Breaking News

మెగాఫోన్‌ పట్టబోతున్న శేఖర్‌ మాస్టర్‌.. హీరో ఎవరంటే..?

Published on Sat, 03/14/2026 - 11:01

డ్యాన్స్‌ కొరియోగ్రాఫర్లు సినీ దర్శకులుగా మారడం కొత్తేమి కాదు. ప్రభుదేవా, రాఘవా లారెన్స్‌తో పాటు చాలా మంది కొరియోగ్రాఫర్లు మెగా ఫోన్‌ పట్టారు. ఇప్పుడు ఆ జాబితాలోకి ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ చేరబోతున్నాడు. త్వరలోనే ఆయన దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కబోతుంది.

భారీ రెమ్యునరేషన్‌..
టాలీవుడ్‌లో నెంబర్‌ వన్‌ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌. చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్‌ నటుటలతో  పాటు ప్రభాస్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ లాంటి స్టార్‌ హీరోల వరకు అందరికి ఆయన కొరియోగ్రఫీ చేశాడు. హుక్‌ స్టెప్పుల స్పెషలిస్ట్‌గానూ పేరుపొందాడు. ఆయన కొరియోగ్రఫీ అందించిన చాలా పాటలు నెట్టింట వైరల్‌గా మారాయి. దక్షిణాదితలో అత్యధిక పారితోషికం తీసుకునే డ్యాన్స్‌ మాస్టర్‌ ఈయనే. ఒకవైపు సినిమాలకు డ్యాన్స్‌ కొరియోగ్రఫీ అందిస్తూనే..మరోవైపు పలు రియాల్టీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు.  ఇలా కెరీర్‌ పరంగా ఫుల్‌ బిజీగా ఉన్నా..తనలోని మరో యాంగిల్‌ని ప్రేక్షకులకు చూపించబోతున్నాడు. ఎప్పటికైనా మెగా ఫోన్‌ పట్టాలనేది శేఖర్‌ కోరిక. ఈమేరకు కథలను కూడా సిద్ధం చేసుకున్నాడు. ఓ పాన్‌ ఇండియా మూవీతో  దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.

హీరో ఎవరంటే.. 
తొలి సినిమాను చాలా గ్రాండ్‌గా ప్లాన్‌ చేశాడట శేఖర్‌. ఈ మూవీతో ప్రముఖ కొరియోగ్రాఫర్‌ ప్రభుదేవా కుమారుడు  రిషిల్ రాఘ‌వేంద్ర దేవా హీరోగా మారబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శేఖర్‌ తన కథను ప్రభుదేవాకు చెప్పాడట.  ‘ప్రేమికుడు’ త‌ర‌హాలో మ్యూజిక్‌, డాన్స్ మిక్స్ చేసిన లవ్‌స్టోరి కాన్సెప్ట్‌తో ప్రభుదేవాను కలిశాడట. తొలి సిట్టింగ్‌లోనే కథ నచ్చేసి.. తన కుమారుడి ఎంట్రీకి ఇదే సరైన సినిమా అని ప్రభుదేవా చెప్పేశాడట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అన్ని సెట్‌ అయితే.. మే నెల నుంచే షూటింగ్‌ ప్రారంభం కానుందట. మరి శేఖర్‌ మాస్టర్‌ కొత్త జర్నీ ఎలా ఉంటుందో చూడాలి. 
 

Videos

జూలో ఫుడ్ పెట్టిన చిన్నారిపై సింహం దాడి..

పేర్ని నాని ఇంటి వద్ద హైటెన్షన్

బాగ్దాద్ పై బాంబుల వర్షం.. US ఎంబసీపై దాడులు

ఇరాన్ యుద్ధం.. బ్యాంకులో నుంచి మీ డబ్బు డ్రా చేసుకోండి...

అనసూయపై అసభ్యకర పోస్టులు.. ఇద్దరు అరెస్ట్

విజయ్ తో వివాదాలు.. రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ..!

500 కోట్ల మోసం! పోలవరం పనుల్లో అక్రమాలు CBI SP సంచలన లేఖ

అమెరికాకు వార్నింగ్ ఇస్తూ.. ఇరాన్ సంచలన వీడియో విడుదల

భరితెగించి నోడిని టీటీడీ చైర్మన్ చేయడం కరెక్టేనా..?

10 ఎగ్జామ్స్ షురూ.. పరీక్ష కేంద్రాల వద్ద టెన్షన్ టెన్షన్

Photos

+5

అల్లు సినిమాస్‌ ప్రత్యేకతలివే.. (ఫోటోలు)

+5

కూకట్‌పల్లిలో సినీ నటి మీనాక్షి చౌదరి సందడి (ఫొటోలు)

+5

ఖమ్మంలో సందడి చేసిన హీరోయిన్ శ్రీలీల (ఫొటోలు)

+5

‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌, బన్నీ (ఫోటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్‌- సానియా సంగీత్‌.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : పరీక్షలకు టాటా.. ఇక ఇంటి బాట (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఓ షాపింగ్‌ మాల్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌ కార్యకలాపాలు (ఫోటోలు)

+5

వాళ్లిద్దరి వల్లే ట్రిప్‌ ఎంతో స్పెషల్‌: మెహరీన్‌ (ఫోటోలు)

+5

తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకల్లో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)