Breaking News

మాల్ లో మొదలైన మ్యాజిక్

Published on Sun, 03/01/2026 - 05:51

పసిపాపగా మొదలైన నటి సారా అర్జున్‌ ప్రయాణం, ఇప్పుడు పాన్‌ఇండియా స్టార్‌డమ్‌ వరకూ చేరింది. ఇంకా ఎన్నో కలలు, ఎన్నో పాత్రలు, ఎన్నో విజయాలు ఆమె కోసం ఎదురుచూస్తున్నాయి. ఆ విషయాలే మీకోసం..

రెండేళ్లు కూడా లేవు!
‘‘ఇంత చిన్న వయసులోనే ఇన్ని సినిమాలు ఎలా చేశావు?’’ అని చాలామంది అడుగుతుంటారు. కాని, కెమెరా ముందు నిలబడినప్పుడు నాకు రెండేళ్లు కూడా లేవు! ఒకరోజు అమ్మానాన్నలతో కలిసి మాల్‌కు వెళ్లినప్పుడు, ఒక ప్రకటన సంస్థ ప్రతినిధి మీ పాప యాడ్‌లో నటిస్తుందా? మా పేరెంట్స్‌ని అడిగారు. అలా పద్దెనిమిది నెలల పసిపాపగా నా ప్రయాణం మొదలైంది. ఐదేళ్లకే వందకు పైగా ప్రకటనల్లో నటించాను.

క్రేజీ మెమరీ!
‘నాన్న’ సినిమా షూటింగ్‌ సమయంలో నా డైలాగులే కాదు, విక్రమ్‌ అప్పా డైలాగులు కూడా నాకు కంఠస్థం అయ్యేవి. ఆయన ఎక్కడైనా మర్చిపోతే, నేనే గుర్తు చేసేదాన్ని! ఆ సమయంలో అనుష్క శెట్టితో నాకు ఎంతో సాన్నిహిత్యం ఏర్పడింది. ‘జంక్‌ ఫుడ్‌ అస్సలు తినకు, మంచి ఆహారం తీసుకోవాలి’ అని ఆమె ఇచ్చిన సలహా ఇప్పటికీ గుర్తుంది.

గాసిప్స్‌ మామూలే!
‘ధురంధర్‌’ సినిమాలో రణవీర్‌ సింగ్‌తో ఉన్న వయస్సు తేడా గురించి సోషల్‌ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఇక ఇటీవల రాకేష్‌ బేడీ ఆప్యాయంగా పలకరించడాన్ని కూడా కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. హీరోయిన్ గా మారిన తర్వాత గాసిప్స్‌ సహజమే అని చాలా త్వరగా అర్థమైంది.  

మిగతావన్నీ తర్వాతే!
ఎన్ని సినిమాలు చేసినా, ఒక్కరోజు కూడా స్కూల్‌ మిస్‌ కాలేదు. చిత్రీకరణలన్నీ సెలవుల్లోనే ఉండేలా నాన్న జాగ్రత్తగా ప్లాన్‌ చేసేవారు. చదువు, సినిమా రెండింటినీ బ్యాలెన్స్‌ చేయటం మా కుటుంబం ఇచ్చిన పెద్ద బలం.

ప్రశ్నలే నా  గురువులు!
‘నాకు కొత్త ప్రదేశాలను చూడటం అంటే చాలా ఇష్టం. ట్రావెలింగ్‌లో ఎంతోమంది రకరకాల మనుషులు పరిచయమవుతుంటారు. ఎవరిని కలిసినా వివిధ ప్రశ్నలు అడుగుతుంటాను. వారి అలవాట్లు, మాట్లాడే తీరు గమనిస్తూ ఉంటాను. ఆ పరిశీలనే నేను చేసే పాత్రలకు ప్రాణం పోయడానికి  సహాయపడుతుంది.

