పడితేనే రెండు ఎముకలు విరిగాయి.. నిజంగా కొట్టి ఉంటే ఎన్ని విరిగేవి? IPS సునీల్ కుమార్
Breaking News
ట్రూజాన్ సోలార్ టార్గెట్ రూ.650 కోట్లు!
Published on Sat, 02/28/2026 - 07:44
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సౌర విద్యుత్ వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కార్యకలాపాలను గణనీయంగా విస్తరిస్తున్నట్లు ట్రూజాన్ సోలార్ పేరిట సౌర విద్యుదుత్పత్తుల సేవలందించే సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్ వ్యవస్థాపకుడు సీహెచ్ భవానీ సురేష్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 300–350 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో దీనికి రెట్టింపు స్థాయిలో రూ. 600–650 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఇప్పటివరకు రెసిడెన్షియల్, కమర్షియల్ తదితర విభాగాల్లో 10,000కు పైగా రూఫ్‌టాప్ ఇన్‌స్టాలేషన్స్ చేసినట్లు ఆయన చెప్పారు.
ప్రస్తుతం 600 మంది పైగా సిబ్బందితో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు 5 రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నామని సురేష్ తెలిపారు. వచ్చే నాలుగైదు నెలల్లో తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్ తదితర 4 రాష్ట్రాలకు విస్తరిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇప్పటివరకు దాదాపు రూ. 80 కోట్లు ఇన్వెస్ట్ చేశామన్నారు.
Tags : 1