Breaking News

నిజమైన పంచాంగము

Published on Tue, 03/17/2026 - 09:36

ఉగాది పండుగ అనగానే వెంటనే పంచాంగ పఠనం మనకు గుర్తుకొస్తుంది. ప్రతి ఊళ్లో పంచాంగ పఠనాన్ని వినటానికి జనం ఉత్సాహంగా గుమికూడతారు. 1961 మార్చి 17న పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సత్య సాయిబాబా వారి సమక్షంలో కస్తూరి పంచాంగం చదివాడు. బాబా ఇలా అన్నారు: ‘కస్తూరి ఇప్పుడు ‘ప్లవ’ నామ సంవత్సర పంచాంగం చదివాడు. విన్న మీలో విచారము, అశాంతి ఎక్కువవుతున్నాయి. ఈ పంచాంగము గురించి ఆందోళన చెందకండి, మీ లోపల ఉన్న పంచ అంగముల యెడల జాగ్రత్త వహించండి. అవి చాలా శక్తిమంతములైనవి. అవే ఐదు కర్మేంద్రియములు. వాటిని అదుపులో ఉంచటంలో మనస్సుకి శిక్షణ ఇవ్వండి. మీరు భగవంతుని అనుగ్రహం పొందినట్లయితే ఏ గ్రహమూ మిమ్మల్ని ఏమీ చేయదు.’ (పుట 15– శ్రీ సత్యసాయి వచనామృతం–1961–1962). ఈ సందర్భంలో మనం ఒక శ్లోకాన్ని గుర్తుకు తెచ్చుకొని పరిశీలిస్తే మంచిది:

కురంగ, మాతంగ, పతంగ, భృంగ
మీనాః హతాః పంచభిరేవ పంచ.
ఏకః ప్రమాదీ స కథం నహన్యతే
యస్సేవతే పంచభి రేవ పంచ. 

లేడి, ఏనుగు, మిడత, చేప, తుమ్మెద ఈ అయిదును శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అను అయిదు విషయములలో క్రమముగా ఒక్కొక్క విషయముచే ఆకర్షింపబడి వానికి వశములై చనిపోవుచున్నవి. ఒక్కొక్క విషయమునకు, ఇంద్రియమునకు మాత్రమే వశములై పోయిన వాని దురవస్థ ఇట్లుండగా; అయిదు విషయములకు, అయిదు ఇంద్రియములకు వశమైపోయి, ఆ విషయములన్నిటిని ఎడతెగక ఎల్లప్పుడు అనుభవించుచున్న వారి దురవస్థను గురించి ఏమని వర్ణింపవలెను? (అద్వైతాక్షర మాలిక).

పంచాంగములైన కర్మేంద్రియాలను, పంచాంగములైన జ్ఞానేంద్రియములను జాగ్రత్తగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, నియంత్రించటం వల్లే శుభం కల్గుతుంది. ఒక్క ఉగాది రోజే కాక సంవత్సరమంతా అలా చేస్తే ఏడాదంతా పండుగే. పంచాంగ పఠనం (పరిశీలన) రోజూ చేయాల్సిందే.

– రాచమడుగు శ్రీనివాసులు  

Videos

103 డాలర్లకు చమురు ధర

దొంగచాటుగా హర్ముజ్ జలసంధిని దాటుతున్న నౌకలు

కూటమి తీరుపై రాష్ట్రవ్యాప్తంగా వైస్సార్సీపీ భారీ నిరసన

సీపీ సతీమణి ఏకే 47 గన్ తో 10 రౌండ్ల కాల్పులు

శత్రుల రాడార్లను ముప్పు తిప్పలు పెట్టె ఇరాన్ మిస్సైల్

Sec-Bad: 800 కిలోల కుళ్లిన చికెన్

ఎమ్మెల్యేల కథ దేవుడెరుగు.. BR నాయుడు రాసలీలలపై జగన్ సెటైర్లు

ఇది కదా తండ్రి ప్రేమంటే కొడుకు పరీక్ష కోసం ఏం చేశాడంటే

లాగి చెంపకేసి ఒక్కటి పీకాల్సింది పోయి... ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసుపై జగన్ స్టాంగ్ రియాక్షన్

జగన్ 2.0 ట్రేడ్ మార్క్ మొదటి ప్రాధాన్యత వాళ్లకే

Photos

+5

ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

తమ్ముడి పిల్లల బర్త్‌డే వేడుకల్లో మహేశ్‌ బాబు (ఫోటోలు)

+5

ఆస్కార్‌ వేడుకలో మెరిసిన వారణాసి బ్యూటీ ప్రియాంక చోప్రా.. (ఫోటోలు)

+5

రష్మిక-విజయ్ దేవరకొండ హల్దీ వేడుక.. (ఫొటోలు)

+5

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఘనంగా నమన్‌ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)

+5

OSCARS 2026 : ఆస్కార్‌ విజేతల జాబితా (ఫోటోలు)

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)

+5

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)