Breaking News

కూరగాయ హీరోల 'పోకిరి' కిరి

Published on Sat, 02/28/2026 - 06:16

‘‘ఎవరు కోశాక... లోపలంతా బ్లాక్‌ అయి పోద్దో... వాడే పండుగాడు... ఆపిల్‌ పండుగాడు’’ అని పంచ్‌ డైలాగ్‌ విసిరింది ఆపిల్‌. 
ఈమధ్య మార్కెట్‌ నుంచి తెచ్చాక... కాసేపవి బయటే ఉండటం, ఫ్రిజ్‌ నుంచి తీశాక మళ్లీ బయటకు రావడం... ఇలా బయట ఉన్న సమయంలో టీవీలో వచ్చే సినిమాలు చూడటం మన కూరగాయలూ, పండ్లూ వీటన్నింటికీ పరిపాటి అయ్యింది.
దాంతో వాటికీ మన తెలుగు హీరోల డైలాగులు నోటికే వచ్చేస్తున్నాయి. పైగా అన్నీ మన మహేష్‌బాబు పంచ్‌డైలాగులు చెప్పడానికే ప్రిఫర్‌ చేస్తున్నాయి. బేసిక్‌గానే మనమూ, మన సమాజమంతా సినిమా పిచ్చోళ్లమే కాబట్టి మన దారిలోనే అవి కూడా నడుస్తున్నాయంటూ సరిపెట్టుకున్నా. 
  
ఈలోపు టొమాటో  ఓ డైలాగ్‌ కొట్టిందిలా! (అన్నట్టు వీడి పేరు కూడా పండుగాడేనట. నిజానికి... అసలు పండుగాడు వీడేనట. అదీ వాడి క్లెయిము). 
‘‘ఏదీ... నిన్నొకసారి చూడనీ. నిన్న నాతో కూర్చుని ‘టమాట ఆలుగడ్డ’ కూర డీల్‌ సెట్‌ చేసుకుని... ఇవాళ్ల మళ్లీ వాళ్లలో కలిసి నాతోనే మీటింగ్‌లో కూర్చుంటావా?’’ (టొమాటో) పండును అడిగింది ఆలుగడ్డ. 

‘‘నాకు వాడూ... వీడూ అనే తేడా లేదు. ఇప్పుడు కందిపప్పుగాడు అడిగాడనుకో... వెంటనే ‘టమాట పప్పు’ కాంబినేషన్‌గా వస్తా. ఒక్కసారి కమిట్‌ అయితే నా షేపులో నేనే ఉండను’’ అన్నాడు టొమాటో పండుగాడు. 
‘‘ఏయ్‌... నీకు కాంబినేషన్‌ నీతీ న్యాయమంటూ ఏమీ లేవా?’’ అడిగింది వాంప్‌ మిస్‌ మిరపకాయ్‌. 

‘‘లేవు... టమాటా పప్పే కాదు... జస్ట్‌ కూరగాయలతోనే కాదు... రవ్వతో కలిసి కూడా ‘టొమాటో బాత్‌’ అయి పోతాన్నేను’’ అంది టొమాటో. 
‘‘అందుకేరా నువ్వంటే నాకిష్టం’’ అంటూ... ‘‘వీణ్ణి మన దగ్గర పెట్టుకుంటే ‘వంకాయ్‌–టమాటా’, ‘టమాట–కోడిగుడ్డు కూర’, ‘టమాట రైస్‌’ కూడా చేసుకోవచ్చు. ఆఖరికి మన పండుగాడు టమాట పచ్చడీ, పులుసూ, సలాడ్‌ గా కూడా పనికొస్తాడు’’ సలహా ఇవ్వడంతోపాటు... అలా వగలు  పోతూ ‘‘దీంతో కోసుకు పో’’ అంటూ ఓ కత్తిని సర్రుర్రున విసిరేసింది మిస్‌ మిరప.  

అలా కత్తి గాల్లో ఉండగానే... ఇలా దాన్ని ఆనుకొని... ముందు ముక్కలుముక్కలుగా, తర్వాత ప్యూరీలాగా జ్యూసుగా, అంతలోనే టొమాటో కెచప్‌గా, ఇంతలోనే సాస్‌గా... ఇలా రకరకాల విన్యాసాలు చేశాడు పండుగాడు.

