Breaking News

ఇండియాకు కొత్త కారు వచ్చేస్తోంది!

Published on Fri, 02/27/2026 - 19:26

భారతీయ ఆటోమొబైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో.. చాలామంది వాహన కొనుగోలుదారులు ఎక్కువ రేంజ్ ఇచ్చే కార్ల కోసం వేచి చూస్తుంటారు. అలాంటి వారికోసమే జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ 'జెటోర్ టీ2' (Jetour T2) లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది.

జేఎస్‌డబ్ల్యూ మోటార్స్ తన జెటోర్ టీ2 కారును లాంచ్ చేయడానికి ముందే.. దీనికి సంబంధించిన టీజర్ రిలీజ్ చేసింది. దీనిని మహారాష్ట్రలోని దాని రాబోయే ఛత్రపతి సంభాజీనగర్ (గతంలో ఔరంగాబాద్) ప్లాంట్‌లో అసెంబుల్ చేయనున్నారు. ఇది 1000 కిమీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించేలా రూపొందిస్తున్నట్లు సమాచారం.

జెటోర్ టీ2 గ్లోబల్ మార్కెట్లో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) & ఆల్-ఎలక్ట్రిక్ (EV) వెర్షన్లలో అందుబాటులో ఉంది. అయితే ఇండియన్ మార్కెట్లో మాత్రం హైబ్రిడ్ రూపంలో మాత్రమే అందుబాటులో ఉంటుందని సమాచారం. అంటే ఇది చిన్న బ్యాటరీ, పెట్రోల్ ఇంజిన్  కూడా పొందుతుందన్నమాట

హైబ్రిడ్ వెర్షన్ 26.7kWh బ్యాటరీ ప్యాక్‌తో జత చేసిన.. 154hp / 220Nm అందించే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది సింగిల్ మోటార్ FWD సెటప్ లేదా డ్యూయల్-మోటార్ AWD లేఅవుట్‌లో లభిస్తుంది. బ్యాటరీ ప్యాక్ రేంజ్ 139 కి.మీ. కాగా పెట్రోల్ ఇంజిన్ కూడా మంచి మైలేజ్ ఇస్తుందని చెబుతున్నారు. ఒక ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ద్వారా ఎక్కువ మైలేజ్ లభించనుంది. కాబట్టి మొత్తం మైలేజ్ 1000 కిమీ కంటే ఎక్కువ వస్తుంది. జెటోర్ టీ2 కారు ధరలు రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షల మధ్య ఉంటుందని అంచనా.

ఇదీ చదవండి: అమెరికాను వీడుతున్న జనం.. ఎందుకంటే?

Videos

పడితేనే రెండు ఎముకలు విరిగాయి.. నిజంగా కొట్టి ఉంటే ఎన్ని విరిగేవి? IPS సునీల్ కుమార్

50 ఏళ్ల వయసులో 29 ఏళ్ల హీరోతో టబు రొమాన్స్

నెట్టింట్లో వైరల్ అవుతున్న విజయ్ దేవరకొండ మాజీ ప్రేయసి ఫోటోలు

అఫ్గానిస్థాన్‌పై పాక్‌ దాడులు

మీ అహంకారమే ఓటమికి కారణం.. కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత ఫైర్

మహారాష్ట్రలో ఘోర అగ్ని ప్రమాదం..

ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి..? కల్తీ పాలు, కలుషిత నీటిపై జగన్ ఫైర్

టీడీపీ జెండా మోసినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకుంటున్నా

దేవునికే టోపీ.. ఆన్ లైన్ లో కిలో నెయ్యి రూ.529.. టీటీడీకి మాత్రం రూ.638..

ప్రేమిస్తే ఖతమే! ప్రాణం తీస్తున్న పేరెంట్స్..

Photos

+5

ఉదయపూర్ ఎయిర్‌పోర్ట్‌లో సందడి చేసిన 'విరోష్‌' జోడీ (ఫొటోలు)

+5

వరంగల్‌ : నిట్‌లో ఉత్సాహంగా స్ప్రింగ్‌స్ప్రీ–2026 (ఫొటోలు)

+5

తిరుపతి ఐఐటీలో ఉత్సాహంగా తిరుత్సవ్‌–2026 (ఫొటోలు)

+5

హోలీ : రంగులు చల్లుకుని ఉత్సాహంగా డ్యాన్స్‌ (ఫొటోలు)

+5

ప్రముఖ ఆలయాలు సందర్శించిన ఆది పినిశెట్టి దంపతులు (ఫోటోలు)

+5

మేడ్‌ ఫర్ ఈచ్ అదర్‌ రియాలిటీ షో.. స్పెషల్ అ‍ట్రాక్షన్‌గా సీనియర్ హీరోయిన్స్ (ఫోటోలు)

+5

ఈరోజు నేనిలా ఉండటానికి నువ్వే కారణం: విరానిక ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

జాలీగా గడిపేస్తున్న మెహరీన్‌ (ఫోటోలు)

+5

పిల్లాడే కాదు, మేమూ మిస్‌ అవుతాం: కాజల్‌ (ఫోటోలు)

+5

బ్లాక్‌ చీరలో నటి నివేథా థామస్.. గ్లామ్‌ లుక్స్‌ (ఫోటోలు)