Breaking News

‘భారతీయ బ్యాంకింగ్‌పై నమ్మకం’లో కొత్త కోణాలు

Published on Sat, 03/07/2026 - 13:01

చిరకాలంగా బ్యాంకింగ్ రంగంలో నమ్మకమనేది కీలకాంశంగా ఉంటోంది. అయితే ఆ నమ్మకం కలిగే ప్రక్రియ ఇప్పుడు మారుతోంది. నేటి కస్టమర్ల దగ్గర మరింత సమాచారం ఉంటోంది. వారు మరింతగా కనెక్ట్ అయి ఉంటున్నారు. తమకు అందుబాటులో ఉన్న ఆప్షన్ల గురించి కూడా అవగాహన పెరిగింది. కాబట్టి, ఇప్పుడు వారు బ్యాంకుల నుంచి కేవలం ఆర్థిక తోడ్పాటును మాత్రమే కాకుండా, విశ్వసనీయత, జవాబుదారీతనం, నిలకడైన నిరంతర సేవలను కూడా ఆశిస్తున్నారు.

ఆర్థిక రంగ సంస్కరణల తర్వాతి కాలంలో బ్యాంకింగ్ రంగం ప్రధానంగా బ్యాంకింగ్ సేవలను ఎక్కువ మందికి చేరవేయడంపై దృష్టి పెట్టింది. మరింత మంది ప్రజలను అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి తీసుకురావడమనేది ఆర్థిక, సామాజిక పరంగా ప్రధాన లక్ష్యంగా నిలిచింది. ఈ దిశగా గణనీయమైన పురోగతి కూడా సాధించబడింది. ఇప్పుడు బ్యాంకింగ్ సేవలు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో, కస్టమర్లు మరో ముఖ్య అంశాన్ని కోరుకుంటున్నారు. అదేమిటంటే, మారుతున్న పరిస్థితుల్లో కూడా తమ బ్యాంక్ ఆధారపడే విధంగానే ఉంటుందని, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందనే ఓ నమ్మకాన్ని వారు కోరుకుంటున్నారు.

విశ్వాసానికి మారుతున్న పునాదులు
కొన్ని సంవత్సరాల క్రితం వరకు బ్యాంకులపై విశ్వాసం ప్రధానంగా భౌతిక ఉనికితో అనుసంధానమై ఉండేది. దగ్గరలో ఉన్న బ్రాంచ్, చిరపరిచితమైన సిబ్బంది, స్థిరమైన ప్రక్రియలు కస్టమర్లకు భరోసా కలిగించేవి. స్థిరత్వమే విశ్వాసానికి ఆధారంగా ఉండేది.

టెక్నాలజీ అభివృద్ధితో బ్యాంకింగ్ రంగం మారిన తర్వాత సౌలభ్యమనేది కూడా కస్టమర్ల ప్రాధాన్యతల్లో కీలకంగా మారింది. వేగవంతమైన లావాదేవీలు, సులభమైన ప్రక్రియలు రోజువారీ బ్యాంకింగ్‌ను సులభతరం చేశాయి. అయితే కాలక్రమేణా ఇవి ప్రత్యేతలుగా కాకుండా సర్వసాధారణంగా ఆశించే సేవలుగా మారిపోయాయి.

ఇప్పుడు కస్టమర్లు బ్యాంకింగ్ సేవలనేవి ఎప్పుడు కావాలంటే అప్పుడు సాధారణంగా అందుబాటులోనే ఉంటాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి దృష్టి ఇప్పుడు విశ్వసనీయ వ్యవస్థలవైపు మళ్లింది. బ్యాంకింగ్ సిస్టమ్‌లు సజావుగా పనిచేయాలి. కస్టమర్ సమాచారం భద్రంగా ఉండాలి. సంస్థలు కార్యకలాపాల్లో క్రమశిక్షణ పాటించాలని కోరుకుంటున్నారు.

దీనితో భద్రత అనే భావన పరిధి కూడా పెరిగింది. బ్యాంక్ ఆర్థికంగా పటిష్టంగా ఉండటం ముఖ్యమే. అదే సమయంలో మోసాల నివారణ, వ్యక్తిగత డేటా రక్షణ, సమస్యలు తలెత్తినప్పుడు వేగంగా స్పందించడంలాంటి బ్యాంకింగ్ సామర్థ్యాలపై కూడా కస్టమర్లు దృష్టి పెడుతున్నారు.

