కీచక డాక్టర్ కి బడితపూజ.. చెప్పులతో దేహశుద్ధి చేసిన మహిళలు
Breaking News
గ్లోబల్ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా హైదరాబాద్
Published on Mon, 03/16/2026 - 12:01
హైదరాబాద్ నగరం ఇప్పుడు కేవలం ఐటీ, ఫార్మా హబ్ మాత్రమే కాదు.. గ్లోబల్ సినిమా టెక్నాలజీ సెంటర్‌గానూ తన స్థానాన్ని బలపరుచుకుంటోంది. ఇటీవల అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైన అత్యాధునిక ఏ అండ్ ఎమ్ మోషన్ క్యాప్చర్ ల్యాబ్‌తో పాటు ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన నెట్ ఫ్లిక్స్ ఐ లైన్ హబ్.. ఆధునిక పోస్ట్–ప్రొడక్షన్, వీఎఫ్‌ఎక్స్ హబ్.. ఇవన్నీ కలిపి ఇండియన్ సినిమా స్వరూపాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. ఇప్పటి వరకూ కథ, నటన, సంగీతం వరకే పరిమితమైన భారతీయ సినిమా ప్రయాణం ప్రస్తుతం టెక్నాలజీ ఆధారిత విజువల్ స్టోరీ టెల్లింగ్ వైపు వేగంగా దూసుకెళ్తోంది. ఈ మార్పుకు కేంద్రబిందువుగా హైదరాబాద్ మారుతోంది. ఇది ఒక ట్రెండ్ కాదు.. ఇది సినిమా చరిత్రలో ఒక కొత్త అధ్యాయం. హైదరాబాద్ పాన్ ఇండియా స్థాయి నుంచి పాన్ వరల్డ్ స్థాయికి దూసుకుపోతోందనడానికి నిదర్శనం.
మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ అంటే నటుడి ప్రతి కదలిక, భావం, శరీర కదలికల ద్వారా వ్యక్తమయ్యే భాషను సెన్సార్ల ద్వారా రికార్డ్ చేసి, డిజిటల్ క్యారెక్టర్‌గా మార్చడం. హాలీవుడ్‌లో అవతార్ లాంటి సినిమాలను ఈ టెక్నాలజీతోనే నిర్మించారు. ఇప్పటివరకు ఈ సౌకర్యం కోసం భారతీయ దర్శకులు విదేశాలపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం నగరంలోని అన్నపూర్ణ స్టూడియోలో, నెట్ ఫ్లిక్స్ వంటి వేదికల్లోని ఆధునిక మోషన్ క్యాప్చర్ ల్యాబ్‌తో.., భారీ బడ్జెట్ ఫ్యాంటసీ, మైథలాజికల్, సై–ఫై, యానిమేషన్ హైబ్రిడ్ సినిమాలు హైదరాబాద్ నుంచే రూపొందే అవకాశం ఏర్పడింది. ఇది తెలుగు సినిమాకు మాత్రమే కాదు, మొత్తం ఇండియన్ సినిమాకు కీలకంగా మారనుంది.
గ్లోబల్ సినిమాకు కేరాఫ్ అడ్రస్..
ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైన నెట్ ఫ్లిక్స్ గ్లోబల్ వీఎఫ్‌ఎక్స్, పోస్ట్ ప్రొడక్షన్ హబ్ మరో కీలక మైలురాయి. ఇది కేవలం ఓ స్టూడియో కాదు.. ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ కోసం వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లకు విజువల్ ఎఫెక్ట్స్, వర్చువల్ ప్రొడక్షన్, కలర్ గ్రేడింగ్, డిజిటల్ ఇంటరీ్మడియట్ అన్నీ ఇక్కడే జరగనున్నాయి. దీని ద్వారా హైదరాబాద్‌కు అంతర్జాతీయ సినిమా అవకాశాలు రావడం, వందల సంఖ్యలో యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్, గేమింగ్, కామిక్స్‌కు సంబంధించిన ఉద్యోగాలు లభించనున్నాయి. లోకల్ టాలెంట్ అంతర్జాతీయ ప్రాజెక్టులపై పనిచేయడం వంటి మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
గతం నుంచి వర్తమానానికి..!
హైదరాబాద్‌కు సినిమా రంగంలో బలమైన చరిత్ర ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన స్టూడియోలు, ల్యాబ్స్ వంటివి పోస్ట్–ప్రొడక్షన్ రంగంలో దేశానికే తలమానికంగా నిలిచాయి. ఇప్పుడు అదే వారసత్వం ఏఐ ఆధారిత ఎడిటింగ్, వర్చువల్ సెట్స్, రియల్ టైమ్ వీఎఫ్‌ఎక్స్, వర్చువల్ కెమెరా టెక్నాలజీ వంటి ఆధునిక హంగులతో కొత్త రూపాన్ని సంతరించుకోనుంది.
పాన్ వరల్డ్ స్థాయికి..
ఈ మార్పుల వల్ల భారతీయ చిత్ర నిర్మాణ రంగం కేవలం లోకల్ మార్కెట్‌కే కాదు.. నేరుగా గ్లోబల్ ఆడియన్స్‌ను లక్ష్యంగా చేసుకోనుంది. ఇటీవలి పాన్–ఇండియా, పాన్–వరల్డ్ సినిమాల విజయాలకు టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలు, ఊహా ప్రపంచాలు, వర్చువల్ యుద్ధాలు.. ఇవన్నీ ఇప్పుడు బడ్జెట్ పరిమితుల్లో భాగంగా ఉన్నాయి. అయితే తక్కువ ఖర్చుతో వీటిని నిర్మించాలంటే కేవలం మన దేశంలోనే సాధ్యమవుతుంది. దీంతో కథల స్థాయి మాత్రమే కాదు, ప్రెజెంటేషన్ స్థాయి కూడా అంతర్జాతీయంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Tags : 1