Breaking News

మస్క్ టీమ్‌లో చేరిన ఇండియన్: ఎవరీ దేవేంద్ర చాప్లోట్?

Published on Sat, 03/14/2026 - 16:41

ప్రపంచ వ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ రంగాలలో భారతీయుల ప్రతిభ ఎంతో గుర్తింపు పొందుతోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు.. ఇండియన్ రోబోటిక్స్ ఎక్స్‌పర్ట్‌ & ఏఐ పరిశోధకుడు అయిన దేవేంద్ర చాప్లోట్‌.. ఎలాన్ మస్క్ కంపెనీలో చేరారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దేవేంద్ర చాప్లోట్ తన సోషల్ మీడియా ఖాతాలో.. ఎలాన్ మస్క్‌తో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. సూపర్ ఇంటెలిజెన్స్ నిర్మించడానికి మస్క్ టీమ్‌లో చేరుతున్నాను అని వెల్లడించారు. దీనికి స్పందిస్తూ.. xAIలోకి స్వాగతం అంటూ మస్క్ ట్వీట్ చేశారు.

ఎవరీ దేవేంద్ర చాప్లోట్?
IIT-బాంబే పూర్వ విద్యార్థి అయిన చాప్లోట్, AI & రోబోటిక్స్ రంగంలో పనిచేస్తున్నారు. ఈయన 2014లో IIT-బాంబే నుంచి కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్‌లో B.Tech & అప్లైడ్ స్టాటిస్టిక్స్‌లో మైనర్ పట్టభద్రుడయ్యారు. ఆ తరువాత కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ మెషిన్ లెర్నింగ్ విభాగం నుంచి పీహెచ్‌డీ పూర్తి చేసాడు. అక్కడే బిల్డింగ్ ఇంటెలిజెంట్ అటానమస్ నావిగేషన్ ఏజెంట్లపై పనిచేశారు.

చాప్లోట్ దక్షిణ కొరియాలోని శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్‌లో దాదాపు ఒక సంవత్సరం పాటు పనిచేశాడు. తరువాత అతను ఫేస్‌బుక్ AI రీసెర్చ్‌లో చేరాడు. AI రీసెర్చ్ సైంటిస్ట్‌గా, అతను ఆ సంస్థలో కంప్యూటర్ విజన్ అండ్ రోబోటిక్స్‌లో పనిచేశాడు. 2020లో, రోబోటిక్స్ నిపుణుడు మిస్ట్రాల్ AIలో చేరారు.

సాధించిన పురస్కారాలు
దేవేంద్ర చాప్లోట్ తన పరిశోధనలకు అనేక పురస్కారాలు అందుకున్నారు. 2020లో ఫేస్‌బుక్ ఫెలోషిప్ పొందారు. అలాగే కంప్యూటర్ విజన్ రంగంలో నిర్వహించే సీవీపీఆర్ AI హాబిటాట్ ఆబ్జెక్ట్ నావిగేషన్ ఛాలెంజ్ & 2018లో CVPR 2018 డీప్ లెర్నింగ్ ఫర్ విజువల్ SLAM వర్క్‌షాప్‌లో బెస్ట్ పేపర్ అవార్డుతో సహా అనేక అవార్డులను గెలుచుకున్నారు.

#

Tags : 1

Videos

పెద్ద తలకాయలు ఎంట్రీ.. పుట్టా మహేష్ కు నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు

రైతుకు CI బెదిరింపులు.. ఎక్కడా భయపడని రైతన్న.. ఆడియో కాల్ లీక్

డ్రాగన్ పై దురంధర్ ఎఫెక్ట్..!

ఇంత నోరేసుకొని అరవడం కాదు.. అనితను ఏకిపారేసిన రాచమల్లు

పుట్టా మహేష్ డ్రగ్స్ కేసు.. తండ్రి కొడుకులకి ఇచ్చిపడేసిన కన్నబాబు

నువ్వు ఎంపీనా? డ్రగ్స్ డీలరా? టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ పై విజయ్ రాజు ఫైర్

ఇజ్రాయెల్ పై మరోసారి దాడి.. నేలకూలిన భారీ భవనాలు

నెల్లూరు జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న జనసేన నేతలు

మద్ది శ్రీనివాస్ రాసలీలలు.. భార్య సంచలన నిజాలు

డ్రగ్స్ కేసు నుండి తప్పించేందుకు రంగంలోకి పెద్ద తలకాయలు

Photos

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)

+5

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు (ఫోటోలు)

+5

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్‌ పోస్ట్‌ (ఫొటోలు)

+5

అల్లు సినిమాస్‌ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)

+5

కూకట్‌పల్లిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)

+5

ఖమ్మంలో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)

+5

‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌, బన్నీ (ఫోటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్‌- సానియా సంగీత్‌.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)