భార్య వేధింపులకు మరో భర్త బలి
Breaking News
పెరగనున్న ఆడి కార్ల ధరలు: ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి
Published on Thu, 03/12/2026 - 14:41
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి.. భారతదేశంలో తన ఉత్పత్తుల ధరలను 2 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. ఇన్పుట్ ఖర్చులు పెరగడం, కరెన్సీ హెచ్చుతగ్గుల కారణంగా 2026 ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ఏ మోడల్ ధర ఎంత అనేది త్వరలోనే తెలుస్తుంది.
ధరల అప్డేట్ గురించి ఆడి ఇండియా బ్రాండ్ డైరెక్టర్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ మాట్లాడుతూ.. ధరల పెరుగుదల ప్రభావాన్ని మా కస్టమర్లపై తగ్గించడానికి మేము కట్టుబడి ఉన్నాము" అని అన్నారు. ధరల పెరుగుదల భారతదేశంలో ఆడి యొక్క పూర్తి లైనప్‌ను ప్రభావితం చేస్తుంది, ఇందులో ఆడి A4, A5, A6, Q3, Q3 స్పోర్ట్‌బ్యాక్, Q5, Q7, Q8 & RSQ8 పెర్ఫార్మెన్స్ వంటి మోడళ్లు ఉన్నాయి.
2026 జనవరి నెలలో దేశీయ వాహన తయారీ సంస్థలు మాత్రమే కాకుండా.. బిఎండబ్ల్యు, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలు కూడా తమ ఉత్పత్తుల ధరలను పెంచినట్లు అధికారికంగా వెల్లడించాయి. ఇప్పుడు అదే బాటలో ఆడి ఇండియా కూడా అడుగులు వేసింది.
ఇదీ చదవండి: ఏడు నిమిషాల్లో అమ్ముడైపోయిన మహీంద్రా కారు
Tags : 1