ఆ తర్వాత నటుడు శింబు, ప్రభుదేవాతో ప్రేమాయణం బెడిసి కొట్టడంతో సింగిల్‌గానే జీవితాన్ని గడపాల్సిందే అని అనుకుంటున్న సమయంలో నానురౌడీదాన్‌ చిత్ర షూటింగ్‌లో ఆ చిత్ర దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ ప్రేమలో పడ్డారు. కొంతకాలం సహజీవనం తరువాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి చెన్నైలో చాలా గ్రాండ్‌గా జరిగింది. ఆ వెంటనే ఈ దంపతులు సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. ఈ విషయంలోనూ పలు సమస్యలను ఎదుర్కొని సురక్షితంగా బయటపడ్డారు.

స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్న తరుణంలోనూ ప్రత్యేక పాటల్లో నటించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఇటీవల తన గతంలో జరిగిన ఒక సంఘటన గురించి నయతార గుర్తు చేసుకుంటూ విజయ్‌ హీరోగా నటించిన శివకాశీ చిత్రంలో ప్రత్యేక పాటలో నటించే అవకాశం రావడంతో తాను అందుకు సమ్మతించానన్నారు. అయితే ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారంటూ పలువురు తనను ప్రశ్నించారన్నారు. ఇకపై అందరూ అలాంటి పాటల్లోనే నటించమని అడుగుతారని భయపెట్టారన్నారు. అయితే స్పెషల్‌ పాట అయితే స్పెషలేగా అని.. ఏదో ఒక ఇమేజ్‌ ఉంటేనే తనకు స్పెషల్‌ సాంగ్‌లో నటించే అవకాశం వచ్చిందని దాని ద్వారా పలు విషయాలు నేర్చుకోవచ్చని భావించానన్నారు. అలా తాను నటించిన రెండు స్పెషల్‌ సాంగ్స్‌తో చాలా విషయాలు నేర్చుకోగలిగానని నయనతార తెలిపారు. 

Videos

ఎండలను కంట్రోల్ చేస్తా.. వాట్ ఈజ్ దిస్ విడ్డూరం

ధురంధర్ 2 తెలుగు వర్షన్ రిలీజ్ ఎప్పుడు? అసలు కారణం ఏంటి?

ఒక్కసారిగా బాంబుల వర్షం.. ఇజ్రాయెల్ లో భయానక పరిస్థితి

ఇదిగో దస్తగిరి స్టేట్మెంట్.. ఈ ఒక్క దానికి సమాధానం చెప్పండి చాలు

శబాష్ జగన్.. ఇది మీకే సాధ్యం.. వైఎస్ జగన్ పై కేంద్రం ప్రశంసలు

BR నాయుడు రాసలీలపై చంద్రబాబు కొత్త డ్రామా

మిత్రపక్షానికి బాబు వెన్నుపోటు.. పవన్ కు ఆహ్వానం లేదు

2 రోజులే టైం.. తర్వాత ఇరాన్ ఉండదు.. ట్రంప్ సంచలన వార్నింగ్

మహిళతో టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు సంచలన ఆడియో లీక్

విశాఖకు వరంలా మారిన YS జగన్ విజన్

Photos

+5

ప్రియుడిని పెళ్లాడిన బిగ్‌బాస్‌ బ్యూటీ పునర్నవి (ఫోటోలు)

+5

సంగీత సంబరం.. ట్రాఫిక్‌ సంకటం (ఫోటోలు)

+5

Ramzan celebrations : హైదరాబాద్ లో ఘనంగా రంజాన్ వేడుకలు (ఫొటోలు)

+5

బుజ్జి అభిమానితో భోజనం చేసిన 'విరోష్‌' జోడీ (ఫోటోలు)

+5

డైరెక్టర్‌గా ‘జబర్దస్త్’ కమెడియన్‌..‘కామాఖ్య’ టీజర్‌ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

వేలాది భక్తుల మధ్య కైరుప్పల పిడకల సంబరం (ఫొటోలు)

+5

వాళ్లు అప్పుడు నాకు సూపర్‌స్టార్స్‌.. ఇప్పుడు నేను (ఫొటోలు)

+5

గద్దర్ అవార్డ్ వేడుక కోసం అక్కినేని కోడలు ఇలా (ఫొటోలు)

+5

మంచు విష్ణు కూతుళ్లని చూశారా? ఎంత పెద్దోళ్లయిపోయారో! (ఫొటోలు)

+5

గద్దర్‌ అవార్డ్స్‌- 2025లో మెరిసిన హీరోయిన్లు (ఫోటోలు)