Breaking News

సినిమా ఇన్‌సెక్ట్స్‌ అసోసియేషన్‌ అంటే సీఐఏ గురించి తెలుసా?

Published on Sat, 03/14/2026 - 13:34

సినిమా అసోసియేషన్‌ ఫర్‌  చిన్న చిన్న పురుగులూ...జిందాబాద్‌! : సంగతేమిటంటే... చీమలూ, బొద్దింకలూ, బల్లులూ... ఆఖరికి దోమల వంటి చిన్న చిన్న కీటకాలన్నీ కలిసి ‘‘సినిమా అసోసియేషన్‌ ఫర్‌ చిన్నచిన్న పురుగులు’’ సంఘం (సినిమా ఇన్‌సెక్ట్స్‌ అసోసియేషన్‌ అంటే సీఐఏ) పెట్టుకున్నాయి. ఆ సంఘ ప్రారంభ సమావేశం సందర్భంగా... ప్రెస్‌ మీట్‌లో పత్రికల, టీవీ ఛానెళ్ల రిపోర్టర్లు అడుగుతున్న పలు ప్రశ్నలకు సమాధానాలిస్తున్నాయి. అవి ఇవి...  

రిపోర్టర్‌ : ఈ సంఘం ప్రెసిడెంటుగా ఎన్నికైనందుకు కంగ్రాచ్యులేషన్స్‌ దోమగారూ... అయినా మీ కీటకాలన్నీ ఎందుకండీ ఈ ‘చిన్న పురుగుల’ అసోసియేషన్‌ పెట్టాయి? 

అసోషియేషన్‌ ప్రసిడెంట్‌ దోమ (స్పీచ్‌ ఇస్తున్న ధోరణిలో) : ఇప్పుడూ... పున్నమినాగు ఫార్మూలాతో బోల్డన్ని సూపర్‌హిట్టుపాముల మూవీస్‌ వచ్చేశాయి. కొండవీటి ‘సింహాలూ’, ‘చిరుత’ల్లాంటి పేర్ల మీద బంపర్‌హిట్లూ ఉన్నాయి. ఇక అడవిరాముడూ, వేటగాడులాంటి బ్లాక్‌బస్టర్‌లలో ఏనుగులూ, సింహాలూ, పులులూ, ఎలుగుబంట్లూ ఎట్సెట్రాలు తెగ యాక్టింగు చేసేశాయి. ముత్యాలముగ్గు సినిమాలో కోతి, ఆఖరికి  పొట్టేలు పున్నమ్మల్లో  పొట్టేలు సైతం తెగ పెర్‌ఫార్మెన్సు చూపించేశాయి. మరి ఇంకా చెప్పాలంటే... ‘అద్దమంటి మనసు ఉందీ... అందమైనా వయసు ఉందీ’ పాటలో మా ప్రియతమ సోదరీమణి అయిన బర్రెగారు సాక్షాత్తూ పెద్ద ఎన్టీఆర్‌ను తన వీపు మీద కూర్చోబెట్టుకుని యాక్షనింగు కుమ్మేసింది. వాళ్లంటే పెద్ద పెద్ద జీవులు. అవన్నీ పెద్ద జీవుల అసోసియేషన్‌ పెట్టుకున్నాయి. మరి... ఈ నేపథ్యంలో మాకూ ఓ సంఘం ఉండొద్దా మరి? 

రిపోర్టర్‌ : అవంటే పెద్ద జీవులూ... పెద్ద హీరోలకు దీటుగా వాటి పేర్ల మీదే డైరెక్టుగా మూవీలొచ్చేశాయి. సినిమాల విజయంలో మరి మీ చిన్న పురుగుల పాత్ర ఏమిటి? 

చీమ (గొంతు సవరించుకుంటూ గొట్టం ముందుకు వస్తూ) : ‘సింహాద్రి’ సినిమా చూశారా సార్‌? హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడానికి మా చీమనే యూజ్‌ చేసుకున్నారు. మాకు ఇంపార్టెన్స్‌ ఇస్తూ ఏకంగా ఓ లవ్‌సాంగ్‌ రాయాల్సి వచ్చిందీ... తీయాల్సి వచ్చింది...

చీమ చీమ చిమ చీమా చీమా 
చీమ చీమ చిమ చీమ చీ...ఈ...ఈ...మా... 
చీమ తీపి చిరునామా ప్రేమా... తెలుసుకోవె భామా... అంటూ సదరు డ్యూయెట్టులో హీరోహీరోయిన్లు చీమ చుట్టూ చిందులు తొక్కితేగానీ మూవీ హిట్టవ్వలేదు మరి! 

రిపోర్టర్‌ : సినిమాలకు మీరెలా కంట్రిబ్యూట్‌ చేస్తున్నారు బొద్దింకగారూ, బల్లిగారూ?
బొద్దింక : హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ పుట్టడానికి ఈ సినిమా రంగానికి ఇతోధికంగా మేము చేసుకుంటున్న పవిత్రమైన సేవలు ఇన్నని చెప్పడానికి లేదండీ. చాలా మూవీస్‌లో మమ్మల్ని చూసి... ‘‘అమ్మో బొద్దింక...’’ అంటూ అరుస్తూ హీరోయిన్‌... హీరో ఒళ్లోకి దూకుతుంది. అంతే... లవ్వూ... డ్యూయెట్టూ!! (అంటూ గర్వంగా తన పొడవాటి కాక్రోచు మీసాల్ని దువ్వుకుంది).  అంతేకాదండి... మేమిలా నటించినా హిట్టే... మమ్మల్ని చంపాలన్నా ‘హిట్టే’! (కప్‌బోర్డులోని హిట్‌ మందును సీసా కేసి చూపిస్తూ అన్నది).

