విమాన ప్రయాణం.. ఇక కొత్త నిబంధనలు

Published on Wed, 03/18/2026 - 20:03

దేశంలో విమాన ప్రయాణాన్ని మరింత పారదర్శకంగా, సరసమైనదిగా, ప్రయాణికులకు అనుకూలంగా మార్చే దిశగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. యాడ్-ఆన్ ఛార్జీల భారం తగ్గించి, మొత్తం ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఉచితంగా సీట్ల కేటాయింపు
కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి విమానంలో కనీసం 60 శాతం సీట్ల కేటాయింపును ఉచితంగా చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రయాణికులు తమకు నచ్చిన సీటును ఎంచుకోవడానికి అదనపు డబ్బులు చెల్లించాల్సిన అవసరం తగ్గనుంది.

ఒకే పీఎన్ఆర్‌ ఉంటే పక్కపక్కనే సీట్లు
ఒకే పీఎన్ఆర్‌పై టికెట్లు బుక్ చేసుకున్న కుటుంబ సభ్యులు లేదా దంపతులకు విమానయాన సంస్థలు సాధ్యమైనంత వరకు పక్కపక్కనే సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో విడివిడిగా సీట్లు రావడం, అదనపు చార్జీలు చెల్లించడం వంటి ఇబ్బందులు తగ్గనున్నాయి.

క్రీడా సామగ్రి, సంగీత వాయిద్యాలు, పెంపుడు జంతువుల రవాణాపై విమానయాన సంస్థలు పారదర్శక విధానాలు పాటించాలి. భద్రతా నిబంధనలతో పాటు ప్రయాణికులకు అనుకూలంగా వీటి నిర్వహణ ఉండేలా చర్యలు తీసుకోవాలని డీజీసీఏ ఆదేశించింది.

రద్దులు, ఆలస్యాలపై కఠిన నియంత్రణ
విమానాల ఆలస్యం, రద్దు లేదా బోర్డింగ్ నిరాకరణ వంటి సందర్భాల్లో ప్రయాణికుల హక్కులను కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఎయిర్‌లైన్స్ నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎయిర్‌లైన్ వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లు, బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లు, విమానాశ్రయ కౌంటర్లలో ప్రయాణికుల హక్కులను స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. అలాగే ప్రాంతీయ భాషల్లో కూడా ఈ సమాచారాన్ని అందుబాటులో ఉంచనున్నారు.

విమానాశ్రయాల్లో ‘ఉడాన్ యాత్రి కేఫ్‌లు’ ఏర్పాటు చేసి సరసమైన ధరల్లో ఆహారం అందించనున్నారు. ‘ఫ్లైబ్రరీ’ ద్వారా ఉచితంగా పుస్తకాలు చదుకునే అవకాశం కల్పించనున్నారు. అదనంగా ఉచిత వై-ఫై సదుపాయం కూడా అందుబాటులో ఉంటుంది.

Videos

జగన్ నీకు చేసిన అన్యాయం ఏమిటి? షర్మిలపై కొండా రాఘవ రెడ్డి ఫైర్

విజయవాడ ఇఫ్తార్ విందులో YS జగన్

యూట్యూబ్ వైష్ణవి భర్త అరెస్ట్

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్‌

వక్ఫ్ భూముల జోలికొస్తే.. కూటమికి అంజాద్ బాషా వార్నింగ్

Ugadi: తెలుగు ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ ఉగాది శుభాకాంక్షలు

జగన్ ను కలిసిన HYD జర్నలిస్ట్, కె వెంకట్రామి రెడ్డి

ఇది నా న్యాయపోరాటంలో మొదటి అడుగు

ఇరాన్ 40ఏళ్ల ప్లానింగ్ వృధా.. ఒక్క క్షణంలో ముంచేసిన అమెరికా-ఇజ్రాయిల్..

జగన్ పాలనే బాగుంది YS షర్మిల సభలో రైతుల రియాక్షన్

Photos

+5

సాక్షి స్పెషల్.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు (ఫొటోలు)

+5

ఇఫ్తార్‌ విందు.. ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

ఫేమస్ వినాయక దేవాలయంలో మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ మాళవిక (ఫొటోలు)

+5

'ధురంధర్ 2' సినిమా.. HD ఫొటోలు

+5

సంప్రదాయ మరాఠీ ఆడపడుచుగా సారా టెండుల్కర్‌ (ఫొటోలు)

+5

అందంగా రాశీఖన్నా.. చీరలో క్యూట్ శ్రీలీల (ఫొటోలు)

+5

శ్రీశైలంలో ఉగాది జాతర..నల్లమలలో పాదయాత్రగా వెళ్తున్న కర్ణాటక భక్తులు (ఫోటోలు)

+5

నటి మంచు లక్ష‍్మి ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)