మరింత తగ్గిన గోల్డ్ రేటు: లేటెస్ట్ ధరలు ఇలా..

Published on Fri, 03/06/2026 - 20:59

మార్చి 2 నుంచి భారతదేశంలో బంగారం ధరలు వరుసగా తగ్గుతూనే ఉన్నాయి. ఈ రోజు ఉదయం స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేటు, సాయంత్రానికి ఇంకొంత తగ్గుముఖం పట్టింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్ప మార్పులకు లోనయ్యాయి. ఈ కథనంలో తాజా ధరలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలలో ఉదయం రూ. 1,48,600 వద్ద ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు.. సాయంత్రానికి 1,47,700 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,62,110 రూపాయల నుంచి రూ. 1,61,130 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.

ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో చాలా వ్యత్యాసం కనిపించింది. ఉదయం రూ. 1,48,750 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, సాయంత్రానికి 1,47,850 రూపాయల వద్ద నిలిచింది. 24 క్యారెట్ల రేటు 1,62,260 రూపాయల వద్ద నుంచి రూ. 1,61,280 వద్దకు చేరింది.

చెన్నైలో మాత్రం.. గోల్డ్ రేటులో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ. 1,49,600 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,63,200 వద్దనే ఉన్నాయి.

అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం ప్రారంభైనప్పుడు భారీగా పెరిగిన బంగారం ధరలు, ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. దీంతో ఐదు రోజులుగా పసిడి ధరలు తగ్గుతూనే ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడలలో మార్చి 2న రూ. 1,70,510 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఈ రోజుకు (మార్చి 6) 1,61,130 రూపాయల వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే బంగారం ధరలు ఎంత తగ్గాయో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

Videos

పాత ఓటమికి ప్రతీకారం? టీమిండియా ఫైనల్ పోరు

బలహీనపడుతోన్న ఇరాన్.. యుద్ధం ఆపేది ఎప్పుడో.. క్లారిటీ ఇచ్చిన ట్రంప్..

పాము కరిచిన కానిస్టేబుల్ ను కాపాడటానికి అమరావతిలో హాస్పిటల్ లేక...

లడ్డూపై కొవ్వు ఆరోపణలు.. భయంతో తిరుమలకు పరుగు

మరి నువ్వు, నీ కొడుకు ముగ్గురిని కనలేదు ఎందుకు? బాబుపై పేర్ని నాని సెటైర్లు

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల జీతం కట్?

రేపు అహ్మదాబాద్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్

అల్లు వారి పెళ్లి సందడి..

యుద్ధానికి వారం రోజులు.. ఎంత నష్టం అంటే..

ప్లే స్కూల్ లో చిన్నారిపై యాసిడ్ పోసిన టీచర్..

Photos

+5

మేము సాధించాం.. పతకం వచ్చింది (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో గ్రాండ్‌గా అల్లు శిరీష్ పెళ్లి వేడుక (ఫొటోలు)

+5

ఒకప్పటి హీరోయిన్ సుమలత ఫ్యామిలీ ఫొటోలు

+5

జాన్వీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

నయనిక పెళ్లి కూతురి వేడుక.. అల్లు ఫ్యామిలీ సందడి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ హీరోయిన్లు (ఫొటోలు)

+5

పెళ్లి వేడుకలో విజయ్‌, త్రిష సందడి.. ఫోటోలు వైరల్

+5

నిజామాబాద్‌లో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్‌ (ఫొటోలు)

+5

నాగచైతన్య 'వృషకర్మ' గ్లింప్స్‌ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)

+5

టి20 ప్రపంచకప్‌లో తుది పోరుకు భారత్‌ (ఫొటోలు)