రుణ లభ్యత పెరగడం కూడా కస్టమర్ల అంచనాలను ప్రభావితం చేసింది. రుణాల మంజూరులో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం, వడ్డీ మరియు ఛార్జీల్లో పారదర్శకత ఉండటం, రిస్క్‌ను సమగ్రంగా అంచనా వేయడం వంటి అంశాల విషయంలో బ్యాంకుల నుంచి కస్టమర్లు భరోసాను కోరుకుంటున్నారు. బ్యాంకులు వ్యాపార వృద్ధిపై మాత్రమే దృష్టి పెట్టడం కాకుండా తాము సేవలందించే కస్టమర్ల దీర్ఘకాలిక ఆర్థిక ఆరోగ్యానికి కూడా మద్దతుగా నిలిచేలా ఉండాలని ఈ అంశాలు సూచిస్తాయి.

ఇలాంటి పరిస్థితుల్లో విశ్వసనీయత, వివేచన, స్థిరత్వాన్ని బట్టి నమ్మకం నిలిచి ఉంటుంది.

డిజిటల్ పురోగతి - కస్టమర్ అవగాహన
భారత్‌లో డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి రోజువారీ బ్యాంకింగ్ విధానాన్ని పూర్తిగా మార్చేసింది. ఇప్పుడు కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే చెల్లింపులు పూర్తి చేయవచ్చు. ఎక్కడో దూరంగా ఉండి కూడా ఖాతాలు తెరవొచ్చు. రుణాలపై నిర్ణయాలు కూడా గతంతో పోలిస్తే చాలా వేగంగా తెలియజేయవచ్చు. ఇలాంటి పురోగతి వల్ల వ్యక్తులు, వ్యాపారాలకు ఆర్థిక అంశాల నిర్వహణ మరింత సులభమైంది.

అయితే ఈ అభివృద్ధితో పాటు కస్టమర్లలో సైబర్ భద్రత అంశాలపై కూడా అప్రమత్తత పెరుగుతోంది. మోసాలు, డేటా లీక్ ఘటనలు భద్రత చర్యల ఆవశ్యకతను గుర్తు చేస్తున్నాయి. కేవలం సౌలభ్యం మాత్రమే కస్టమర్లకు భరోసా కలిగించడం లేదు. భద్రత, సన్నద్ధత కూడా అంతే ముఖ్యమైనదిగా ఉంటోంది.

ఇప్పుడు బ్యాంకులు డిజిటల్ సేవలు అందించగలవా లేదా అనే విషయం గురించి కస్టమర్లు ప్రశ్నించడం లేదు. బ్యాంకులు రిస్క్‌లను ఎంత సమర్ధవంతంగా ముందుగానే గుర్తిస్తున్నాయి, సమస్యలు వచ్చినప్పుడు ఎలా స్పందిస్తున్నాయి అనే అంశాలను గమనిస్తున్నారు. అసాధారణ లావాదేవీలపై తక్షణ అలర్ట్‌లు, అవసరమైన సమయంలో సత్వర సహాయం, ఖాతాలను భద్రంగా ఉంచే స్పష్టమైన విధానాలు కస్టమర్ల విశ్వాసాన్ని నిలబెట్టడంలో కీలకంగా మారుతున్నాయి.

దీర్ఘకాలిక నమ్మకాన్ని పెంపొందించుకునే సంస్థలు టెక్నాలజీతో పాటు బాధ్యత కూడా పెరుగుతుందని గుర్తిస్తున్నాయి. అందువల్ల డిజిటల్ సామర్థ్యాల విస్తరణతో పాటు పర్యవేక్షణ వ్యవస్థలు, భద్రతా చర్యలు, స్పందనా విధానాలను పటిష్టం చేసుకోవడంపై కూడా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. డిజిటల్ యుగంలో నమ్మకమనేది అప్రమత్తత, పారదర్శకత, జవాబుదారీతనంపై ఆధారపడి ఉంటుంది.

ముందున్న దారి
గత దశాబ్దకాలంలో భారత బ్యాంకింగ్ రంగం స్థిరంగా విస్తరించింది. బ్యాంకింగ్ సేవల లభ్యత విస్తృతంగా పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు నిర్ణయాల నాణ్యతపై దృష్టి పెరుగుతోంది. ముఖ్యంగా కీలక సమయాల్లో బ్యాంకులు ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నాయనేది కస్టమర్లు నిశితంగా గమనిస్తున్నారు.