‘‘కత్తి బాగా అలవాటా? చకచకా ఇన్నిరకాలుగా మారి పోయావ్‌’’ అడిగాడు కూరగాయల గంపలోని క్యాబేజీగాడు. 
‘‘వంటల ప్రోగ్రాములు చూడ్డం లేదేటి’’ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు (టొమాటో)  పండుగాడు. 
  
ఇక ప్రతి చిన్నాచితకా కూరగాయ్‌గాడూ, కోన్‌కిస్కా వెజిటబుల్‌గాడూ రకరకాల పంచ్‌ డైలాగులు కొట్టేస్తుండటంతో చికాకు పడుతూ... చిట్టచివరిగా చేతికి అందిన కొరియాండర్‌ గాణ్ణి పట్టుకుని... ‘‘ఇంత లేట్‌గానట్రా చేతికి అందడం?!’’ అంటూ చివాట్లు పెట్టబోయాడు డైరెక్టర్‌ ‘షెఫ్‌’గారు. అందుకు కొత్తిమీర చెప్పిన సమాధానం తో నోట్లోంచి మాట కూడా రానంతగా అవాక్కయ్యాడు. 
ఇంతకూ కొత్తిమీర కట్టగాడన్న డైలాగేమిటో తెల్సా?
‘‘ఎప్పుడొచ్చామని కాదన్నయ్యా... గార్నిష్‌ అయ్యామా లేదా?’’ 

– యాసీన్‌

#

Tags : 1

Videos

యుద్ధం మొదలు.. ముందస్తు దాడి ప్రారంభించిన ఇజ్రాయెల్

ఇంటర్ పరీక్ష రాస్తుండగా బాలికకు గర్భస్రావం

దగ్గుబాటి, నందమూరి ఈసారి ప్లాన్ మామూలుగా లేదుగా

ఇరాన్ పై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్.. అమెరికాతో కలిసి జాయింట్ ఆపరేషన్..!

నువ్ మనిషివే కాదు.. ఒక నీచమైన.. నిన్ను తిట్టడానికి నా దగ్గర మాటలు కూడా లేవు

రాష్టంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే.. నోటీసిలిచ్చుకుంటూ ఉంటారా..

నేను ఆయనలా భయపడతా అనుకోకు.. లోకేష్‌కు జడ శ్రవణ్ వార్నింగ్

ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు.. టెహ్రాన్ లో బాంబుల వర్షం

వంద కోట్ల భూమి హాంఫట్.. అనకాపల్లి కలెక్టర్ పై CBI విచారణ!

నన్ను చంపేందుకు యత్నాలు.. తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

విజయ్‌ పెళ్లిలో ఈషా రెబ్బ‌, తరుణ్‌ భాస్కర్‌ అట్రాక్షన్‌ (ఫోటోలు)

+5

ట్రెండింగ్ లో హీరోయిన్ త్రిష.. ఎందుకో తెలియదు (ఫొటోలు)

+5

ఉదయపూర్ ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేసిన 'విరోష్‌' జోడీ (ఫొటోలు)

+5

వరంగల్‌ : నిట్‌లో ఉత్సాహంగా స్ప్రింగ్‌స్ప్రీ–2026 (ఫొటోలు)

+5

తిరుపతి ఐఐటీలో ఉత్సాహంగా తిరుత్సవ్‌–2026 (ఫొటోలు)

+5

హోలీ : రంగులు చల్లుకుని ఉత్సాహంగా డ్యాన్స్‌ (ఫొటోలు)

+5

ప్రముఖ ఆలయాలు సందర్శించిన ఆది పినిశెట్టి దంపతులు (ఫోటోలు)

+5

మేడ్‌ ఫర్ ఈచ్ అదర్‌ రియాలిటీ షో.. స్పెషల్ అ‍ట్రాక్షన్‌గా సీనియర్ హీరోయిన్స్ (ఫోటోలు)

+5

ఈరోజు నేనిలా ఉండటానికి నువ్వే కారణం: విరానిక ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

జాలీగా గడిపేస్తున్న మెహరీన్‌ (ఫోటోలు)