Breaking News

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్

Published on Fri, 03/13/2026 - 19:57

వాట్సాప్ చిన్న పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని.. ఒక కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇది ముఖ్యంగా 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం రూపొందించిన 'పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్'. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

గతంలో వాట్సాప్‌ను పిల్లలు కూడా పెద్దవాళ్ల మాదిరిగానే ఉపయోగించేవారు. అప్పుడు తల్లిదండ్రులకు వారి చాట్స్ లేదా కాంటాక్ట్స్‌పై ఎక్కువ నియంత్రణ ఉండేది కాదు. ఇప్పుడు వచ్చిన పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్ ద్వారా తల్లిదండ్రులు నేరుగా పిల్లల ఖాతాను పర్యవేక్షించవచ్చు. ఎవరు పిల్లలకు మెసేజ్ చేయాలి, ఏ గ్రూపుల్లో చేరాలి, ప్రైవసీ సెట్టింగ్స్ ఎలా ఉండాలి వంటి విషయాలను తల్లిదండ్రులు నిర్ణయించవచ్చు.

పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్ సెటప్
● ముందుగా పిల్లల ఫోన్‌లో వాట్సాప్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాలి. 
● తరువాత యాప్‌ను ఓపెన్ చేసి భాషను ఎంచుకుని అగ్రీ అండ్ కంటిన్యూ అనే ఎంపికపై క్లిక్ చేయాలి.
● తరువాత మోర్ ఆప్షన్స్‌లోకి వెళ్లి.. క్రియేట్ పేరెంట్ మేనెజ్డ్ అకౌంట్ అనే ఎంపికను ఎంచుకోవాలి
● పిల్లల ఫోన్ నంబర్‌ను నమోదు చేసి వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి.
● తరువాత పిల్లల పుట్టిన తేదీ నమోదు చేయాలి. దీని ద్వారానే వారి వయస్సు 13 సంవత్సరాల కంటే తక్కువ అని వాట్సాప్ నిర్ధారిస్తుంది.
● ఇవన్నీ పూర్తయిన తరువాత.. పిల్లల ఖాతాను తల్లిదండ్రుల ఖాతాతో లింక్ చేయడానికి కంటిన్యూపై క్లిక్ చేయాలి.

పిల్లల ఖాతాతో ఎలా లింక్ చేయాలి
పిల్లల ఫోన్ స్క్రీన్‌పై ఒక QR కోడ్ కనిపిస్తుంది. తల్లిదండ్రుల ఫోన్‌తో ఆ కోడ్‌ను స్కాన్ చేయాలి. ఆ తరువాత వాట్సాప్ తల్లిదండ్రుల పర్యవేక్షణను నిర్ధారించడానికి అగ్రీ అండ్ కంటిన్యూ అనే ఎంపికను చూపిస్తుంది. తరువాత తల్లిదండ్రులు ఒక 6 అంకెల పేరెంట్ పిన్ సెట్ చేసుకోవాలిసెట్ చేయాలి. ఈ పిన్ ద్వారా మాత్రమే పిల్లల ఖాతాకు సంబంధించిన ప్రైవసీ &  సేఫ్టీ సెట్టింగ్స్‌ను మార్చగలుగుతారు. ఈ పిన్ నెంబరును పిల్లలతో షేర్ చేసుకోకూడదు.

#

Tags : 1

Videos

ఆంధ్ర ప్రజలను తాకట్టు పెట్టి మరి ... బాబు అప్పుల చిట్టా ఆధారాలతో చూపించిన పేర్ని నాని

లీటర్ పెట్రోల్ Rs.115 ఖాళీ ఖాళీగా పెట్రోల్ బంకులు

బాబు సంపద పెంచేందుకు హెరిటేజ్ కి భారీ రాయితీలు

ఇక సిలిండర్లతో పరేషాన్ వద్దు... 5 బెస్ట్ ఇండక్షన్ స్టౌవ్ లు

థాంక్యూ రేవంతన్న.... బన్నీ ఎమోషనల్

గ్యాస్ కొరతపై కేంద్రం కీలక ప్రకటన

ఏపీలో గ్యాస్ ఉందా, లేదా..? ఏది నిజం

పొరపాటున MGR గురించి అలా మాట్లాడా..! నన్ను క్షమించండి

Minister Sridhar Babu: గ్యాస్ కొరత లేకుండా చూడండి

పవన్ ముందు బాబుకు అవమానం పిఠాపురం వర్మ ఆగ్రహం

Photos

+5

‘అల్లు సినిమాస్’ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌, బన్నీ (ఫోటోలు)

+5

అర్జున్‌ టెండుల్కర్‌- సానియా సంగీత్‌.. బుట్టబొమ్మలా సారా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : పరీక్షలకు టాటా.. ఇక ఇంటి బాట (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఓ షాపింగ్‌ మాల్‌లో సందడి చేసిన సినీనటి సమంత (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌ కార్యకలాపాలు (ఫోటోలు)

+5

వాళ్లిద్దరి వల్లే ట్రిప్‌ ఎంతో స్పెషల్‌: మెహరీన్‌ (ఫోటోలు)

+5

తాడేపల్లి : వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకల్లో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య ‘వృషకర్మ’ మూవీ HD వర్కింగ్ స్టిల్స్

+5

అడివి శేష్‌ 'డెకాయిట్‌' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో పశ్చిమాసియా యుద్ధ ప్రభావం..మూతపడుతున్న హోటళ్లు (ఫొటోలు)