యుద్ధం మొదలు.. ముందస్తు దాడి ప్రారంభించిన ఇజ్రాయెల్
Breaking News
జీడీపీకి కొత్త జోష్!
Published on Sat, 02/28/2026 - 05:43
న్యూఢిల్లీ: తయారీ, సేవల రంగాల రాణింపుతో దేశ జీడీపీ వృద్ధి రేటు డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో 7.8 శాతంగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు 8.4 శాతంతో పోలి్చతే కీలకమైన పండుగల సీజన్‌లో, అది కూడా జీఎస్‌టీ రేట్ల తగ్గింపు తర్వాత వృద్ధి వేగం నిదానించడం గమనార్హం. త్రైమాసికంగా నీరసించినప్పటికీ, 2024–25 సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం జీడీపీ వృద్ధి 7.4 శాతంతో పోలి్చతే మెరుగుపడింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు అంచనా 7.4 శాతం నుంచి 7.6 శాతానికి పెరిగింది.
ఇప్పటి వరకు జీడీపీ గణాంకాలకు 2011–12 బేస్ సంవత్సరంగా ఉండేది. దీన్ని 2022–23కు మార్చారు. అలాగే, జీఎస్‌టీ, ఈ–వాహన్ పోర్టల్‌పై రిజి్రస్టేషన్ల డేటా, పబ్లిక్ ఫైనాన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (పీఎఫ్‌ఎంఎస్) డేటాను కొత్తగా జీడీపీ గణనలోకి చేర్చారు. దీంతో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) ఈ వివరాలు విడుదల చేసింది. పాత కాలం నాటి గణనపై విమర్శలకు సమాధానంగా.. ఆర్థిక వ్యవస్థలో కీలకమైన డేటాకు చోటు కలి్పస్తూ, వాస్తవ వృద్ధిని ప్రతిఫలించేలా కేంద్రం సవరణలు తీసుకొచ్చింది.
→ కొత్త బేస్ సంవత్సరం ఆధారంగా ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1 జీడీపీ వృద్ధి అంచనా 7.8% నుంచి 6.7 శాతానికి తగ్గింది.
→ క్యూ 2 (సెపె్టంబర్ క్వార్టర్) జీడీపీ వృద్ధి అంచనాను పాత బేస్ సంవత్సరం ఆధారంగా 8.2 శాతంగా అంచనా వేయగా, కొత్త బేస్ సంవత్సరం ఆధారంగా 8.4 శాతానికి సవరించారు.
→ 2025–26లో రియల్ జీడీపీ (స్థిర ధరల వద్ద) రూ.322.58 లక్షల కోట్లుగా ఉంటుంది. 2024–25 అంచనా రూ.299.89 లక్షల కోట్లతో పోలి్చతే వృద్ధి రేటు 7.6%గా ఉంటుంది. 2025–26 సంవత్సరం నామినల్ జీడీపీ వృద్ధి 8.6 శాతంగా ఉంటుంది.
→ కొత్త బేస్ సంవత్సరం ఆధారంగా 2023–24లో రియల్ జీడీపీ 7.2 శాతం, 2024–25లో 7.1
శాతానికి సవరించారు.
→ తయారీ రంగం 2025–26లో డబుల్ డిజిట్ వృద్ధిని సాధిస్తుంది. వాణిజ్యం, రిపెయిర్, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్ సేవలు, స్టోరేజ్ రంగాల్లో వృద్ధి 10.1 శాతంగా ఉంటుంది.
అంచనాలను మించే..
జీడీపీ వృద్ధి గణాంకాలు తమ అంచనాలకు మించి ఉన్నట్టు ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ పేర్కొన్నారు. ‘వ్యవసాయం, మైనింగ్, విద్యుత్, నిర్మాణ రంగాల వల్లే జీడీపీ వృద్ధి మోస్తరు స్థాయికి పరిమితమైంది. తయారీ జీవీఏ మాత్రం వరుసగా ఐదో త్రైమాసికంలోనూ డబుల్ డిజిట్ వృద్ధి చెందింది. సేవల రంగం జీవీఏ వృద్ధి 7 త్రైమాసికాల గరిష్ట స్థాయి అయిన 9.5%కి మెరుగుపడింది. అంతక్రితం త్రైమాసికంలో (సెప్టెంబర్ క్వార్టర్) ఇది 9.3%గా ఉంది’ అని నాయర్ వివరించారు.
4 ట్రిలియన్ డాలర్లు దాటుతుంది..
వచ్చే ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాలను కొత్త సిరీస్ ఆధారంగా, 20 బేసిస్ పాయింట్లు పెంచి (0.20 శాతం) 7–7.4 శాతానికి సవరించినట్టు.. జీడీపీ 4 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను అధిగమిస్తుందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ తెలిపారు. 2026–27 ఆర్థిక సర్వేలో 6.8–7.2%గా అంచనా వేయడం గమనార్హం. నామినల్ జీడీపీ వృద్ధి 11 శాతానికి చేరుకోవచ్చన్నారు.
గత మూడేళ్లలో తలసరి ఆదాయం వాస్తవంగా 6.3–6.4 శాతం పెరిగిందని.. అదే నామమాత్ర ప్రమాణంలో 3% కంటే ఎక్కువే ఉంటుందన్నారు. గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ కార్యదర్శి సౌరబ్ గార్గ్ మాట్లాడుతూ.. జీడీపీ గణనలోకి డేటా వనరులను పెంచడం వల్లే బేస్ సంవత్సరాన్ని 2022–23కు మార్చాల్సి వచి్చనట్టు వివరించారు. ఆర్థిక వ్యవస్థలో గత పదేళ్లలో ఎన్నో నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకున్నాయని, డిజిటల్ ఆర్థిక లావాదేవీలు గణనీయంగా పెరిగాయని, దీంతో ఎన్నో డేటా వనరులు అందుబాటులోకి వచ్చినట్టు చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7.3 శాతంగా ఉండొచ్చన్నారు.
Tags : 1