Breaking News

రిటైల్‌ ఫేమ్‌.. రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌!

Published on Sat, 03/07/2026 - 11:32

సాక్షి, సిటీబ్యూరో:  హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ ల్యాండ్‌స్కేప్‌ దాని సాంప్రదాయ కేంద్రాలకు మించి విస్తరిస్తోంది. కార్యాలయ స్థలాలు, నివాస, డేటా సెంటర్లు, పారిశ్రామిక లైఫ్‌ సైన్సెస్‌తో సహా వివిధ రంగాలు వృద్ధి కేంద్రాలుగా ఉద్భవిస్తున్నాయి. ఓ వైపు పశ్చిమ, మధ్య హైదరాబాద్‌లో బిజినెస్‌ హాట్‌స్పాట్‌లు నానాటికీ పెరుగుతున్నాయి. మరోవైపు రాబోయే 3–5 సంవత్సరాలలో తూర్పు, ఉత్తర, దక్షిణ ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందనున్నాయని, ఇవి గ్రేడ్‌–ఏ ఆఫీస్‌ స్టాక్‌లో 12–15 శాతం, వార్షిక ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌లో 5–10 శాతం వాటా అందుకుంటాయని కొలియర్స్‌ నివేదిక పేర్కొంది.  

స్టార్టప్స్‌లోనూ టాప్‌.. 
హైదరాబాద్‌ వర్ధమాన వ్యవస్థాపకులకు కూడా కీలకమైన నగరంగా మారింది. 2014లో కేవలం 200 స్టార్టప్‌లు మాత్రమే నగరంలో ఉండగా, ఆ సంఖ్య 7,500కు పెరిగింది. ఈ పెరుగుదల నగరంలో వ్యాపార స్థలాలకు డిమాండ్‌ను అనూహ్యంగా పెంచేస్తోంది. అమెరికాకు చెందిన స్టార్టప్‌ పరిశోధన సంస్థ స్టార్టప్‌ జీనోమ్‌ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, ఆసియాలోనే స్టార్టప్‌లకు ఉత్తమ నగరాల్లో హైదరాబాద్‌ 19వ స్థానంలో నిలవడం గమనార్హం.  

లీజింగ్‌.. కింగ్‌..  
రిటైల్, ఫ్యాషన్‌ వృద్ధికి దేశంలోని అగ్ర నగరాల్లో హైదరాబాద్‌ ఒకటిగా మారుతోంది. కుష్మాన్‌– వేక్‌ఫీల్డ్‌ తాజా రిటైల్‌ మార్కెట్‌ బీట్‌ రిపోర్ట్‌ ప్రకారం, 2025 మొదటి త్రైమాసికంలో 0.8 మిలియన్‌ చదరపు అడుగుల స్థలం రిటైల్‌ లీజింగ్‌ను సిటీ నమోదు చేసింది. 2024తో పోలిస్తే ఇది 106 శాతం పెరుగుదల కావడం విశేషం. మొత్తం జాతీయ రిటైల్‌ లీజింగ్‌లో 34 శాతంతో నగరాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపింది. దీనిలో ఎక్కువ భాగం జీవనశైలి ఉత్పత్తుల షాపింగ్‌కు సంబంధించినవి, హైటెక్‌ సిటీ, జూబ్లీహిల్స్, కొత్తపేట, కొంపల్లి వంటి కీలకమైన ప్రాంతాలలో కొలువుదీరుతున్నాయి.

Videos

ఎమ్మెల్యే - ఎమ్మెల్సీ క్రీడా ఉత్సవాలపై జడ శ్రవణ్ సెటైర్లు

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఆయిల్ కోలుకోలేని దెబ్బ కొట్టిన ఇరాన్

కొచ్చి పోర్ట్ లో ఇరాన్ యుద్ధనౌక...ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా దాడి జైశంకర్ రియాక్షన్

వెంకీ మూవీలో కీర్తి సురేష్..?

టిఫిన్ సెంటర్, క్యాంటీన్లపై గ్యాస్ ధరల ఎఫెక్ట్

పెళ్లి తర్వాత రౌడీ లైనప్ ఫుల్ చేంజ్..!

క్షమించండి.. కానీ అమెరికాను వదిలి పెట్టం ఇరాన్ సంచలన ప్రకటన

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారని బాబు అసత్య ఆరోపణలు

కాగ్ రిపోర్ట్ వివాదం పయ్యావులకు బొత్స కౌంటర్

జగన్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకే ఈ కుట్ర.. బాబు స్కామ్‌ల చరిత్ర..

Photos

+5

రెండో శ్రీశైలంగా పిలిచే శివాలయం మన హైదరాబాద్‌లో ఎక్కడుందో తెలుసా? (ఫొటోలు)

+5

మేము సాధించాం.. పతకం వచ్చింది (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో గ్రాండ్‌గా అల్లు శిరీష్ పెళ్లి వేడుక (ఫొటోలు)

+5

ఒకప్పటి హీరోయిన్ సుమలత ఫ్యామిలీ ఫొటోలు

+5

జాన్వీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

నయనిక పెళ్లి కూతురి వేడుక.. అల్లు ఫ్యామిలీ సందడి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ హీరోయిన్లు (ఫొటోలు)

+5

పెళ్లి వేడుకలో విజయ్‌, త్రిష సందడి.. ఫోటోలు వైరల్

+5

నిజామాబాద్‌లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య 'వృషకర్మ' గ్లింప్స్‌ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)