కొడుకే ప్రేరణ..తల్లిగా లాలన..

Published on Sun, 03/15/2026 - 17:11

ఒక కంటితో చూపు.. ఏం మాట్లాడినా వినపడదు.. ఏది చెప్పాలన్నా మాటలేదు.. ఆలోచనా శక్తి లేదు.. మానసికంగా ఎలాంటి ఎదుగుదల లేని కుమారుడినే ఓ తల్లి ‘ప్రేరణ’గా మార్చుకుంది. తన కుమారుడి వంటి ఎంతో మంది పిల్లలను అమ్మగా లాలిస్తోంది. వారి ఆలనా పాలనా చూస్తోంది. వారి సంక్షేమమే తప్ప ఎలాంటి లాభాపేక్ష  లేకుండా దాదాపు 22 ఏళ్లుగా స్పెషల్‌ స్కూల్‌ నడుపుతోంది. ఇలాంటి పిల్లలంతా ఆత్మవిశ్వాసంతో జీవించాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది హైదరాబాద్‌లోని మలక్‌పేటకు చెందిన ఈ అమ్మ..

మలక్‌పేటకు చెందిన తొగరుచేడు విజయలక్ష్మి 2004లో అక్బర్‌బాగ్‌ పల్టాన్‌లో నలుగురితో ‘ప్రేరణ స్పెషల్‌ స్కూల్‌’ ప్రారంభించింది. వయసు భేదం లేకుండా 22 ఏళ్లుగా సేవలు అందిస్తోంది. స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో శిక్షణ పొంది, టీచర్‌గా పనిచేసిన ఆమె ప్రస్తుతం మలక్‌పేట ప్రభుత్వ క్వార్టర్స్‌లో దాతల సహకారంతో 12 మంది టీచింగ్, నాన్‌ టీచింగ్‌ సిబ్బందితో ఓ స్కూల్‌ నడిపిస్తోంది.  

పిల్లలకు స్వశక్తిలో శిక్షణ.. 
ఇక్కడ ఎక్కువ మంది సెరిబ్రల్‌ పాల్సీ, స్పాస్టిక్‌ చి్రల్డన్స్‌ ఉన్నారు. మెంటల్లీ చాలెంజ్‌ పిల్లలకు స్వీయరక్షణ, మాట్లాడటం, ఫిజియోథెరపీ, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ రకరకాల వాటితో పాటు కంప్యూటర్‌లో శిక్షణ ఇస్తున్నారు. పిల్లల తల్లిదండ్రులకు అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్స్, పేరంటల్‌ గైడెన్స్‌ తరగతుల్ని నిర్వహిస్తున్నారు. మైనంతో దీపాలు, గ్రీటింగ్‌ కార్డులు, స్క్రీన్‌ ప్రింటింగ్, ఆఫీస్‌ ఫైల్స్‌ చేయించడంలో తరీ్ఫదు ఇస్తున్నారు. 

పప్పుల ప్యాకింగ్, బుక్‌ బైడింగ్, ఆడపిల్లలకు వంటింటి పనులు నేర్పిస్తున్నారు. నిత్యజీవిత అవసరాలు తీర్చుకునేలా బ్యాంకు పనులు, సరుకులు కొనుక్కోవడం, బస్సులో వెళ్లి తిరిగి రావడం, రైలు, బస్సు రిజర్వేషన్లు చేయించడం, అక్షరాలు చదవగలగడం వంటి తదితర వాటిని నేర్పిస్తారు.

ఆత్మవిశ్వాసంతో.. 
మెంటల్లీ చాలెంజ్‌డ్‌ పిల్లలను ప్రారంభంలోనే గుర్తించి.. వారికి సరైన వైద్యం, సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌లో వారికి శిక్షణ అందిస్తే ఫలితాలు ఉంటాయి. పిల్లల తల్లులు ఆ పనిని సవాల్‌గా తీసుకుంటే ఎవరిపై ఆధారపడకుండా ఆత్మవిశ్వాసంతో జీవిస్తారు. ఒక కన్నుతోనే చూసి.. వినపడని, మాట్లాడలేని, మానసికంగా ఎదగని నా కొడుకు వంశీ నాకు ‘ప్రేరణ’. పిల్లల సంక్షేమమే ధ్యేయంగా, లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ మాది.
తొగరుచేడు విజయలక్ష్మి, ప్రేరణ స్పెషల్‌ స్కూల్‌ నిర్వాహకురాలు  

(చదవండి: డెలివరీ బాయ్‌గా 78 ఏళ్ల వ్యక్తి..!)

#

Tags : 1

Videos

మల్లారెడ్డి మల్టీ టాలెంట్.. సింగిల్ పీస్

నేను తప్పు చేయలేదు.. అడ్డంగా దొరికి బుకాయింపు

మీకోసమే.. ఆపిల్ ల్యాప్ టాప్ చౌక

మీకు తెలియని ఇరాన్ హిస్టరీ.. అమెరికాను చితక్కొడుతున్న ఎడారిదేశం

పెద్ద తలకాయలు ఎంట్రీ.. పుట్టా మహేష్ కు నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు

రైతుకు CI బెదిరింపులు.. ఎక్కడా భయపడని రైతన్న.. ఆడియో కాల్ లీక్

డ్రాగన్ పై దురంధర్ ఎఫెక్ట్..!

ఇంత నోరేసుకొని అరవడం కాదు.. అనితను ఏకిపారేసిన రాచమల్లు

పుట్టా మహేష్ డ్రగ్స్ కేసు.. తండ్రి కొడుకులకి ఇచ్చిపడేసిన కన్నబాబు

నువ్వు ఎంపీనా? డ్రగ్స్ డీలరా? టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ పై విజయ్ రాజు ఫైర్

Photos

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)

+5

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు (ఫోటోలు)

+5

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్‌ పోస్ట్‌ (ఫొటోలు)

+5

అల్లు సినిమాస్‌ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)

+5

కూకట్‌పల్లిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)

+5

ఖమ్మంలో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)

+5

‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌, బన్నీ (ఫోటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్‌- సానియా సంగీత్‌.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)