కొన్ని సందర్భాల్లో బాధ్యతాయుతమైన బ్యాంకింగ్ అంటే కొంత నిగ్రహం పాటించడం కూడా అవుతుంది. ఉదాహరణకు రుణం తిరిగి చెల్లించే సామర్థ్యం తక్కువగా ఉన్నట్లు అనిపిస్తే రుణాన్ని నిరాకరించడం, భారీ లావాదేవీల ముందు అదనపు ధృవీకరణ చేపట్టడం, లేదా నిర్దిష్ట ఆర్థిక ఉత్పత్తి అనేది కస్టమర్ పరిస్థితులకు ఎందుకు అనుకూలం కాదనే విషయాన్ని స్పష్టంగా వివరించడంలాంటి చర్యలు అవసరం కావచ్చు. ఇలాంటి నిర్ణయాలు తాత్కాలికంగా వ్యాపార విస్తరణ వేగాన్ని నెమ్మదింపచేసినా, అవి సంస్థల బాధ్యతాయుతమైన వైఖరికి నిదర్శనంగా నిలుస్తాయి. దీర్ఘకాలంలో కస్టమర్ల విశ్వాసాన్ని చూరగొనేందుకు తోడ్పడతాయి. సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా బ్యాంకు సమతుల్యతతో, స్థిరంగా వ్యవహరిస్తుందనే నమ్మకాన్ని పెంచుతుంది.

మొత్తంగా చూస్తే విశ్వాసమనేది మాటలతో కాదు, రోజువారీ తీసుకునే చర్యలతోనే ఏర్పడుతుంది. న్యాయబద్ధంగా ఉంటూ, క్రమశిక్షణ, బాధ్యతతో వ్యవహరించే బ్యాంకులు మాత్రమే ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోగలవు. అదే సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి కూడా అవి తోడ్పడతాయి.


- హితేంద్ర నాథ్ ఝా, 
హెడ్ - రిటైల్ లయబిలిటీస్, టీఏఎస్‌సీ & టీపీపీ, 
ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌

Videos

ఫైనల్ కి ముందే బయటపడిన టీమిండియా డొల్లతనం ఫైనల్లో ఈ ముగ్గురిని తప్పించకుంటే ఓటమి పక్కా..?

సూర్య VS సాంట్నర్..రికార్డ్స్ చూస్తే..టీమిండియాకు మళ్లీ నిరాశేనా..?

ఆ పేరు చెప్తేనే వణికిపోతున్న టీం ఇండియా

10th క్లాస్ స్టూడెంట్ చేసిన పని చూడండి

లొంగిపోయేందుకు బయల్దేరిన మావోయిస్టులు

ఖమేనీ బంకర్ ధ్వంసం చేశాం ఇక మిగిలింది..!

భీకర యుద్ధం వేళ ఇరాన్ అధ్యకుడికి పుతిన్ ఫోన్

విజయ్ కు బిగ్ షాక్ బయటకు వెళ్లకూడదంటూ పిటిషన్

ఎమ్మెల్యే - ఎమ్మెల్సీ క్రీడా ఉత్సవాలపై జడ శ్రవణ్ సెటైర్లు

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఆయిల్ కోలుకోలేని దెబ్బ కొట్టిన ఇరాన్

Photos

+5

తమిళనాడు డివోషనల్ ట్రిప్‌లో తెలుగు హీరోయిన్ (ఫొటోలు)

+5

ఒకప్పటి హీరోయిన్ మాలశ్రీ ఇంట్లో పెళ్లి సందడి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ (ఫొటోలు)

+5

రెండో శ్రీశైలంగా పిలిచే శివాలయం మన హైదరాబాద్‌లో ఎక్కడుందో తెలుసా? (ఫొటోలు)

+5

మేము సాధించాం.. పతకం వచ్చింది (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో గ్రాండ్‌గా అల్లు శిరీష్ పెళ్లి వేడుక (ఫొటోలు)

+5

ఒకప్పటి హీరోయిన్ సుమలత ఫ్యామిలీ ఫొటోలు

+5

జాన్వీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

నయనిక పెళ్లి కూతురి వేడుక.. అల్లు ఫ్యామిలీ సందడి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ హీరోయిన్లు (ఫొటోలు)