పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో గ్యాస్ మంటలు
Breaking News
నాలుగేళ్లలో రూ. 3.5 లక్షల నుంచి రూ. 65 లక్షల రేంజ్..!
Published on Fri, 03/13/2026 - 12:00
ఉద్యోగ కెరీర్లో అంచలంచెలుగా ఎదుగుతూ..అత్యున్నతి స్థాయికి చేరుకోవాలనే ఎవరైన కోరుకుంటారు. అందుకోసం చాలా కష్టపడుతుంటారు కూడా. కానీ కొందరు మాత్రమే చాలా తక్కువ సమయంలోనే అత్యధిక జీతం అందుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. అలాంటి కోవకు చెందినవాడే ఈ టెకీ. తన కెరీర్ సక్సెస్‌ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కేవలం నాలుగేళ్లలో ఏడాకి రూ. 3.5 లక్షలు అందుకునే స్థాయి నుంచి ఏకంగా ఏడాదికి రూ. 65 లక్షలు అందుకునే రేంజ్‌కి వెళ్లిపోయాడు. అప్పుల భారంతో సతమతమవుతున్న అతడి మధ్యతరగతి కుటుంబానికి అతి పెద్ద ఊరట తోపాటు సంతోషాలు వెల్లివెరిశాయి. 2021లో క్యాంపస్ ఇంటర్వ్యూలో తక్కువ ప్యాకేజీతో నియమాకం అందుకున్నట్లు టెకీ తెలిపారు.
అప్పుడు తన జీతం కేవలం రూ. 26 వేలు అని. అయితే ఆ టైంలో జాబ్‌లో ఉన్నత స్థానానికి చేరుకోవాలన్న లక్షం, కష్టబడేతత్వం పెద్దగా ఏమి లేవని, హాయిగా సినిమాలు చూస్తూ, ఎంజాయ్ చేస్తూ జాబ్ చేసేవాడినని అన్నారు. అయితే ఇంట్లో అప్పులభారం పెరిగిపోవడం, అందుకున్న జీతం ఏమాత్రం సరిపోకపోవడంతో..అప్పుడు వాస్తవికంగా నాలాంటి సాఫ్ట్వేర్ అందుకనే జీతం ఇది కాదని గ్రహించానంటున్నాడు. అప్పటి నుంచి మరింత కష్టపడటం మొదలుపెట్టా. అందులోనూ లాజికల్ మ్యాథ్స్‌లో ఉన్న పట్టుతో..లక్షల వేతనం అందుకునే టెకీల మాదిరి ఉద్యోగాలు అందుకునే వేటలో ఉన్నాను.
అప్పుడు నా లక్ష్యం అప్పులు క్లియర్ చేసేలా మంచి ఉద్యోగం పొందడం. ఆ క్రమంలో 2023లో 45 శాతం జీతం పెంపు, 2024లో 28 శాంతం పెంపు కూడా అందుకోగలిగా. సరిగ్గా ఆ టైంలో ఇంజనీర్‌గా రూ. 19 లక్షలు వార్షిక జీతంతో కొత్త కంపెనీలో చేరా. విహారయాత్రాలు, ఎంజాయ్మెంట్ వంటి వాటితో సంబంధం లేకుండా చాలా కష్టపడ్డ..అయితే ఆ క్రమంలో కొన్ని ఇంటర్వ్యూలను చాలా త్రుటిపాయంలో పోగొట్టుకున్నట్లు తెలిపాడు.
చివరికి తన కష్టం ఫలించి సర్వీస్‌నౌ, పేపాల్, సిస్కో వంటి అత్యున్న కంపెనీల ఆఫర్లు అందుకోగలిగా. చివరికి తాను అనుకున్నట్లుగానే ఒక అగ్రశ్రేణి ఉత్పత్తి సంస్థ నుంచి రూ. 65 లక్షల ఆఫర్ అందుకున్నా. తనను అందురు కార్పొరేట్ బానిసగా భావించి ఉండొచ్చు..కానీ తన తల్లిదండ్రులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
అలాగే ఎన్నటికీ ఊహించని గొప్ప వస్తువులను సైతం కొనుగోలు చేయగలను అని ఆనందంగా చెబుతూ పోస్ట్‌ని ముగించాడు. నెటిజన్లు సైతం సదరు టెక్నీషియన్ సక్సెస్ జర్నీ చాలా స్పూర్తిదాయకమైన విజయవంతంగా కెరీర్‌ని నిర్మిచుకోవడం ఎలా అనేందుకు గొప్ప స్ఫూర్తి అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: సహానుభూతి పవర్..! ఎలా బిల్డ్ చేయాలంటే..)
Tags : 1