విరోష్ వెడ్డింగ్ సూపర్ హిట్
Breaking News
విజయ్-రష్మిక.. ఎవరు ముందు ప్రపోజ్ చేశారంటే?
Published on Wed, 03/04/2026 - 12:40
టాలీవుడ్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకున్నారు. ఉదయ్‌పుర్ వేదికగా ఈ శుభకార్యం జరిగింది. అనంతరం సొంతూరిలో సత్యనారాయణ వ్రతం చేయడంతోపాటు నూతన గృహప్రవేశం కూడా చేశారు. తర్వాత గ్రామ ప్రజలందరికీ భోజనాలు కూడా విజయ్ పెట్టించాడు. ఈ సందర్భంగానే తన నియోజకవర్గంలలోని 9,10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్న పిల్లలకు స్కాలర్షిప్స్ ఇస్తాం, తమ్ముడు ఆనంద్ పెళ్లి ఇక్కడే చేస్తామని తదితర విషయాలు పంచుకున్నాడు. ఇప్పుడు తమ ఇద్దరిలో ఎవరు ముందు ప్రపోజ్ చేశారో విజయ్ బయటపెట్టాడు.
(ఇదీ చదవండి: 'విరోష్' పెళ్లి కానుక.. శుభవార్త చెప్పిన విజయ్ దేవరకొండ)
సొంతూరి నుంచి తిరిగి హైదరాబాద్‌కి వచ్చేసిన విజయ్-రష్మిక.. ఈ రోజు(మార్చి 04) సాయంత్రం సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఇచ్చే రిసెప్షన్లో పాల్గొనున్నారు. అంతకు ముందు అనగా మంగళవారం దాదాపు 200 మంది అభిమానులతో కలిసి బంతి భోజనం చేశారు. ఈ సందర్భంగానే పలు విషయాలు మాట్లాడారు. విజయ్ మాట్లాడుతూ.. 'గీతగోవిందం' చేస్తున్నప్పుడు తాము స్నేహితులు మాత్రమేనని, 'డియర్ కామ్రేడ్' చేస్తున్న టైంలో తమ మధ్య ప్రేమ పుట్టిందని, తర్వాత కొన్నాళ్లకు రష్మికనే తనకు లవ్ ప్రపోజ్ చేసిందని విజయ్ చెప్పినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్వతహాగా కన్నడ అమ్మాయి అయిన రష్మిక.. 'ఛలో'తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ 'గీతగోవిందం'తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకుంది. 'డియర్ కామ్రేడ్' సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయినప్పటికీ చాలామంది విరోష్ ఫ్యాన్స్‌కి ఇది ఫేవరెట్. మళ్లీ చాన్నాళ్ల తర్వాత ప్రస్తుతం 'రణబాలి'లో వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత విజయ్-రష్మిక నుంచి రాబోతున్న మూవీ ఇదే. ఈ ఏడాది సెప్టెంబరు 11న పాన్ ఇండియా రిలీజ్ కానుందని ఇదివరకే ప్రకటించారు. పీరియాడిక్ కాన్సెప్ట్‌తో తీస్తున్నారు.
(ఇదీ చదవండి: విరోష్... సెలబ్రిటీ పెళ్లిళ్లలో ట్రెండ్ సెట్టర్..)

Star couple #VijayDeverakonda and #Rashmika arranged banthi bojanalu for 200 of their fans.Served them and had lunch together.👌
A special day for all🫶🏽#Virosh
pic.twitter.com/ZGUPWMdY5o— Suresh PRO (@SureshPRO_) March 3, 2026
Tags : 1