ప్రేమ అంతా సినిమాలపైనే!
పాత్రల ఎంపికలో చాలా జాగ్రత్త వహిస్తాను. ‘యుఫోరియా’లో నేను చేసిన పాత్ర ప్రతి అమ్మాయికి కనెక్ట్‌ అవుతుంది. కేవలం గ్లామర్‌ పాత్రలకే పరిమితం కాకుండా, భావోద్వేగ భరితమైన, శక్తిమంతమైన పాత్రల్లో నటించాలని కోరుకుంటున్నాను.

రికార్డుల దిశగా దూసుకెళ్తూ! 
ఇటీవల ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌ (ఐఎమ్‌డీబీ) విడుదల చేసిన ‘అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ సెలబ్రిటీల’ జాబితాలో తొలి స్థానంలో నిలవడం నాకు ఆనందంతో పాటు ఆశ్చర్యం కలిగించింది. దానిని నేను గౌరవంగా భావిస్తున్నాను. ఇది ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమకు నిదర్శనం.

ఇష్టాలు..!
» అభిమాన నటుల్లో హీరో విజయ్‌ దేవరకొండ అంటే పెద్ద క్రష్‌! ఆయన ఎనర్జీ అంటే నాకు చాలా ఇష్టం. తమిళంలో సూర్య  నా ఫేవరెట్‌. ఇక హీరోయిన్లలో ఐశ్వర్య రాయ్‌ని చూస్తూ పెరిగాను. ఆమె నా ఆదర్శం. 
»ఆహారంలో హైదరాబాద్‌ బిర్యానీ అంటే పిచ్చి. కాని, ఇప్పుడు ఆరోగ్యం కోసం డైట్‌ పాటిస్తున్నాను. అలాగే, నా డాగీతో గడిపే సమయం నాకు అత్యంత ప్రియమైనది.

Videos

హర్మూజ్ జలసంధిలో ఇరాన్ దెబ్బ.. మంటల్లో ఆయిల్ ట్యాంకర్లు

అంబటి రాంబాబు హీరో.. లోకేష్.. గుర్తుపెట్టుకో.. పిచ్చిపిచ్చి వేషాలేస్తే..

అమెరికా.. ఇజ్రాయెల్ దాడులు.. ఒంటరిగా వణికిస్తున్న ఇరాన్

ఇరాన్ రివర్స్ ఎటాక్ అమెరికా ఊహించని దెబ్బ

కిచెన్ లో కౌగిలింతలు అడ్డంగా దొరికిన BR నాయుడు

దుబాయ్ లో హైటెన్షన్ బుర్జ్ ఖలీఫాపై ఇరాన్ దాడి

చీకటి శకం ముగిసింది ఇరాన్ వీధుల్లో సంబరాలు

రేవంత్ తో చంద్రబాబు కుమ్మక్కు.. రాయలసీమ ప్రాజెక్టుపై సజ్జల డిమాండ్స్

ఖమేనీ హత్యపై అసదుద్దీన్ ఒవైసీ రియాక్షన్

పులకేష్ ని మైమరిపిస్తున్న లోకేష్

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో బ్రహ్మానందం కొడుకు (ఫొటోలు)

+5

హైదరాబాద్ టీటీడీ ఆలయంలో విజయ్-రష్మిక (ఫొటోలు)

+5

శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీలో అల్లు అర్జున్-స్నేహ (ఫొటోలు)

+5

ఇరాన్‌: ఖమేనీ మృతి.. మద్దతుదారుల కన్నీరుమున్నీరు (ఫొటోలు)

+5

మహిళ కబడ్డీ మూవీ ప్రెస్‌ మీట్ (ఫొటోలు)

+5

విష్ణు విన్యాసం మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సన్‌ ఆఫ్‌ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

లాంచనంగా మొదలైన శ్రీకాంత్ కొడుకు కొత్త సినిమా (ఫొటోలు)

+5

లుక్ మార్చేసిన శ్రీముఖి.. అందంతో మెరిసిపోతుందిగా! (ఫొటోలు)