Breaking News

అమెరికాలో పెరిగిన నిరుద్యోగం

Published on Sat, 03/07/2026 - 09:23

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న అమెరికా జాబ్‌ మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలింది. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ (బీఎల్‌ఎస్‌) తాజాగా విడుదల చేసిన తాజా గణాంకాలు అంతర్జాతీయ మార్కెట్లను విస్మయానికి గురిచేశాయి. ఈ ఏడాది ఆరంభంలో బలంగా కనిపించిన యూఎస్‌ ఉపాధి రంగంలో ఫిబ్రవరి నెలలో అనూహ్యంగా 92,000 ఉద్యోగాల కోత నమోదైంది. ఈ పరిణామంతో అమెరికాలో నిరుద్యోగిత రేటు 4.4 శాతానికి పెరిగింది.

ఆరోగ్య రంగంపై సమ్మెల ప్రభావం

బ్లూమ్‌బెర్గ్ విశ్లేషణ ప్రకారం, ఇంత భారీగా పేరోల్స్ నమోదు కావాడానికి ప్రధాన కారణం ఆరోగ్య సంరక్షణ రంగంలో చోటుచేసుకున్న పరిణామాలే. ఆసుపత్రులు, వైద్య సేవల విభాగాల్లో కొనసాగుతున్న సమ్మె వల్ల ఉపాధి గణనీయంగా క్షీణించింది. జనవరిలో భారీ నియామకాలతో జోరు మీద ఉన్న అమెరికా కంపెనీలు ఫిబ్రవరిలో నియామకాలను ఒక్కసారిగా తగ్గించడం ఆశ్చర్యపరిచింది.

ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగానా?

నిరుద్యోగిత రేటు పెరగడం, నెగటివ్ పేరోల్ గణాంకాలు వెలువడటంతో ఫెడరల్ రిజర్వ్ తదుపరి నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది. వడ్డీ రేట్ల తగ్గింపుపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏడాది ఆరంభంలో ఉన్న ఉత్సాహం ఫిబ్రవరి నివేదికతో నీరుగారిపోయిందని కొందరు భావిస్తున్నారు.

ఆరోగ్య సంరక్షణ రంగంలో సమ్మె ఎందుకు?

వైద్య రంగంలోని కార్మికులు ప్రధానంగా ‘సేఫ్ స్టాఫింగ్’ (సరైన నిష్పత్తిలో సిబ్బంది ఉండటం) కోసం డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రుల్లో తగినంత మంది నర్సులు, ఇతర సిబ్బంది లేకపోవడం వల్ల ఒక్కో నర్సుపై రోగుల భారం పెరుగుతోంది. ఇది రోగుల భద్రతకు ముప్పు కలిగిస్తుందని, వైద్య సేవల్లో జాప్యం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా ప్రస్తుత వేతనాలు తమ జీవన వ్యయానికి సరిపోవడం లేదని నర్సులు, ఇతర హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్ వాదిస్తున్నారు.

  • కొన్ని సంస్థల్లో కార్మికులు వచ్చే నాలుగేళ్లలో దాదాపు 25% వేతన పెంపు కావాలని కోరుతున్నారు.

  • పెరుగుతున్న ఇంటి అద్దెలు, నిత్యావసర ధరల నేపథ్యంలో పాత వేతన ఒప్పందాలు సరిపోవని స్పష్టం చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్‌లో పనితీరుపై సమీక్ష

Videos

ఎమ్మెల్యే - ఎమ్మెల్సీ క్రీడా ఉత్సవాలపై జడ శ్రవణ్ సెటైర్లు

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఆయిల్ కోలుకోలేని దెబ్బ కొట్టిన ఇరాన్

కొచ్చి పోర్ట్ లో ఇరాన్ యుద్ధనౌక...ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా దాడి జైశంకర్ రియాక్షన్

వెంకీ మూవీలో కీర్తి సురేష్..?

టిఫిన్ సెంటర్, క్యాంటీన్లపై గ్యాస్ ధరల ఎఫెక్ట్

పెళ్లి తర్వాత రౌడీ లైనప్ ఫుల్ చేంజ్..!

క్షమించండి.. కానీ అమెరికాను వదిలి పెట్టం ఇరాన్ సంచలన ప్రకటన

శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారని బాబు అసత్య ఆరోపణలు

కాగ్ రిపోర్ట్ వివాదం పయ్యావులకు బొత్స కౌంటర్

జగన్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకే ఈ కుట్ర.. బాబు స్కామ్‌ల చరిత్ర..

Photos

+5

రెండో శ్రీశైలంగా పిలిచే శివాలయం మన హైదరాబాద్‌లో ఎక్కడుందో తెలుసా? (ఫొటోలు)

+5

మేము సాధించాం.. పతకం వచ్చింది (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో గ్రాండ్‌గా అల్లు శిరీష్ పెళ్లి వేడుక (ఫొటోలు)

+5

ఒకప్పటి హీరోయిన్ సుమలత ఫ్యామిలీ ఫొటోలు

+5

జాన్వీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

నయనిక పెళ్లి కూతురి వేడుక.. అల్లు ఫ్యామిలీ సందడి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ హీరోయిన్లు (ఫొటోలు)

+5

పెళ్లి వేడుకలో విజయ్‌, త్రిష సందడి.. ఫోటోలు వైరల్

+5

నిజామాబాద్‌లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య 'వృషకర్మ' గ్లింప్స్‌ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)