Breaking News

నటనా ‘కోట’కు ఆస్కార్‌ నీరాజనం

Published on Tue, 03/17/2026 - 10:51

కంకిపాడు: పద్మశ్రీ అవార్డు గ్రహీత, సినీనటుడు కోట శ్రీనివాసరావు విలక్షణ నటుడు. తన హావభావాలు, నటనతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి, తనకంటూ సినీ జగత్తులో కొన్ని పేజీలు ఏర్పాటు చేసుకున్నారు. నాటి నుంచి నేటి వరకూ ఆయన నటనకు మంత్ర  ముగ్ధులు కాని వారు లేరంటే అతిశయోక్తికాదు. సోమవారం ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవ సభలో ఇటీవల మరణించిన భారతదేశ సినీరంగ ప్రముఖులను స్మరించుకున్న నేపథ్యంలో తెలుగు చిత్రపరిశ్రమ నుంచి కోట శ్రీనివాసరావును స్మరించటం తెలుగు చిత్ర       పరిశ్రమకు దక్కిన గౌరవంగా భావించొచ్చు. 

కంకిపాడు నుంచే అన్నీ.. 
గతేడాది జూలైలో కోట శ్రీనివాసరావు ఆకస్మికంగా మృతి చెందటం కళాభిమానులను కలచివేసింది. అయితే ఆస్కార్‌ వేదికగా దక్కిన అరుదైన గౌరవానికి ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. కోట పుట్టింది, పెరిగింది, ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది కంకిపాడు నుంచే. చిన్న నాటి నుంచి ఇక్కడి ప్రజలతో అవినాభావ సంబంధం ఉంది. పట్టణంలోని చిన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద స్వస్థలం ఉంది. ఇక్కడే ఆయన నివాసం కూడా  ఉంది. కోట తండ్రి సీతారామాంజనేయులు లాకురోడ్డులోని గాంధీ బొమ్మ సెంటరులోని ఓ ఇంటి వద్ద వైద్యుడిగా క్లినిక్‌ నడిపేవారు. వైద్యుడిగా            అందరికీ సుపరిచితులు. కోట శ్రీనివాసరావు ఆయన సోదరులు నరసింహారావు, శంకర్‌రావు నాటకరంగం నుంచి సినీరంగం వరకూ ఎదిగి అందరి మన్ననలు పొందటం తెలిసిందే. స్థానికంగా ఉన్న ఎలిమెంటరీ పాఠశాలలో ప్రాథమిక విద్య, ఉన్నత విద్యలను అభ్యసించిన కోట.. బ్యాంకు ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించారు.            కంకిపాడు, విజయవాడ, హైదరాబాద్‌లోని ఎస్‌బీఐ బ్రాంచిల్లో ఉద్యోగిగా పనిచేస్తూ సినీరంగంలోకి అడుగుపెట్టారు. తొలి నాళ్లలో నాటకరంగంలో ప్రవేశించినా.. అంతటి ప్రాచుర్యం దక్కలేదు. అయితే సినీరంగంలో అంచెలంచెలుగా ఎదిగి, విలక్షణ నటుడిగా గుర్తింపు సాధించారు. ఆయన ప్రతిభను గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించి గౌరవించారు.  

అరుదైన గౌరవం..  
కోట సీతారామంజనేయులు కుటుంబం అందరికీ సుపరిచితం. తండ్రి వైద్య రంగంలో, కుమారులు కళారంగానికి వన్నె తెచ్చారు. మా ఇంటి పక్కనే నివాసం ఉండే వారు. వీలు దొరికినప్పుడల్లా ఆ కుటుంబంతో గడిపేవాళ్లం. ఆయన మరణం చాలా బాధించింది. అయితే ఆస్కార్‌ వేదికగా మా కంకిపాడు వాసికి గౌరవం దక్కటం సంతోషంగా ఉంది.  
– గాదంశెట్టి పరమేశ్వరరావు, కంకిపాడు

సమయం చిక్కినప్పుడల్లా.. 
కోట ఎంత బిజీగా ఉన్నా.. ఏ కొంత సమయం చిక్కినా కంకిపాడుకు వచ్చేవారు. ఆయన స్వస్థలంలో ఉన్న నివాసానికి వచ్చి గ్రామస్తులతో ఇష్టాగోష్టి జరిపేవారు. సినీ అభిమానులు ఆయన్ను కలుసుకుని ఆశీర్వాదం పొందేవారు. కళారంగానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటూ కళాభిమానుల్ని ప్రోత్సహించేవారు.   

Videos

లాగి చెంపకేసి ఒక్కటి పీకాల్సింది పోయి... ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసుపై జగన్ స్టాంగ్ రియాక్షన్

జగన్ 2.0 ట్రేడ్ మార్క్ మొదటి ప్రాధాన్యత వాళ్లకే

టీడీపీ ఎంపీ పుట్టా డ్రగ్ కేసుపై జగన్ రియాక్షన్

కాంగ్రెస్‌కు గుడ్ బై... నేను పార్టీ మారడం ఖాయం

LIVE: నో యాక్షన్..? జగన్ సంచలన కామెంట్స్...

ఉగాది, రంజాన్ కు బిగ్ షాక్... నో గ్యాస్.. నో ఇండక్షన్..

ద్వారకా తిరుమలలో టికెట్ల స్కామ్ సీసీటీవీతో బయటపడిన మోసం

కూలేశ్వరం వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

10 ఏళ్లు మినిస్టర్ చేశావ్.. అసెంబ్లీలో KTR సెటైర్లకు సీతక్క స్ట్రాంగ్ కౌంటర్

కూటమి నేతల నీచపు పనులపై YS జగన్ సంచలన రియాక్షన్

Photos

+5

తమ్ముడి పిల్లల బర్త్‌డే వేడుకల్లో మహేశ్‌ బాబు (ఫోటోలు)

+5

ఆస్కార్‌ వేడుకలో మెరిసిన వారణాసి బ్యూటీ ప్రియాంక చోప్రా.. (ఫోటోలు)

+5

రష్మిక-విజయ్ దేవరకొండ హల్దీ వేడుక.. (ఫొటోలు)

+5

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఘనంగా నమన్‌ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)

+5

OSCARS 2026 : ఆస్కార్‌ విజేతల జాబితా (ఫోటోలు)

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)

+5

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు (ఫోటోలు)