బల్లి : మేము కూడా ఏమీ తక్కువ కాదండి. బొద్దింకల్లాగే మమ్మల్ని చూసి హీరో మీదకు గెంతే హీరోయిన్లకు కొదవలేదండీ. ఇప్పుడంటే పెద్దగా లేదుగానీ...  పాత సినిమాటాకీసుల్లో వెండితెర మీద మా బంగారు పాదాలు మోపుతూ... హీరో హీరోయిన్ల ముఖాలమీదా, ఒంటిమీదా పాకుతూ తెగ తిరిగేవాళ్లం. తెరమీద ఒక్కోసారి స్ప్రింటూ, మరోసారి మారథానూ ఇంకోసారి ఫోర్‌,ఫోర్‌ మీటర్సు రిలేలాంటి రన్నింగు రేసులూ చేసేవాళ్లం. ఇక ‘ఒక రాధా ఇద్దరు కృష్ణులు’ లాంటి సినిమాలో పరకాయ ప్రవేశం చేసే హీరోయిన్‌ గారు తన బాత్‌రూమ్‌లో పాకుతున్న బల్లిని చూసి... పరకాయ ప్రవేశం చేసిన హీరోయేమో అనుకుంటుంది. బల్లిని చూసి హీరో అనుకుందంటే... దీన్ని బట్టి తెలియడం లేదూ మేం ‘హీరో మెటీరియల్‌’ అనీ! 

చ‌ద‌వండి: కూర‌గాయ హీరోల 'పోకిరి' కిరి

రిపోర్టర్‌ : (కొద్దిగా వ్యంగ్యం ధ్వనిస్తూ...) అన్నట్టూ దోమగారూ!! మలేరియాలూ, డెంగీలు తీసుకొచ్చే మీరు ఈ అసోసియేషన్‌కు ప్రెసిడెంట్‌ ఎలా అయ్యారు సార్‌?  

దోమ : (కోపంగా...) హేం మాహాడుతున్నారు మీరు? రోబో సినిమాలో హీరోయిన్‌ ఐశ్వర్యారాయ్‌ అండ్‌ రోబో చిట్టీల మధ్య ప్రేమకు కారణం మేమే. ‘రోబోకు ఐశ్వర్యారాయ్‌ పెట్టే ‘ప్రేమ పరీక్ష’ ఏమిటో తెల్సా మీకు? తనను కుట్టిన దోమను పట్టుకొచ్చి దాంతో సారీ చెప్పించమనే కదా! మొత్తం ప్రపంచ సినిమా చరిత్రలో ఇంతవరకూ మిస్‌ వరల్డు ఐశ్వర్యారాయ్‌ను కుట్టిన జీవేదైనా ఉందా... ఒక్క దోమ తప్ప? మరి ఈ నేపథ్యంలో చూస్తే... ఈ చిన్న పురుగుల సంఘానికి నేను తప్ప ప్రెసిడెంట్‌గా ఉండటానికి అర్హులెవరైనా ఉన్నాయా సార్‌? ...అంటూ అరుస్తూ ‘‘చిన్న పురుగుల సంఘం పట్ల మీ  కానొర్టర్ల వివక్ష నశించాలీ... మా సీఐఏ అదే... సినిమా ఇన్‌సెక్ట్స్‌ అసోసియేషన్‌ వర్థిల్లాలి... చిన్న చిన్న సినీ పురుగులూ జిందాబాద్‌’’ అని నినాదాలిస్తూ కోపంగా ప్రెస్‌మీట్‌ నుంచి వాకౌట్‌ చేసింది దోమ. దాంతోపా టే మిగతా ఇన్‌సెక్ట్స్‌ కూడా!


– యాసీన్‌

Videos

పెద్ద తలకాయలు ఎంట్రీ.. పుట్టా మహేష్ కు నోటీసులు ఇచ్చి వదిలేసిన పోలీసులు

రైతుకు CI బెదిరింపులు.. ఎక్కడా భయపడని రైతన్న.. ఆడియో కాల్ లీక్

డ్రాగన్ పై దురంధర్ ఎఫెక్ట్..!

ఇంత నోరేసుకొని అరవడం కాదు.. అనితను ఏకిపారేసిన రాచమల్లు

పుట్టా మహేష్ డ్రగ్స్ కేసు.. తండ్రి కొడుకులకి ఇచ్చిపడేసిన కన్నబాబు

నువ్వు ఎంపీనా? డ్రగ్స్ డీలరా? టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ పై విజయ్ రాజు ఫైర్

ఇజ్రాయెల్ పై మరోసారి దాడి.. నేలకూలిన భారీ భవనాలు

నెల్లూరు జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న జనసేన నేతలు

మద్ది శ్రీనివాస్ రాసలీలలు.. భార్య సంచలన నిజాలు

డ్రగ్స్ కేసు నుండి తప్పించేందుకు రంగంలోకి పెద్ద తలకాయలు

Photos

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)

+5

కుల్దీప్‌ యాదవ్‌ పెళ్లి వేడుక సందడి (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో టాలీవుడ్ యాంకర్ రష్మీ గౌతమ్ అందాలు (ఫోటోలు)

+5

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా లేటెస్ట్‌ పోస్ట్‌ (ఫొటోలు)

+5

అల్లు సినిమాస్‌ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)

+5

కూకట్‌పల్లిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)

+5

ఖమ్మంలో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)

+5

‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌, బన్నీ (ఫోటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్‌- సానియా సంగీత్‌.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)